Karnataka Minister Eswarappa : క్లీన్‌గా వస్తా మళ్లీ మంత్రినవుతా - రాజీనామా చేసిన కర్ణాటక మంత్రి చాలెంజ్ !
కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈశ్వరప్ప రాజీనామా చేశారు. క్లీన్ గా వచ్చి మళ్లీ మంత్రి పదవిని చేపడతానన్నారు.
కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప తనపై వచ్చిన ఆరోపణలన్నింటిలో క్లీన్‌గా బయటకు వస్తానని మంత్రిని అవుతానని చాలెంజ్ చేశారు. కాంట్రాక్టర్ ఆత్మహత్య నేపథ్యంలో 40 శాతం కమీషన్ ఆరోపణలతో అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పదవికి కేఎస్ ఈశ్వరప్ప రాజీనామా చేశారు. ఆయన తాను రాజీనామా చేయబోనని మొండికేశారు. హైకమాండ్ ఆదేశించడంతో పదవి వదులుకోక తప్పలేదు.
దేశ ఆర్థిక రాజధానిలో కట్టెల పొయ్యిలే ఆధారం - కారణం ఏమిటంటే ?
బెళగావి కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఈశ్వరప్ప పేరును ఏ - 1 నిందితుడిగా పేర్కొన్నejg. ఈశ్వరప్ప రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబట్టడం, నలభై శాతం కమీషన్‌పై ప్రధాని మోదీ సైతం ఆరా తీయడంతో ఎట్టకేలకు ఈశ్వరప్ప దిగివచ్చారు. మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు గురువారం రాత్రి శివమొగ్గలో ఆయన ప్రకటించారు. శుక్రవారం బెంగళూరు వెళ్లి ముఖ్యమంత్రికి రాజీనామా లేఖ సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తోందని తాను రాజీనామా చేయట్లేదని, తన వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదనే రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు.
మహిళల వివాహ వయసు పెంచొద్దు - 95 శాతం మంది అభిప్రాయం ఇదేనా !?
రెండున్నరేళ్ల బీజేపీ పాలనలో తొలుత రాసలీలల సీడీ వివాదంలో మొదట రమేశ్ జార్కిహొళి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనపై ఇటీవల కేసులను కొట్టేశారు. ప్రస్తుతం 40శాతం కమీషన్ ఆరోపణలు, కాంట్రాక్టర్ ఆత్మహత్య నేపథ్యంలో మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేశారు. అయితే కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు కారకులైన మంత్రి ఈశ్వరప్పను అరెస్టు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆయనపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గుజరాత్ కాంగ్రెస్‌లో హార్దిక్ కల్లోలం - పార్టీ మారబోవడం లేదన్న పటేల్ నేత !
ఈశ్వరప్ప తనకుతానుగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారని, హైకమాండ్ నుంచి ఎటువంటి ఒత్తిడీ లేదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. కాంట్రాక్టర్ మృతిపై ప్రాథమిక నివేదిక కోసం వేచి చూస్తున్నామని, నివేదిక వచ్చాక దాన్ని బట్టే చర్యలు ఉంటాయన్నారు. ఈ కేసులో కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్‌కు అసలు పనులేమీ ఇవ్వలేదని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు కమిషన్ తీసుకోవడం అనే సమస్యే రాదని మంత్రి వాదిస్తున్నారు. అయితే వర్క్ ఆర్డర్ లేకుండానే బెళగావిలో మంత్రి ఈశ్వరప్ప పనులు చేయిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బె్ళగావిలో ఈశ్వరప్ప పలు రకాలు పనులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.