Rtd. Colonel Vijay Rawat: బీజేపీలోకి బిపిన్ రావత్ సోదరుడు, రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్
దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సోదరుడు, రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు.
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు, రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమక్షంలో విజయ్ రావత్ బీజేపీలో చేరారు.
'బీజేపీలో చేరే అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడను. మా నాన్న పదవీ విరమణ చేసిన తర్వాత బీజేపీలోనే ఉన్నారు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. ప్రధాని మోడీ విజన్, ఆలోచన చాలా తెలివైనది.' అని విజయ్ రావత్ అన్నారు.
అంతకుముందు రోజు కూడా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని విజయ్ రావత్ కలిశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2022కి కొన్ని రోజుల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడంపై ఆసక్తి నెలకొంది.
రావత్‌ను పార్టీలో చేరిన తర్వాత... ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ మాట్లాడారు. రావత్ కుటుంబం మూడు తరాలుగా సైన్యంలో సేవలందిస్తోందన్నారు. బీజేపీది జాతీయవాద భావజాలమని, భద్రతా సిబ్బంది సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన్నట్టు చెప్పారు. విజయ్ రావత్ రాకతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
आज दिल्ली में देश के प्रथम CDS और उत्तराखण्ड के अभिमान स्वर्गीय श्री बिपिन रावत जी के भाई कर्नल विजय रावत जी से भेंट की। बिपिन रावत जी व उनके परिवार द्वारा की गई राष्ट्रसेवा को हमारा नमन है। मैं सदैव उनके सपनों के अनुरूप उत्तराखण्ड बनाने हेतु कार्य करता रहूंगा। pic.twitter.com/iACim4sNqG
— Pushkar Singh Dhami (@pushkardhami) January 19, 2022
Also Read: Aparna Yadav BJP: ములాయం సింగ్ దీవెనలతోనే భాజపాలో చేరాను: ABPతో అపర్ణా యాదవ్
Also Read: Aparna Yadav Joins BJP: అనుకున్నట్లే అయింది.. భాజపాలోకి ములాయం చిన్నకోడలు.. సమాజ్‌వాదీలో గుబులు!
Also Read: UP Election 2022: ఊ అన్న అఖిలేశ్ యాదవ్.. యూపీ ఎన్నికల బరిలో ఇక సమరమే!
Also Read: Republic Day 2022: రిపబ్లిక్ డే వేడుకల్లో ఉగ్ర కుట్రకు ప్రణాళిక.. అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి