J&K: శ్రీనగర్‌లో భద్రతాదళాల ఎన్‌కౌంటర్- ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్‌లో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు. మృతి చెందిన ఉగ్రవాదులు పాకిస్థాన్ నిషేధిత తీవ్రవాద సంస్థ లష్కర్ ఏ తొయిబాకు చెందినవారిగా గుర్తించారు.
ఏం జరిగింది?
కశ్మీర్‌లోని సిర్హామా ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. దీంతో తీవ్రవాదులు పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. వెంటనే భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. వీరి నుంచి కొన్నిఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పౌరులు, జర్నలిస్టులపై దాడులకు తెగబడితే సహించబోమని కశ్మీర్ జోన్ ఐజీపీ అన్నారు.
02 #Pakistani #terrorists who were involved in recent #terror attack on CRPF Personnel, neutralised in #Srinagar #Encounter. Arms & ammunition, other incriminating materials recovered: IGP Kashmir@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) April 10, 2022
Also Read: Watch Video: 'ధూమ్' లెవల్‌లో చేజింగ్- రన్నింగ్ వాహనం నుంచే ఆవులను తోసేసిన దొంగలు, వీడియో చూశారా?
Also Read: Covid 19 Precaution Dose: ప్రికాషన్ డోసు షురూ- ఎలా బుక్ చేసుకోవాలి? ధర తెలుసుకోండి