BJP Hindu Politics : జమిలీ ఎన్నికల్లో హిందూ రాజ్యమే ఎజెండా - సనాతన ధర్మమే బలంగా బీజేపీ గ్రౌండ్ రెడీ చేసుకుంటోందా ?
BJP : జమిలీ ఎన్నికల్లో హిందూ రాజ్యమే ఎజెండాగా బీజేపీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆ దిశగానే ఉన్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
Is BJP preparing Jamili elections with Hindu Rajya agenda : మూడో సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ఇప్పటి నుండే నాలుగోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉండే వ్యతిరేకతను అధిగమించడం అంత తేలిక కాదు కాబట్టి.. భావోద్వేగ రాజకీయాలతోనే తాము పెట్టదలచిన జమిలీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలన్న ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. వివాదాలు, విబేధాలు అన్నీ పక్కన పెట్టి హిందువులంతా ఏకం కావాలన్న ఓ వాదనను గట్టిగా వినిపించేందుకు బీజేపీ తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా పిచ్ రెడీ చేసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.
హిందువులంతా ఏకం కావాలన్న నినాదం దేనికి సంకేతం ?
వివాదాలు, విబేధాలు పక్కన పెట్టి సమాజంలో హిందువులంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల పిలుపునిచ్చారు. కులం, భాష, ప్రాంతాలకు అతీతంగా ఒక్కటై హిందూ దేశాన్ని స్థాపించాలని పిలుపునిచ్చారు. సహజంగానే ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతాయి. ఎదుకంటే ఆరెస్సెస్ బీజేపీ సిద్దాంతకర్త. బీజేపీ వ్యూహాలను ఆరెస్సెస్ ద్వారా చెప్పిస్తారన్న అభిప్రాయం ఉంది. అందుకే ఆరెస్సెస్ ఇప్పుడు మరింత ఎక్కువగా ఈ హిందూ రాజ్యం వాదన వినిపిస్తోంది. బీజేపీ నేతలూ కోరస్ అందుకుంటున్నారు. మిత్రపక్షాలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.
బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?
పవన్ కల్యాణ్ సనాతన దర్మం - హిందువుల ఐక్యతపై చర్చ
ప్రపంచదేశాల్లోని హిందువులకు దేవదేవుడైనా శ్రీనివాసుడి ఆలయంలో జరిగిన లడ్డూ కల్తీ వ్యవహారంపై హిందూత్వంపై జరిగిన దాడిగా హిందూ సమాజం తీసుకుంటోంది. ముఖ్యంగా ఉత్తరాదిలో జరిగిన నిరసనలు .. దక్షిణాది కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఈ లడ్డూ వివాదం ప్రారంభమైన వెంటనే పవన్ కల్యాణ్ సనాతన ధర్మం నినాదాన్ని అందుకున్నారు. పవన్ వ్యాఖ్యలు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యాయి. తమిళనాడును ట్రిగ్గర్ చేశారు. బీజేపీకి కొరకరానికొయ్లా ఉన్న తమిళనాడులో ఉదయనిధి చేసిన సనాతన ధర్మ నిర్మూల వ్యాఖ్యలను పవన్ వ్యూహాత్మకంగా హైలెట్ చేశారు. ఇప్పుడు తమిళనాడు హిందువుల్లోనూ చర్చ జరుగుతోంది. ఇలాంటి ఎఫెక్ట్ ను మెల్లగా దేశం మొత్తం తెచ్చేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
మరి పెళ్లంటే అన్నీ చూసుకోవాలి బ్రో - వధువు కోసం ఓ మగాడిచ్చిన ప్రకటన వైరల్
హిందూత్వ సెంటిమెంట్‌తో పదిహేనేళ్ల వ్యతిరేకత వెనక్కి పోతుందా ?
భారత ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రజలు అసహనంతో ఉంటున్నారు. అత్యంత ఘోరంగా ఓడగొడుతున్నారు. కానీ బీజేపీ నేతల రాజకీయ సామర్థ్యం భిన్నం కాబట్టి వరుసగా మూడో సారి విజయం సాధించారు. నాలుగో సారి అంటే దాదాపుగా అసాధ్యం. కానీ దాన్ని సుసాధ్యం చేయడానికి జమిలీ ఎన్నికల ద్వారా హిందూదేశం అజెండాగా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు. ప్రజల ఓటింగ్ సరళిని ఫైనల్ చేసేది భావోద్వేగమే. అది ప్రజల్లో ఎలా నింపాలో బీజేపీకి బాగా తెలుసు. అందుకే జమిలీ ఎన్నికలకు హిందూ అజెండాను సెట్ చేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు అమలవుతున్నట్లుగా అనుకోవచ్చు.