ISRO: ఆపరేషన్ మొదలుపెట్టేసిన INSAT-3DS, తొలి చిత్రాల్లో అద్భుతంగా కనిపిస్తున్న భారత్
ISRO ఇస్రో ప్రయోగించిన INSAT-3DS వాతావరణ ఉపగ్రహం భూమిని పరిశీలించడం ప్రారంభించింది. వాతావరణ శాస్త్ర పేలోడ్‌లు తీసిన తొలి ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. భూగ్రహం మరింత అందంగా కనిపిస్తోంది.
ISRO INSAT-3DS first pictures: ఇన్‌శాట్-3 డీఎస్‌ను ఫిబ్రవరి 17, 2024న శ్రీహరికోట నుంచి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రయోగించింది. వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితల వాతావరణాలపై మెరుగైన అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన ఈ ఉపగ్రహం... తన ఆపరేషన్ మొదలుపెట్టేసింది. భూమికి సంబంధించిన తొలి ఫొటోలు ఇస్రోకు పంపింది. ఆ ఫొటోలో భూగ్రహం చాలా అత్యద్భుతంగా ఉంది. భారతదేశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
ఫిబ్రవరి 17న నింగిలోకి ఇన్‌శాట్-3డీఎస్
GSLV-F14 రాకెట్ ద్వారా 2,275 కిలోల బరువున్న ఇన్‌శాట్-3డీఎస్‌ను గత నెల (ఫిబ్రవరి) 17న నింగిలోకి పంపింది ఇస్రో. ఈ అత్యాధునిక ఉపగ్రహంలో అధునాతన ఇమేజర్, సౌండర్ పేలోడ్స్ వంటి పరికరాలున్నాయి. భూమి, భూ వాతావరణానికి సంబంధించిన అంశాలను ఈ పరికరాలు.... ఎంతో స్పష్టతతో ఫొటోలు తీయడంతోపాటు డేటాను కూడా విశ్లేషిస్తున్నాయని ఇస్రతో తెలిపింది. ఇమేజింగ్ పరికంలో.. ఆరు ఛానళ్లు ఉంటాయి. అవి.. ఏరోసోల్స్, మేఘాలు, ఉపరితల ఉష్ణోగ్రతలు, నీటి ఆవిరి పంపిణీకి సందించిన అంశాలను శాస్త్రవేత్తులు ట్రాక్ చేసేందుకు సహకరిస్తాయి. ప్రయోగానికి సంబంధించి... ఆసక్తి గత ప్రాంతాల నుంచి కాన్ఫిగర్ చేయగల ఇమేజర్‌ని క్యాప్చర్ చేస్తాయి. అంతేకాదు... 19 ఛానళ్ల సౌండర్‌తో కూడా పరిశీలనలు జరిగాయి.
Photo: ISRO
మార్చి 7న ఫొటోలు
సముద్రం మరియు భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు, వర్షపాతం, పొగమంచు తీవ్రత, మేఘాల లక్షణాలు.. వాటిలో అణువులు లేదా కణాల కదలికలను పరిశీలించేలా వాతావరణ ప్రొఫైళ్లతో సహా 40కి పైగా జియోఫిజికల్ డేటా ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి బోర్డులోని పేలోడ్‌లు ఉపయోగించబడతాయి. ఉపగ్రహం ఎల్లప్పుడూ ఒకే సాపేక్ష స్థితిలో సూర్యునితో భూమి చుట్టూ తిరుగుతుంది. ఇది ఒకదానితో ఒకటి సులభంగా పోల్చగలిగే పరిశీలనలను సేకరించడానికి అనుమతిస్తుంది. ఇన్‌శాట్-3 డీఎస్‌ను ప్రయోగించిన ఐదు రోజుల తర్వాత.. ఉపగ్రహం కక్ష్యకు చేరుకుంది. ఫిబ్రవరి 28న ఉపగ్రహం ఇన్‌ఆర్బిట్ టెస్టింగ్ (IOT) కోసం జియోస్టేషనరీ స్లాట్‌కు చేరుకుంది. ఉపగ్రహ సమాచార మార్పిడికి సంబంధించిన ఇన్‌ఆర్బిట్ టెస్టింగ్ ఫిబ్రవరి 29న- మార్చి 3వ తేదీ మధ్య నిర్వహించబడింది. ఇమేజర్, సౌండర్ ద్వారా మొదటి పరిశీలనలు జరిగాయి. ఇన్‌ఆర్బిట్ టెస్టింగ్‌లో భాగంగా ... వాతావరణ శాస్త్ర పేలోడ్ మార్చి7న ఫొటోలు విడుదల చేసింది.
వాతావరణ శాస్త్ర కార్యకలాపాల కోసం 2003, 2016లో ప్రయోగించబడిన INSAT-3D, INSAT-3DR సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు, విస్తరించేందుకు INSAT-3DS ఉపగ్రహం రూపొందించబడింది. ప్రస్తుతం ఈ ఉపగ్రహం విజయవంతంగా పనిచేస్తోంది. బోర్డ్‌లోని ఇమేజర్, సౌండర్‌ర్లు INSAT-3D, INSAT-3DR ఉపగ్రహాలపై పేలోడ్‌ల తరహాలో ఉంటాయి. INSAT-3DS... ఈ రెండు మిషన్‌ల కోసం సేవలను కొనసాగించేందుకు ఉపయోగపడుతోంది. ఈ ఉపగ్రహం మొదటి వర్షన్ కంటే బోర్డులోని సాధనాలను చాలా మెరుగైనవి. INSAT-3DS నుంచి వచ్చిన మొదటి చిత్రాలను ఇశ్రో విడుదల చేసింది. INSAT-3DS విజయవంతంగా పనిచేస్తుందని తెలిపింది.