News
News
వీడియోలు ఆటలు
X

Karnatka Results Effect: ఇకపై రాహుల్ గాంధీ టీమ్ కు ఫుల్ లైన్ క్లియర్ అయినట్టేనా ?

ఇక పై రాహుల్ గాంధీ టీమ్ కు ఫుల్  లైన్ క్లియర్ అయినట్టేనా ?

కాంగ్రెస్ లో పాత తరం కోటరీల కు  టాటా చెప్పే ప్రయత్నం చేసిన రాహుల్  

భారత్ జోడో యాత్ర తో మారిన రాహుల్ ఇమేజ్ 

FOLLOW US: 
Share:

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీకి మాత్రమే కాదు రాహుల్ గాంధీ నాయకత్వానికి కూడా చాలా ముఖ్యమైంది. ఇంకా చెప్పాలంటే ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య 2013 జనవరి 19 వ తేదీన కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడి గా  జైపూర్ లో జరిగిన చింతన్ శిబిర్ కార్యక్రమంలో నియమితులయ్యారు. అయితే ఆ తరువాత ఆయన ప్రస్థానం అంత సాఫీగా సాగలేదు. ప్రత్యర్థి పార్టీల కంటే స్వపక్షంలోనే ఆయన పోరాటం సాగించారనే అంటారు నాటి పరిణామాలు గమనించిన వారు. 

కామరాజ్ ప్లాన్ అమలు చెయ్యాలని అనుకున్న రాహుల్ :
కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మూడుసార్లు తమిళనాడు సీఎం గా పనిచేసిన  కామరాజ్ 1963లో ఒక ప్రపోజల్ ను నాటి ప్రధాని నెహ్రు ముందు ఉంచారు. దాని ప్రకారం పార్టీలోని సీనియర్ నేతలు ఒక ఏజ్ కు చేరుకున్నాక పదవుల నుండి తప్పుకుని పార్టీ కోసం పనిచేయాలని, యువ నాయకత్వానికి పదవులు అప్పజెప్పి వారికి దిశా నిర్దేశం చెయ్యాలన్నదే ఆ ప్రపోజల్. దీనినే కామరాజ్ ప్లాన్ అంటారు. ఇది రాజకీయాల్లో కొంతకాలం సజావుగా అమలు జరిగినా.. ఇందిరా గాంధీ హయాంలో కాస్త మిస్ యూజ్ అయింది అనేవాళ్లూ లేకపోలేదు. తన వ్యతిరేకులను ఆమె ఇదే ప్లాన్ ఉపయోగించి నెమ్మదిగా కీలక పదవులనుండి తప్పించారనే ప్రచారమూ ఉంది. అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడు అయ్యేసరికి నాటి UPA ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఓవైపు 2G స్కాం, కామన్ వెల్త్ గేమ్స్ స్కాం, చాపర్ స్కామ్, కాష్ ఫర్ వోట్ స్కాం, ఆదర్శ్ కుంభకోణం, IPL ఫిక్సింగ్ స్కాం లాంటి కుంభకోణాల ఆరోపణలు UPA ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బ తీశాయి. ఇలాంటి స్థితిలో 2014 నాటికి పార్టీని బలోపేతం చెయ్యాలంటే పార్టీని ప్రక్షాలణ చేయాలని దానికి కామరాజ్ ప్లాన్ సరైన మార్గం అని రాహుల్ గాంధీ ప్రయత్నించారు. దాని ప్రకారం అంతవరకూ సోనియా గాంధీ కోటరీగా ఉన్న కొందరు కీలక నేతలను పదవులనుండి తప్పించి ఆ స్థానంలో యంగ్ టీమ్ కు చోటు కల్పించాలని ఆయన భావించారు. అయితే ఇది పార్టీలోని కొందరు సీనియర్ లకు కోపానికి కారణం అయిందన్న వాదన ఉంది. 

సీనియర్స్  vs  రాహుల్ టీమ్
2014 ఎన్నికల్లో ఓటమి తరువాత  ఏర్పడిన పరిస్థితుల్లో కొందరు సీనియర్ నేతల్లో తమకు  పార్టీ లో ప్రాధాన్యత తగ్గింది అనే అభిప్రాయం కలిగింది అంటారు నాటి పార్టీ వ్యవహారాలు కవర్ చేసిన జర్నలిస్ట్ లు. వారిలో పార్టీ కోశాధికారిగా పనిచేసిన మోతీ లాల్ ఓరా, సోనియా గాంధీ సలహాదారుగా పనిచేసిన అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్ లాంటి వారితో  పాటు తెలుగు రాజకీయాలకు చెందిన కొందరు సీనియర్ నేతలూ  అదే అభిప్రాయంతో ఉన్నారని ప్రచారం జరిగింది. వారి స్థానంలో జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, మనీష్ తివారి లాంటి వారు పార్టీలో యాక్టివ్ అయ్యారు . 

2019 ఎన్నికల్లో ఓటమి -పార్టీ అధ్యక్ష పదవి కి రాజీనామా
ఇక తన సొంత టీమ్ తో 2019 ఎన్నికలకు వెళ్లాలని భావించిన రాహుల్ గాంధీ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో కొనసాగలేదు. పార్టీలోని కొందరు సీనియర్ ల నుండి సహకారం ఆయనకు లభించలేదు అంటారు విశ్లేషకులు. మరోవైపు మోదీ హవా బలంగా కొనసాగడం తో కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో మరోసారి ఎదురుదెబ్బ తిన్నది. దానితో రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నారు. తరువాతి పరిణామాల్లో గులాం నబీ ఆజాద్ తో పాటు రాహుల్ సన్నిహితుడుగా పేరుబడ్డ జ్యోతిరాదిత్య సింధియా పార్టీ నుంచి తప్పుకున్నారు.  నిజానికి ఆ ఎన్నికల్లో 2014 తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ సీట్ల పరంగానూ.. ఓట్ షేర్ పరంగానూ కాస్త మెరుగైన ఫలితాలే సాధించింది .

భారత్ జోడో యాత్ర -మారిన ఇమేజ్
రాహుల్ గాంధీ పై ప్రత్యర్థి పార్టీలు విపరీతంగా ప్రచారం చేసిన పప్పు ముద్ర రాజకీయాల్లో బలంగా ఉన్న సమయంలో ఆయన భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. ఆ యాత్ర మొదట్లో అందరూ లైట్ తీసుకున్నా తరువాత తరువాత రాహుల్ గాంధీకి మద్దతు పెరుగుతూ వచ్చింది. నెమ్మదిగా ఆయనపై ఉన్న పప్పు ముద్ర కనుమరుగవడం మొదలైంది. ఆ సమయంలో జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అది 68 సీట్లు కలిగిన చిన్న రాష్ట్రం కావడంతో పెద్దగా క్రెడిట్ రాహుల్ కు రాలేదు. 

కర్ణాటక ఎన్నికలు - స్పష్టమైన రాహుల్ ముద్ర
ఇక తాజా గా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో విజయం మాత్రం పూర్తిగా రాహుల్ ముద్ర తోనే సాధ్యం అని కాంగ్రెస్ అంటుంది. దక్షిణాది లో పాగా వెయ్యాలంటే కర్ణాటక ముఖద్వారం అని భావిస్తున్న బీజేపీ ఈ ఎన్నికల్లో గెలుపుకు సర్వశక్తులూ ఒడ్డింది. అయినప్పటికీ కాంగ్రెస్ తిరుగులేని విజయం అందుకోవడంతో ఆ పార్టీలో నూతన ఉత్సాహం కలిగింది. దానితో రాహుల్ గాంధీ ని చూసే దృక్కోణం భారత రాజకీయాల్లో మారడం తథ్యం అంటున్నారు పరిశీలకులు.

యాక్టివ్ కానున్న రాహుల్ టీమ్ ?
మారిన పరిస్థితుల దృష్ట్యా తాను అనుకున్నట్టు గా యంగ్ టీమ్ ను డెవలప్ చేసే పనిలో పడ్డారు రాహుల్ గాంధీ. దానితో త్వరలోనే ఆయన టీమ్ కు చెందిన సభ్యులు పార్టీలో కీలకం కావడంతో పాటు తటస్థంగా ఉన్నవారినీ, పార్టీని వదిలి వెళ్లిన వారినీ తిరిగి పార్టీ వైపు ఆహ్వానించే ప్రయత్నాలు ముమ్మరం కావొచ్చు అంటున్నారు. ఏదేమైనా రాహుల్ గాంధీ టీమ్ కు మాత్రం కర్ణాటక విజయంతో కాంగ్రెస్ పార్టీ లో కీలక పాత్ర పోషించేందుకు లైన్ క్లియర్ అయినట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Published at : 14 May 2023 12:44 AM (IST) Tags: CONGRESS Rahul Gandhi Karnataka Karnataka Results 2023 Karnatka Elections 2023

సంబంధిత కథనాలు

స్కూల్‌లోకి అడుగు పెట్టని విద్యార్థులు, కూల్చిన అధికారులు - ఒడిశా రైలు ప్రమాదం ఎఫెక్ట్

స్కూల్‌లోకి అడుగు పెట్టని విద్యార్థులు, కూల్చిన అధికారులు - ఒడిశా రైలు ప్రమాదం ఎఫెక్ట్

Mine Collapsed: ప్రాణాలు తీసిన అక్రమ మైనింగ్, బొగ్గు గనిలో ప్రమాదం - శిథిలాల కింద బాధితులు

Mine Collapsed: ప్రాణాలు తీసిన అక్రమ మైనింగ్, బొగ్గు గనిలో ప్రమాదం - శిథిలాల కింద బాధితులు

2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్

2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళనలో ఊహించని ట్విస్ట్, బ్రిజ్ భూషణ్ ఇంటికి ఓ రెజ్లర్! కాంప్రమైజ్ కోసమేనా?

Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళనలో ఊహించని ట్విస్ట్, బ్రిజ్ భూషణ్ ఇంటికి ఓ రెజ్లర్!  కాంప్రమైజ్ కోసమేనా?

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్