News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Rishi Sunak : ఇంగ్లాండ్ ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్

Rishi Sunak : భారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ ప్రధాని రేస్ లో నిలిచారు. ఆయన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు.

FOLLOW US: 

Rishi Sunak : భారత సంతతి వ్యక్తులు ప్రపంచ దేశాల్లో సాధించిన విజయాల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై కమలా హారిస్ అరుదైన ఘనత సాధించారు. అయితే మరో భారత సంతతి వ్యక్తి ఏకంగా బ్రిటన్ ప్రధాని రేస్ లో నిలిచారు. 

I’m standing to be the next leader of the Conservative Party and your Prime Minister.

Let’s restore trust, rebuild the economy and reunite the country. #Ready4Rishi

Sign up 👉 https://t.co/KKucZTV7N1 pic.twitter.com/LldqjLRSgF

రిషి సునక్ 

రిషి సునక్.. ఇప్పటివరకు ఈయన బ్రిటన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతుల నిర్వర్తించారు. మనందరికీ సుపరిచితులైన ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు. నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని సునక్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా రిషి సునక్.. తీసుకున్న చర్యలకు మంచి పేరు వచ్చింది. ఆయన నిర్ణయాల వల్లే బ్రిటన్ ఆర్థికంగా కోలుకోగలిగిందని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఎన్నో సార్లు చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం 10 బిలియన్ పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీని ప్రకటించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.

ఎక్కువ అవకాశం

కన్జర్వేటివ్ ప్రభుత్వం నుంచి దాదాపు 40 మంది మంత్రులు, సహాయకులు ఇప్పటికే రాజీనామా చేసి వైదొలిగారు. వారిలో రిషి సునక్ కూడా ఉన్నారు. బోరిస్ నాయకత్వంపై నమ్మకం కోల్పోయామంటూ ఆయనకు రాసిన రాజీనామా లేఖలో రిషి పేర్కొన్నారు.

కొంతకాలంగా ప్రధాని జాన్సన్‌ పనితీరు దారుణంగా ఉంది. ప్రభుత్వం సజావుగా, సమర్థంగా పని చేయాలని ప్రజలు ఆశిస్తారు. ఆ ప్రమాణాలు లోపించాయి అందుకే తప్పుకుంటున్నా. చాలా సందర్భాల్లో మీ వైఖరిని వ్యక్తిగతంగా ప్రశ్నించినా ప్రజాప్రయోజనాల దృష్ట్యా అందరి ముందూ మాత్రం సమర్థించాను. కానీ మౌలికంగా మనిద్దరివీ వేర్వేరు దారులు. ఇలా కలిసి కొనసాగలేమన్న నిర్ధారణకు వచ్చా.   " - రిషి సునక్

తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి కనుక ప్రధాని అయితే ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కుతారు. 42 ఏళ్ల రిషి సునక్‌ను ప్రధాని బోరిస్ జాన్స్ ఫిబ్రవరి 2020లో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్‌గా నియమించారు. ఫలితంగా తొలిసారి పూర్తిస్థాయి కేబినెట్ హోదా పొందారు. కరోనా సమయంలో డౌనింగ్ స్ట్రీట్‌లోని జరిగిన ప్రధాని బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నందుకు గాను జరిమానాను కూడా ఎదుర్కొన్నారు. రిషి సునక్ తాతలు పంజాబ్ నుంచి వచ్చారు.

Also Read: Bihar Professor Salary Return: 33 నెలల జీతాన్ని ప్రభుత్వానికి తిరిగిచ్చేసిన ప్రొఫెసర్- రూ.24 లక్షలు భయ్యా!

Also Read: Big Blow to Uddhav Thackeray: ఠాక్రేకు షాక్ మీద షాక్! శివసేన నుంచి శిందే గ్రూపులోకి 66 మంది కార్పొరేటర్లు జంప్!

Published at : 07 Jul 2022 05:20 PM (IST) Tags: Rishi Sunak Rishi Sunak Profile UK's Next PM UK Next prime Minister

సంబంధిత కథనాలు

YouTube Channels Blocked: ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేంద్రం వేటు, అసత్య ప్రచారాలు చేసినందుకే

YouTube Channels Blocked: ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేంద్రం వేటు, అసత్య ప్రచారాలు చేసినందుకే

Monkeypox: మంకీపాక్స్ వ్యాక్సిన్‌లపై నమ్మకం పెట్టుకోలేం, జాగ్రత్తలు పాటించక తప్పదు - డబ్ల్యూహెచ్ఓ

Monkeypox: మంకీపాక్స్ వ్యాక్సిన్‌లపై నమ్మకం పెట్టుకోలేం, జాగ్రత్తలు పాటించక తప్పదు - డబ్ల్యూహెచ్ఓ

Bilkis Bano Case: నేను మొద్దుబారిపోయాను, న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయింది - బిల్కిస్ బానో ఆవేదన

Bilkis Bano Case: నేను మొద్దుబారిపోయాను, న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయింది - బిల్కిస్ బానో ఆవేదన

Most Polluted Cities: టాప్‌-10 పొల్యూటెడ్ నగరాల్లో మన సిటీలు, లిస్ట్ విడుదల చేసిన రిపోర్ట్

Most Polluted Cities: టాప్‌-10 పొల్యూటెడ్ నగరాల్లో మన సిటీలు, లిస్ట్ విడుదల చేసిన రిపోర్ట్

Nirmala Sitharaman birthday: నిర్మలా సీతారామన్‌ @ 63! ఆమె గురించి మీకీ విషయాలు తెలుసా!

Nirmala Sitharaman birthday: నిర్మలా సీతారామన్‌ @ 63! ఆమె గురించి మీకీ విషయాలు తెలుసా!

టాప్ స్టోరీస్

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్‌లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్‌లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు

రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు