By: ABP Desam | Updated at : 21 Jun 2022 06:41 PM (IST)
కాలేజీ ప్రిన్సిపాల్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే
JD(S) MLA slapped college principal : కర్ణాటకలో జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ తన నియోజకవర్గంలో ఉన్న ఓ కాలేజీని ఆకస్మిక తనిఖీ చేశారు. అన్ని చూసిన తర్వాత ఆ కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ పని ఎక్కడి వరకు వచ్చిందని ప్రిన్సిపల్‌ను అడిగారుు. అయితే ఆ ప్రిన్సిపల్ వెంటనే సమాధానం చెప్పలేకపోయారు. అంతే ఆ ఎమ్మెల్యేకు కోపం వచ్చింది. ఆయన కాలేజీ ప్రిన్సిపాల్ అనే విషయం కూడా మర్చిపోయి రెచ్చిపోయారు. చెంపదెబ్బలు కొట్టారు.
#Karnataka: A JD(S) MLA Srinivas slapped a college principal who was not able to provide clear answer about the ongoing development work for a computer lab.
— IANS (@ians_india) June 21, 2022
The incident, which happened on Monday, has created a huge outrage among the public. pic.twitter.com/WFnwK280Sg
ప్రిన్సిపాల్‌పై ఎమ్మెల్యే దాడి చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఎమ్మెల్యే తీరుపై సోషల్ మీడియాలో అనేక రకాల విమర్శలు వినిపిస్తున్నాయి.
If Principal doesn’t file an FIR, his students must do it for the sake of the dignity of the their guru and gyan.
— Asif Azmi 🇮🇳 (@AsifAzmi_Delhi) June 21, 2022
జేడీఎస్ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై సాధారణ ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓ కాలేజీ ప్రిన్సిపాల్ విషయంలో ఇలా దాడి చేయడం ఏమిటన్న వాదన వినిపిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రిన్సిపాల్‌కు క్షమాపమ చెప్పాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో జేడీఎస్ నాయకులు ఇంకా స్పందించలేదు. కాలేజీలో జరిగే పనులుపై సంతృప్తి లేకపోతే ఆయనపై శాఖపరంగా చర్యలు తీసుకోవచ్చు కానీ దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదంటున్నారు.
ఉద్యోగ సంఘ నేతలు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో జేడీఎస్ అధికార పార్టీ కాదు. విపక్ష పార్టీ. ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ అంశంపై జేడీఎస్ పై ఇతర పార్టీల నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్-2 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
CSIR UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?
ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు
RRC: నార్త్ సెంట్రల్ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్‌దే! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
/body>