Big Blow to Uddhav Thackeray: ఠాక్రేకు షాక్ మీద షాక్! శివసేన నుంచి శిందే గ్రూపులోకి 66 మంది కార్పొరేటర్లు జంప్!
Big Blow to Uddhav Thackeray: శివసేనకు చెందిన 66 మంది కార్పొరేటర్లు శిందే గ్రూపుకు చేరారు.
Big Blow to Uddhav Thackeray: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. తాజాగా ఠాణెకు చెందిన 66 మంది శివసేన కార్పొరేటర్లు సీఎం ఏక్‌నాథ్ శిందే గ్రూపులోకి జంపయ్యారు. దీంతో శివసేన క్రమంగా ఖాళీ అవుతోంది.
సీఎంతో భేటీ
మాజీ మేయర్ నరేష్ ముస్కే సారథ్యంలో కార్పొరేటర్లు సీఎం శిందేను నందనవన్‌లోని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. అనంతరం శిందే గ్రూపులో చేరినట్టు ప్రకటించారు. సీఎం శిందే నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని కార్పొరేటర్లు ప్రకటించారు.
Big setback for Shivsena
— Kamlesh Sutar (@kamleshsutar) July 7, 2022
Uddhav loses control over Thane Municipal Corporation.
Out of 67 Shivsena corporators 66 join Shinde
Thane corporation is the most important corporations after BMC in Mumbai Metropolitan region. #Maharashtra #Eknath_Shinde pic.twitter.com/X7k9UYxaPS
ఎంపీలు
66 Shiv Sena corporators from Thane, including former mayor Naresh Mhaske, officially joined CM Eknath Shinde's camp. Uddhav Thackeray, meanwhile, has the support of just one corporator - Nandini Vichare, who is wife of MP Rajan Vichare. pic.twitter.com/EGUcdPdJHx
— Politically Yours (@loverabbits76) July 7, 2022
మరోవైపు 18 మంది శివసేన ఎంపీల్లో కొందరు ఏక్‌నాథ్ శిందే వైపు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఓ శివసేన ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతు ఇవ్వాలని ఉద్దవ్ ఠాక్రేకు వినతి పంపారు ఆ ఎంపీ. ఇది కాస్తా పెద్ద చర్చకే దారి తీసింది.
అంతే కాదు. ఏ రెబల్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కూడా శిందే తదుపరి లక్ష్యం ఏమిటో చెప్పకనే చెబుతున్నాయి. శివసేనకు చెందిన 18 మంది ఎంపీల్లో కనీసం 12 మంది సీఎం శిందే వైపు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని, రెబల్ ఎమ్మెల్యే గులాబ్‌రావ్ పాటిల్ అన్నారు. నలుగురు ఎంపీలను నేరుగా కలిసి ఈ విషయమై చర్చించాననీ చెప్పారు. 22 మంది మాజీ ఎమ్మెల్యేలూ కూడా తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు.
Also Read: UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!
Also Read: Bhagwant Mann Wedding: పంజాబ్ సీఎం పెళ్లిలో కేజ్రీవాల్- వివాహ భోజనంబు క్రేజీ వంటకంబు!