Jayabachan Serious: రాజ్యసభలో వెకిలి చేష్టలపై జయాబచ్చన్ సీరియస్, స్కూల్ పిల్లలం కాదంటూ ఛైర్మన్‌పై ఆగ్రహం
Jayabachan Serious: రాజ్యసభలో అధికారపక్ష సభ్యుల వెకిలి చేష్టలపై జయాబచ్చన్ సీరియస్ అయ్యారు.
ఈ ప్రభుత్వంలో చివరి పార్లమెంట్( Parliament) సమావేశాలు కావడంతో సభలో వాడీవేడిగా చర్చలు సాగుతున్నాయి. దేశంలోనే అందరికీ ఆదర్శంగా ఉండాల్సి పెద్దల సభలోనూ సభ్యులు కొంచెం శృతిమించి వ్యవహరించడం కాస్త నొచ్చుకునే విషయమే. రాజ్యసభ(Rajyasabha) లో ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశిస్తూ.. అధికారపక్ష సభ్యులు ఎగతాళి చేయడంతో సీనియర్ సభ్యురాలు, సమాజ్‌వాది పార్టీ సభ్యురాలు జయాబచ్చన్(Jayabachan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar)ను నిలదీశారు. తామేమి స్కూలు పిల్లలం కాదంటూ చురకలంటించారు.
జయాబచ్చన్ ఆగ్రహం
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం సందర్భందా ప్రతిపక్ష సభ్యుల పట్ల అధికారపక్ష సభ్యులు అమర్యాదగా ప్రవర్తించడంతో రాజ్యసభలో ఒక్కసారిగా వేడెక్కింది. ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో (RajyaSabha) ఓ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. మరో దానికి వెళ్లిపోవడంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వరుసక్రమం మార్చి ముందుకు ఎలా వెళ్తారని నిలదీశారు ఈ సమయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్ష సభ్యులను కూర్చోమని చెబుతూ అధికారపక్ష సభ్యులు చేయి చూపిస్తూ ఎగతాళి చేశారు. దీనిపై సమాజ్ వాదీ సభ్యురాలు జయాబచ్చను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సభకు, ఛైర్మన్ కు జవాబుదారీలం కానీ మీకు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేం స్కూల్ పిల్లలం కాదు
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా వైమానిక రంగంపై విపక్షాలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే.... సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తరువాత ప్రశ్నకు వెళ్లారు. దీనిపై కాంగ్రెస్(Congress) సభ్యుడు దీపేంద్రసింగ్ హుడాతో పాటు సమాజ్ వాదీ ఎంపీ జయాబచ్చన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడే వచ్చిన జగదీప్ ధన్‌ఖడ్ సభ్యులందరినీ తమ సీట్లలో కూర్చోవాలని ఆదేశించారు. దాటవేసిన ప్రశ్నకు సమాధానం చెప్పిస్తామని హామీ ఇచ్చినా...కాంగ్రెస్ ఎంపీ హుడా ఆందోళన విరమించకపోవడంతో... జయాబచ్చన్‌కు మీరు అధికార ప్రతినిధి కాదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను హామీ ఇచ్చినట్లు దాటవేసిన ప్రశ్నకు సమాధానం చెప్పించకుంటే....ఆమే అడుగుతారు కానీ మీరు ఎందుకు గొడవ చేస్తున్నారని మండిపడ్డారు. జయబచ్చన్ కలుగజేసుకోగా....ధన్‌ఖడ్ అడ్డుతగిలారు. మీరు చాలా సీనియర్ మెంబర్...పైగా అద్భుతమైన నటి. కూడాను అన్నారు. మీలాంటి గొప్ప నటీమణులు కూడా చాలా రీటేక్‌లు తీసుకునే ఉంటారు కదా. కాస్త అర్థం చేసుకోండి అంటూ సర్ధిచెప్పారు. డిప్యూటీ ఛైర్మన్ అనుమతిస్తేనే తాను మాట్లాడానని....ఏదైనా చెప్పాలనుకుంటే ఛైర్మన్ స్థానంలో కూర్చున్న వారు చెప్పాలి గానీ...అధికారపక్ష సభ్యులు చెప్పడమేంటని ఆమె మండిపడ్డారు. ఎవరో చెబితే చేతులు ముడుచుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదన్నారు. తమ ప్రశ్నకు తర్వాత సమాధానం ఇస్తామంటే అర్థం చేసుకోలేని స్థితిలో ఇక్కడ ఎవరూ లేరని...మేం స్కూల్ పిల్లలం కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష సభ్యులు కూడా కాస్త గౌరవరం ఇవ్వాలని కోరారు. దాటవేసిన ప్రశ్నను ధన్‌ఖడ్ లిస్టు చేయడంతో వివాదం సద్దుమణిగింది.