అన్వేషించండి

కర్ణాటక కాంగ్రెస్‌లోనూ ముసలం మొదలైందా? అంతా బానే ఉందని దాచి పెడుతున్నారా?

Karnataka Congress Crisis: కర్ణాటక కాంగ్రెస్‌లోనూ అంతర్గత విభేదాలు మొదలయ్యాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Karnataka Congress Crisis: 

రాజస్థాన్ సీన్ రిపీట్..? 

అంతర్గత విభేదాలు కాంగ్రెస్‌ పార్టీని గట్టిగానే దెబ్బ తీశాయి. అధికారంలోకి రాకపోతే ఓ తంటా...వచ్చాక మరో తంటా అన్నట్టుగా తయారైంది ఈ పార్టీ పరిస్థితి. ఇప్పటికే రాజస్థాన్‌లో దాదాపు ఏడాది కాలంగా గహ్లోట్, పైలట్ మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది. దాన్నే పరిష్కరించలేక తలపట్టుకుంటోంది హైకమాండ్. చాలా రోజుల తరవాత కర్ణాటక విజయంతో మంచి జోష్ వచ్చినా...ఇక్కడ కూడా అదే ముసలం మొదలైందన్న ప్రచారం బాగానే జరుగుతోంది. పైగా దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపణలు చేసినట్టు వార్తలొచ్చాయి. కొందరు మంత్రులు తమను అసలు పట్టించుకోడం లేదని ఎమ్మెల్యేలు హైకమాండ్‌కి కంప్లెయింట్ చేసినట్టూ తెలుస్తోంది. కీలక విషయం ఏంటంటే...11 మంది ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఓ లేఖ పంపినట్టు సమాచారం. వాళ్లందరూ ఆ లేఖపై సంతకాలు పెట్టి మరీ ఫిర్యాదు చేశారట. 20 మంది మంత్రులు తమని బాగా ఇబ్బంది పెడుతున్నట్టు అందులో కంప్లెయింట్ చేశారట. ఇక అప్పటి నుంచి కర్ణాటక కాంగ్రెస్‌లో కూడా ఏదో జరుగుతోందన్న వాదనలు మొదలయ్యాయి. దీనిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. "ఇదంతా అవాస్తవం" అని కొట్టి పారేశారు. ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు మధ్య ఎలాంటి గ్యాప్ రాకుండా ఉండేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు తేల్చి చెప్పారు. 

"ఇదంతా అసలు మీకు ఎవరు చెప్పారు..? అయినా మేం ఏ విషయమైనా ఎమ్మెల్యేలతో మాట్లాడుకుంటాం. ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు మాత్రమే అయింది. పార్టీ మీటింగ్ ఏర్పాటు కావాలి. అందుకే అందరినీ పిలిచాం. ప్రభుత్వం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవు. వాళ్లంతా పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని అడిగారు. అందుకే త్వరలోనే భేటీ అవుతాం"

- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి

సింగపూర్‌ ప్లాన్..

ఇక్కడే సింగపూర్‌ ప్రస్తావన కూడా వచ్చింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సింగపూర్‌లో యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు గుసగుసలు వినిపించాయి. ఇదే విషయాన్ని డిప్యుటీ సీఎం శివకుమార్ కూడా ఓ సందర్భంలో చెప్పారు. దీనిపై ప్రశ్నించగా సిద్దరామయ్య దాటవేశారు. "అది శివకుమార్‌నే అడగండి" అని బదులిచ్చారు. పైపైకి అంతా బానే ఉన్నట్టు కనిపిస్తున్నా చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పైగా పార్టీ సీనియర్ నేత బీకే హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. "ఓ వ్యక్తిని సీఎం ఎలా చేయాలో తెలుసు..ఎలా గద్దె దించాలో కూడా తెలుసు" అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతర్గత విభేదాలున్నాయన్న పుకార్లకు ఇది మరింత ఆజ్యం పోసింది. కానీ డీకే శివకుమార్ మాత్రం ఈ పుకార్లపై స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. 

"ఇదంతా అవాస్తవం. ఎలాంటి లేఖలు మాకు రాలేదు. అందరి ఎమ్మెల్యేలతో కలిసి పని చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రులకు ఆదేశాలిచ్చారు. అందరూ అదే పని చేస్తున్నారు. ఇవన్నీ కేవలం పుకార్లే. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయలేకపోతున్నామని కొందరు బాధ పడుతున్నారు. అంతకు మించి సమస్యలు ఏమీ లేవు. కాస్త ఓపిక పడితే అన్ని పనులూ పూర్తి చేస్తామని వాళ్లకు ఇప్పటికే వివరించాను."

- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం

అంతా ఫేక్..! 

ఇదంతా జరుగుతుండగానే ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఓ బాంబు పేల్చారు. ఆ 11 మంది ఎమ్మెల్యేలు పంపిన లేఖ ఫేక్ అని తేల్చి చెప్పారు. అఫీషియల్ లెటర్‌ప్యాడ్‌పై పెట్టిన సంతకాలు కావని దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతే కాదు. తన లెటర్ ప్యాడ్‌ని మీడియాకి చూపించారు. ఎవరో కావాలనే ఈ పుకార్లను సృష్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆ తరవాత కాంగ్రెస్‌ కూడా అధికారికంగా ఇదే విషయాన్ని ప్రకటించింది. ఈ లెటర్ ఫేక్ అని తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి దీనికి ఫుల్‌స్టాప్ పడినట్టే అనిపిస్తున్నా...లోగుట్టు ఏమిటన్నది మాత్రం తేలడం లేదు.  

Also Read: Zomato Delivery Boy: ప్రభుత్వ ఉద్యోగం సాధించిన జొమాటో డెలివరీ బాయ్, ప్రశంసల వెల్లువ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget