News
News
X

Jandhan Account: జన్ ధన్ ఖాతా ఉంటే చాలు, 10 వేల ప్రయోజనం - ఖాతాలో డబ్బులు లేకపోయినా సరే!   

Jandhan Account: జనధన్ ఖాతాలో  కనీస బ్యాలెన్స్ లేకపోయినా.. మీరు 10 వేల రూపాయల వరకు ఓవర్‌ డ్రాఫ్ట్ సౌకర్యం పొందవచ్చు. అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

FOLLOW US: 

Jandhan Account: చాలా మందికి ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) కింద జీరో బ్యాలెన్స్‌పై సేవింగ్స్ ఖాతాలు ఉన్నాయి. అయితే ఈ అకౌంట్ ద్వారా చేకూరే చాలా ప్రయజనాల గురించి చాలా మందికి తెలియదు. దీని వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఖాతాదారులు తప్పక తెలుసుకోవాలి. జన్ ధన్ యోజనలో, ఖాతాలో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో, ఖాతాదారులు లక్ష రూపాయల ప్రమాద బీమా, 30 వేల జీవిత భీమా, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం, చెక్ బుక్‌తో సహా అనేక ఇతర ప్రయోజనాలను పొందుతారు.

అయితే సేవింగ్స్ ఖాతాదారులకు ఈ నిబంధనలు వర్తించవు. కేవలం సున్నా నిల్వగల ఖాతాగా ప్రారంభించే వారికి మాత్రమే వర్తిస్తాయి. వారి ఆధార్, లేదా రేషన్ కార్డుల ఆధారంగా వారిని పేద, మధ్య తరగతుల వారిగా గుర్తిసారు. ఈ పథకం క్రింద బ్యాంకులో ఖాతా తీసుకున్న వారు నెలకు 10 వేలకు మాత్రమే బదిలీ సౌకర్యం కలిగి ఉంటారు. సంవత్సరానికి మొత్తం ఒక లక్ష రూపాయలు మాత్రమే మార్పిడి, లేదా బదిలీలకు, దాచడానికి అవకాశం కలిగి ఉంది.

ఇలా ప్రయోజనం పొందవచ్చు..

జన్ ధన్ యోజన కింద మీ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా, మీరు 10 వేల రూపాయల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం పొందవచ్చు. ఈ సదుపాయం స్వల్ప కాలిక రుణం లాంటిది. ఇంతకు ముందు ఈ మొత్తం 5 వేల రూపాయలు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని 10 వేల రూపాయలకు పెంచింది.

News Reels

జన్ ధన్ ఖాతా యొక్క లక్షణాలు..

పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో తీసుకురావడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచవచ్చునని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే జన్ ధన్ యోజన.భారత దేశంలో సుమారు 42% ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014 ఆగస్టు 28 న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ప్రారంభించారు. ప్రతి ఇంటిలోనూ కనీసం ఒక ప్రాథమిక బ్యాంకింగ్ ఖాతాతో బ్యాంకింగ్ సేవలను బాటమ్ ఆఫ్ పిరమిడ్ వినియోగదారులు అందుబాటులోకి తీసుకుని రావడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.

ఇలాగే ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY)లో, మీరు బ్యాంకింగ్/పొదుపులు అలాగే డిపాజిట్ ఖాతాలు, లోన్‌లు, ఇన్సూరెన్స్ మొదలైన వాటికి యాక్సెస్ ఉండేలా చూస్తారు. మీరు ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ లేదా బ్యాంక్ మిత్ర అవుట్‌లెట్ నుండి ఈ ఖాతాను తెరవవచ్చు. PMJDY ఖాతాలు జీరో బ్యాలెన్స్‌తో తెరుస్తారు.

నియమం ఏమిటి?

ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందడానికి, మీ జన్ ధన్ ఖాతా తప్పనిసరిగా 6 నెలల వయస్సు కలిగి ఉండాలి. అలాగే, ఈ ఖాతాలో ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కోసం గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండాలి. అలా చేయడంలో విఫలమైతే రూ. 2,000 వరకు మాత్రమే ఓవర్‌ డ్రాఫ్ట్ వస్తుంది. 

Published at : 07 Nov 2022 01:45 PM (IST) Tags: Jandhan Account Central Government Jandhan Account Benefits Jandhan Account uses Jandhan benefits

సంబంధిత కథనాలు

26/11 Mumbai Attack: ఆ మారణహోమం నుంచి పాఠం నేర్చుకున్న భారత్, ఉగ్రపోరులో మారిన వ్యూహాలు

26/11 Mumbai Attack: ఆ మారణహోమం నుంచి పాఠం నేర్చుకున్న భారత్, ఉగ్రపోరులో మారిన వ్యూహాలు

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Constitution Day 2022: మన రాజ్యాంగం గురించి 10 ఆసక్తికర విశేషాలివే, ప్రస్తుతం ఒరిజినల్ కాపీ అక్కడ చాలా సేఫ్ !

Constitution Day 2022: మన రాజ్యాంగం గురించి 10 ఆసక్తికర విశేషాలివే, ప్రస్తుతం ఒరిజినల్ కాపీ అక్కడ చాలా సేఫ్ !

Mysuru Bajrang Dal: హిందూ యువతితో ప్రయాణించిన ముస్లిం యువకుడు, దాడి చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు

Mysuru Bajrang Dal: హిందూ యువతితో ప్రయాణించిన ముస్లిం యువకుడు, దాడి చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!