ISRO News: ఇస్రో RLV టెస్ట్ సూపర్ సక్సెస్ - 320 కి.మీ. స్పీడ్‌తో సొంతంగా ల్యాండైన మాడ్యుల్
ISRO Latest News: పుష్పక్‌ను ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తులో వదిలేసింది. 320 కిలో మీటర్ల వేగంతో నేల మీదకు తనంత తానే నేలమీదకు దిగింది.
ISRO Reusable Launch Vehicle: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన రీయూజబుల్ లాంఛ్ వెహికల్ (RLV) 03 టెస్ట్ ట్రయల్ సూపర్ సక్సెస్ అయినట్లుగా ఇస్రో ప్రకటించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR) లో ఇస్రో ఈ ట్రయల్ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా 'పుష్పక్' అనే ఓ ల్యాండింగ్ మాడ్యుల్ దాదాపు 320 కిలో మీటర్ల వేగంతో నేల మీదకు తనంత తానే నేలమీదకు దిగి.. సొంతంగా రన్ వే పై ల్యాండ్ అయింది. దానికదే వేగాన్ని తగ్గించుకొని ఆగిపోయింది.
నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తులో పుష్పక్ ను ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ వదిలేసింది. గతంలో కంటే 500 మీటర్ల ఎత్తు నుంచి పుష్పక్ ను ఈసారి వదిలి ఇస్రో టెస్ట్ చేసింది. అయినప్పటికీ ఎలాంటి అవాంతరాలు లేకుండా సొంతంగా వచ్చి పుష్పక్ ల్యాండ్ అయింది. భవిష్యత్తులో వాడిన రాకెట్ నే మళ్లీ వాడుకుని ఖర్చు తగ్గించేందుకు ఈ ప్రయోగం ఇస్రో చేస్తోంది. మాడ్యూల్ ను అంతరిక్షం దిశగా వదిలి తిరిగి వచ్చి వెహికిల్ ల్యాండ్ కానుంది. ప్రస్తుతం ఎలన్ మస్క్ 'స్పేస్ ఎక్స్' దగ్గర మాత్రమే ఈ సాంకేతికత ఉంది.
Hat-trick for ISRO in RLV LEX! 🚀
— ISRO (@isro) June 23, 2024
🇮🇳ISRO achieved its third and final consecutive success in the Reusable Launch Vehicle (RLV) Landing EXperiment (LEX) on June 23, 2024.
"Pushpak" executed a precise horizontal landing, showcasing advanced autonomous capabilities under… pic.twitter.com/cGMrw6mmyH