ఢిల్లీలో హై అలెర్ట్, ఉగ్రదాడులపై నిఘా సంస్థల హెచ్చరిక - ఇజ్రాయేల్ పాలస్తీనా వార్ ఎఫెక్ట్!
Hamas Palestine Attack: భారత్‌లోనూ ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా సంస్థలు హెచ్చరించాయి.
Hamas Palestine Attack:
భారత్‌లోనూ ఉగ్రదాడులు..?
ఇజ్రాయేల్ పాలస్తీనా వార్ ఎఫెక్ట్ ఇండియాలోనూ గట్టిగానే కనిపిస్తోంది. ఇక్కడా ఉగ్రదాడులు జరిగే అవకాశముందన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు ఢిల్లీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఢిల్లీతో పాటు మరి కొన్ని చోట్ల కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నమాజ్‌లను దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున పోలీసులు మొహరించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఇజ్రాయేల్ ఎంబసీతో పాటు జూదులకు సంబంధించిన మతపరమైన నిర్మాణాలు, ప్రార్థనా మందిరాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఢిల్లీ సహా మరి కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనూ అలెర్ట్ చేశాయి నిఘా సంస్థలు. దేశంలోని ఇజ్రాయేల్ పౌరులకు రక్షణ కల్పించాలని సూచించాయి. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాలను అలెర్ట్ చేశాయి. ఆయా రాష్ట్రాల్లోని ఇజ్రాయేల్ దౌత్యవేత్తలు, స్టాఫ్, టూరిస్ట్‌ల ప్రాణాలకు హాని లేకుండా చూసుకోవాలని నిఘా సంస్థలు సూచించాయి. జూదులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే ప్రమాదముందని ఇప్పటికే యూకే, ఫ్రాన్స్, యూఎస్, జర్మనీలో భద్రత పెంచారు. పాలస్తీనాకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశముందని అప్రమత్తమయ్యాయి.
Israel's war on Hamas rages, Delhi Police conducts late-night patrolling in Jama Masjid area after "inputs"
— ANI Digital (@ani_digital) October 13, 2023
Read @ANI Story | https://t.co/2aczzyyfgE#DelhiPolice #LateNightPatrolling #IsraelHamasWar #Delhi pic.twitter.com/pOF1BYJuUj
దాదాపు వారం రోజులుగా పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులపై ఎదురు దాడులు చేస్తోంది ఇజ్రాయేల్ సైన్యం. అక్టోబర్ 7న మొదలైన యుద్ధం తీవ్రంగా మారుతోంది. ఇప్పటికే వందలాది ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు 222 మంది సైనికులూ చనిపోయారు. 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా మరోసారి ఇజ్రాయేల్‌లో ఇలాంటి యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. మహిళలు, చిన్నారులూ శిథిలాల కింద నలిగిపోతున్నారు.
ఇజ్రాయెల్-గాజాల మధ్య జరుగుతున్న ఘర్షణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వేలాది మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో హమాస్ కమాండర్ మహమూద్ అల్-జహర్ మరింత ఆందోళన కలిగించే వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంపై ఆధిపత్యమే తమ లక్ష్యం అంటూ ఆయన హమాస్ మిలిటెంట్ సంస్థ సభ్యులతో మాట్లాడుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఒక నిమిషం పాటు ఈ వీడియో ఉంది. ఇజ్రాయెల్ కేవలం తమ ప్రారంభ లక్ష్యం అని, ప్రపంచం మొత్తం తమ చట్టంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు.'ఇజ్రాయెల్ మొదటి లక్ష్యం మాత్రమే, మొత్తం భూ గ్రహమే మా చట్టం పరిధిలోకి వస్తుంది. పూర్తి గ్రహంలోని 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు అన్యాయం, అణిచివేత, హత్యలు, నేరాలు లేని సిస్టమ్ కిందకు వస్తాయి. పాలస్తీనియన్లకు, అరబ్స్, అన్ని అరబ్ దేశాలకు, లెబనాన్, సిరియా, ఇరాక్ ఇతర దేశాలకు వ్యతిరేకంగా నేరాలు జరగని చట్ట పరిధుల్లోకి అందరూ వస్తారు' అంటూ వ్యాఖ్యలు చేశాడు. హమాస్ నుంచి ఈ వీడియో విడుదలైన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. హమాస్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం కచ్చితంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Also Read: హమాస్ బంకర్లపై ఇజ్రాయేల్ సైనికుల మెరుపు దాడులు, ఒళ్లు గగుర్పొడిచే వీడియో