By: ABP Desam | Updated at : 19 Jan 2022 08:16 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
రిపబ్లిక్ డే నాడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సహా ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో.. ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీని ప్రకారం.. వీఐపీలను టార్గెట్ చేసే సూచనలు కనపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సైతం.. కీలక సమాచారం ఇచ్చింది. దీంతో భద్రతాదళాలు అలర్ట్ అయ్యాయి.
నిఘావర్గాల ప్రకారం.. నిషేధిత ఖలిస్థానీ సంస్థ సిక్ ఫర్ జస్టిస్ రిపబ్లిక్ డే రోజున ఉగ్రవాద దాడి చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి టెర్రరిస్ట్ గ్రూపులు ఈ ఉగ్ర ముప్పు వెనుక ఉన్నట్టు సమాచారం. కార్లలో పేలుడు పదార్థలను పెట్టి.. ఇండియా గేట్ మరియు ఎర్రకోట చుట్టూ దాడి చేయవచ్చని కూడా నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ఈ గణతంత్ర వేడుకలకు మధ్య ఆసియా దేశాలు.. కజకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్థాన్, తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నాయకులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించే అవకాశం ఉంది. అయితే ఉగ్రవాదులు.. భారత ప్రతిష్టను దెబ్బ తీయాలని పథక రచన చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి పేలుడు పదార్థాలను భారత్‌కు తీసుకువచ్చినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది. అయితే.. పోలీసులు జనవరి 20 నుంచి ఢిల్లీని యాంటీ డ్రోన్ జోన్‌గా ప్రకటించారు. డ్రోన్లు, పారా గ్లైడర్లు, యూఏవీలు, చిన్న మైక్రో ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎయిర్ బెలూన్లపై నిషేధం విధించారు. ఢిల్లీలో యాంటీ డ్రోన్ సిస్టమ్ ఫిబ్రవరి 15 వరకు అమల్లో ఉంటుందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా తెలిపారు. ఉగ్రకుట్ర సమాచారంతో భద్రతను పెంచారు. అనుమానితులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకునేలా ప్రణాళిక చేశారు.
Also Read: Bengaluru Airport: తప్పిన పెను ప్రమాదం.. ఎదురెదురుగా ఢీ కొట్టబోయిన రెండు ఇండిగో విమానాలు!
Also Read: Budget 2022 Expectations: జై కిసాన్!! నగదు బదిలీ రూ.8000కు పెంపు! రైతులకు మోదీ వరాలు!!
Also Read: Pushpa Memes: ‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం.. ఇలా కూడా వాడేస్తారా!
Also Read: Aparna Yadav BJP: ములాయం సింగ్ దీవెనలతోనే భాజపాలో చేరాను: ABPతో అపర్ణా యాదవ్
Also Read: UP Election 2022: ఊ అన్న అఖిలేశ్ యాదవ్.. యూపీ ఎన్నికల బరిలో ఇక సమరమే!
Hardik Patel Joining BJP: ఆప్ కాదు బీజేపీలోకే హార్దిక్ పటేల్ - చేరిక ముహుర్తం ఖరారు !
International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!
Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి
Drone Mahotsav 2022: దేశంలో డ్రోన్ల సాంకేతికతతో సరికొత్త విప్లవం: మోదీ
Former Haryana CM: మాజీ సీఎంకు 4 ఏళ్ల జైలు శిక్ష- అక్రమాస్తుల కేసులో సంచలన తీర్పు
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు