Khalistani Flags: అసెంబ్లీపై ఖలిస్థాన్ జెండాలు- సీఎం సీరియస్, దర్యాప్తు షురూ
Khalistani Flags: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీపై ఖలిస్థాన్ జెండాలు దర్శనమిచ్చాయి. దీనిపై ప్రభుత్వం దర్యాప్తు చేపడుతోంది.
Khalistani Flags:
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీపై ఖలిస్థాన్ జెండాలు కనబడటం కలకలం రేపాయి. ధర్మశాలలోని అసెంబ్లీ ప్రధాన గేటు, గోడలపై కొందరు ఖలిస్థాన్ జెండాలను వేలడాదీశారు. వీటిని పోలీసులు గుర్తించి తొలగించారు.
#WATCH Khalistan flags found tied on the main gate & boundary wall of the Himachal Pradesh Legislative Assembly in Dharamshala today morning pic.twitter.com/zzYk5xKmVg
— ANI (@ANI) May 8, 2022
ఏం జరిగింది?
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విధాన సభ గేటుకు ఉన్న ఖలిస్థాన్ జెండాలను తొలగించామని తెలిపారు. ఇది పంజాబ్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాంగ్రా ఎస్పీ తెలిపారు. అయితే అసెంబ్లీ గేటు ముందు సీసీటీవీ లేకపోవడం గమనార్హం.
సీఎం సీరియస్
इसी का फायदा उठाकर यह कायरतापूर्ण घटना को अंजाम दिया गया है, लेकिन हम इसे बर्दाश्त नहीं करेंगे।
— Jairam Thakur (@jairamthakurbjp) May 8, 2022
इस घटना की त्वरित जांच की जाएगी और दोषियों के खिलाफ कड़ी कार्रवाई होगी।
मैं उन लोगों को कहना चाहूंगा कि यदि हिम्मत है तो रात के अंधेरे में नहीं, दिन के उजाले में सामने आएं।
ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ సీరియర్ అయ్యారు. దీనిపై దర్యాప్తు జరిపి, నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
వార్నింగ్
సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థకు చెందిన నాయకుడు గురుపత్వంత్ సింగ్.. సిమ్లాలో ఖలిస్థాన్ జెండాలు ఎగురవేయాలని గత నెల పిలుపునిచ్చాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్‌కు బెదిరింపు లేఖ రాశారు.
Also Read: Badrinath Dham: బద్రీనాథుడి దర్శనానికి సిద్ధమా? తెరుచుకున్న ఆలయ తలుపులు
Also Read: Coronavirus Cases India: కొత్తగా 3,451 కరోనా కేసులు నమోదు- 40 మంది మృతి