Rahul Gandhi: దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిస్తాం ? రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్
National News: భారత్‌లో కొనసాగుతున్న రిజర్వేషన్లపై లోక్‌సభలో అపోజిషన్ లీడర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi Comments On Reservations: అమెరికాలోని జార్జ్‌టన్ యూనివర్శిటీ స్డూడెంట్స్‌లో జరిగిన చర్చలో పాల్గొన్న లోక్‌సభలో అపోజిషన్ లీడర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్‌లో కొనసాగుతున్న రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశం ఇప్పుడున్న స్థితి కంటే మెరుగ్గా మారితే దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిస్తామని రాహుల్ అన్నారు. ప్రస్తుతానికి రిజర్వేషన్ల రద్దు గురించి చర్చ అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. జార్జ్‌టన్ యూనివర్శిటీ స్డూడెంట్స్‌లో జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి రిజర్వేషన్లు ఇంకెంత కాలం భారత్‌లో కొనసాగుతాయని ప్రశ్నించగా.. రాహుల్ ఆసక్తికరమైన ఆన్సర్ చేశారు.
ప్రస్తుతం భారత్‌లో ఇంకా ఎందరి జీవితాలో మారాల్సి ఉందని.. ఆ మార్పు వచ్చిన తర్వాత రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిద్దామన్నారు. భారత ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాల్లో.. ప్రతి వంద రూపాయాల్లో పది పైసలు మాత్రమే ట్రైబల్స్‌కు అందుతున్నాయని.. దళితులకైతే వంద రూపాయల్లో ఐదు రూపాయలు చేరుతున్నాయని.. ఓబీసీల పరిస్థితి కూడా ఇలానే ఉందన్నారు. ఈ కారణంగానే భారత ఆర్థిక వ్యవస్థలో ఈ వర్గాలు పార్ట్ కాలేకపోతున్నాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. దాదపు 90 శాతం మంది ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్నారని.. అందులో మార్పు వచ్చిన రోజే రిజర్వేషన్ల రద్దు సాధ్యమని అన్నారు.
భారత్‌లోని టాప్ బిజినెస్‌మేన్‌లలో ట్రైబల్స్ ఎందుకు లేరు?
భారత దేశ బిజినెస్ మేన్‌ల లిస్ట్‌ను పరిశీలించినపప్పుడు అందులోని తొలి వంద పేర్లలో ఒక్క ట్రైబల్ పేరు కూడా తనకు కనిపించలేదని రాహుల్ అన్నారు. దళితులకు, ఓబీసీలకు కూడా అందులో స్థానం లేదని చెప్పారు.
ఓబీసీలు భారత జనాభాలో 50 పర్సెంట్ ఉన్నారన్న విషయాన్ని మరిచి పోకూడదని.. అయితే తొలి 200 మంది అధికారుల జాబితాలో మాత్రం ఒక్క ఓబీసీ పేరు మాత్రమే చూడగలిగానని.. ఇది భారత రియాలటీకి అద్దం పడుతోందని అన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. ఆ ఛేంజ్ తీసుకురావడనికి ఉన్న టూలే రిజర్వేషన్లని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇందుకు భిన్నంగా అప్పర్ కాస్ట్ నుంచి వచ్చిన వాళ్లు దేశంలో ఒక వితండ వాదం తెస్తున్నారని.. అకారణంగా తాము శిక్ష అనుభవిస్తున్నట్టు చెబుతున్నారని.. ఈ పరిస్థితి మారాలని గగ్గోలు పెట్టడం సరికాదని రాహుల్ విమర్శించారు.
ఈ వ్యవహారశైలి మంచిది కాదని.. అధికార వికేంద్రీకరణ గురించి వారు ఆలోచించాలని.. ప్రభుత్వంలో అన్ని వర్గాలను పార్ట్ చేయడంపై దృష్టి పెట్టాలని గాంధీ సూచించారు. అందరూ అదానీలు అంబానీలుగా మారలేరని వారి కోసం ద్వారాలు ఏమీ తెరుచుకోనిలేవని.. కేవలం జనరల్ కాస్ట్ సిస్టమ్ ద్వారనే వాళ్లు అదానీలు అంబానీలుగా మారగలుగుతున్నారని వ్యాఖ్యానించారు.
మోదీ అంటే ద్వేషం లేదు: రాహుల్
యూనిఫామ్ సివిల్ కోడ్ పై ప్రశ్న ఎదురు కాగా.. బీజేపీ సర్కారు రూపొందించే బిల్లులో ఏముందో చూసిన తర్వాత మాత్రమే తాను మాట్లాడతానని అన్నారు. అటు ఇండియా కూటమిలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ తమ మధ్య అనేక విషయాల్లో ఏకాభిప్రాయాలు ఉన్నాయని వివరించారు. కులగణన విషయంలో అందరూ ఒకే మాటగా ఉన్నామని రాహుల్ పేర్కొన్నారు. మోదీ అంటే తనకు ఎలాంటి ద్వేషం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ఇదే వేదికపై మాట్లాడిన ఆయన... మోదీ వేరే దృక్కోణం ఉందని తన దృక్కోణం వేరని చెప్పుకొచ్చారు. ఆయన విధానాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నాని అంతే కానీ ఆయనపై ఎలాంటి కోపం లేదని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న అధికార NDA కూటమిపై విమర్శలు గుప్పిస్తుండగా.. విదేశీ గడ్డపై రాహుల్ భారత్ పరువు తీస్తున్నాడంటూ బీజేపీ మండిపడుతోంది.
Also Read: పాకిస్తాన్‌తో చర్చలకు సిద్ధం- బట్ కండిషన్స్ అప్లై అంటున్న రాజ్‌నాథ్ సింగ్