By: ABP Desam | Updated at : 28 Sep 2023 06:30 AM (IST)
జమిలి సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపకల్పనకు టైమ్ లైన్ లేదు-లా కమిషన్ ఛైర్మన్ జస్టిజ్ రితురాజ్ అవస్తీ
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపకల్పనకు తుది రూపు ఇవ్వలేదనన్నారు లా కమిషన్ ఛైర్మన్ జస్టిజ్ రితురాజ్ అవస్తీ. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు జరుగుతోందన్నారు. నివేదిక రూపకల్పన పూర్తి చేసేందుకు ఎలాంటి టైమ్ లేదని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికల నివేదిక రూపకల్పన కొంత పని చేయాల్సి ఉందన్న అవస్తీ, నివేదిక ఖరారు చేయడానికి మరికొంత సమయం పడుతుందని వెల్లడించారు. దేశంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయుల్లో ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. పోక్సో చట్టం, ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్‌లపై నివేదికలను ఖరారు చేసి న్యాయ మంత్రిత్వశాఖకు పంపినట్టు చెప్పారు.
దేశంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు, అన్ని స్థాయిల్లో ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తొలి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల అభిప్రాయలను స్వీకరిస్తామని చెప్పింది. దీంతో పాటు లా కమిషన్ సలహాలను సైతం తీసుకుంటామని స్పష్టం చేసింది. కార్యాచరణ ప్రణాళికలు, అధికారిక సంప్రదింపులు ఎలా జరపాలన్న అంశాలపై కమిటీ చర్చించింది. కేంద్రం నిర్దేశించిన పనులకు పేపర్ వర్కు తయారు చేయడం, అవసరమైన విషయాలపై లోతైన పరిశోధనలు చేయడంపై చర్చలు జరిగినట్లు తెలిసింది.
జమిలి ఎన్నికల సాధ్యానికి అవసరమయ్యే రాజ్యాంగ సవరణలు, వాటికి రాష్ట్రాల అంగీకారం అవసరమా.. ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యంకాకపోతే.. కాలవ్యవధులపై సిఫార్సులు వంటి పనులను కేంద్రం.. కమిటీకి నిర్దేశించింది. వీటితోపాటు జమిలి ఎన్నికలకు పెద్దమొత్తంలో అవసరమయ్యే ఎన్నికల పరికరాలపై నివేదిక ఇవ్వాలని సూచించింది. 1952 నుంచి కొన్నేళ్లు ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించి మధ్యలో ఆ పద్ధతి మారడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. అలాంటిది మళ్లీ పునరావృతం కాకుండా ఏం చేయాలో ప్రతిపాదనలు సూచించాలని కమిటీకి సూచించింది కేంద్రం.
ఒకే దేశం- ఒకే ఎన్నికలు నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు.. శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు స్థానం కల్పించింది. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాశ్ సీ కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఉన్నారు. అయితే కమిటీలో కాంగ్రెస్ MP అధీర్ రంజన్ చౌదరి పేరును కేంద్రం సిఫార్సు చేసినా.. తాను ఉండబోనని చెప్పారు. కమిటీ స్వతంత్రంగా ఉండదని, కేంద్రం చెప్పినట్లే వింటుందని అనుమానం వ్యక్తం చేశారు.
ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు
RRC: నార్త్ సెంట్రల్ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్‌దే! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
Chattisgarh Exit Poll 2023 Highlights: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలవడం కష్టమేనా? ఆసక్తికరంగా ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు
Mizoram Exit Poll 2023 Highlights: మిజోరంలో మళ్లీ MNFదే అధికారం! అంచనా వేసిన ABP CVoter ఎగ్జిట్ పోల్
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !
/body>