అన్వేషించండి

IITian Baba : ఇంటర్నెట్ సంచలనం ఐఐటీ బాబాను బహిష్కరించిన జునా అఖారా- కారణమేంటంటే..

IITian Baba : 'ఐఐటీయన్ బాబా'కు అఖారాతో సంబంధం లేదని జునా అఖారాకు చెందిన మరో సభ్యుడు అన్నారు. అభయ్ సింగ్ అఖారాను అప్రతిష్టపాలు చేస్తున్నాడని, అతను సాధువు కాదని చెప్పారు.

IITian Baba : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో అత్యంత వేడుకగా సాగుతోన్న మహా కుంభమేళా 2025లో గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఐఐటీ బాబా మరోసారి వార్తల్లో నిలిచారు. రాత్రికి రాత్రే సెన్సేషన్ గా మారిన ఆయనను జునా అఖారా నుంచి బహిష్కరించారనే ప్రచారం నడుస్తోంది. ఐఐటియన్ బాబా తన గురువు మహంత్ సోమేశ్వర్ పురిని ఉద్దేశించి దుర్భాషలాడారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను బహిష్కరించారని సమాచారం. అంతేకాదు అఖారా శిబిరం, దాని పరిసరాల్లోకి సైతం రాకుండా సింగ్‌పై నిషేధం విధించారు.  

అభయ్ సింగ్ పై జునా అఖారా ఆగ్రహం

"అభయ్ సింగ్ చేసిన పని గురు-శిష్య (గురువు-శిష్యుడు) సంప్రదాయానికి, సన్యాసుల సూత్రాలకు పూర్తిగా విరుద్ధం. ఇది గురువును అగౌరవపరచడం, సనాతన ధర్మం, అఖారా పట్ల గౌరవం లేకపోవడాన్ని చూపుతుంది. జునా అఖారాలో క్రమశిక్షణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది" అని జునా అఖారా చీఫ్ ప్యాట్రన్ మహంత్ హరి గిరి అన్నారు. అఖారా సభ్యులు కచ్చితంగా క్రమశిక్షణ పాటించాలని, తోటి వారికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని మహంత్ గిరి చెప్పారు. “గురువు మాత్రమే కాదు, తోటి దార్శనికుడికి సైతం వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరికీ అనుమతి లేదు. ఈ ఉల్లంఘన ఆధారంగానే అఖారా క్రమశిక్షణా కమిటీ అతన్ని బహిష్కరించాలని సిఫార్సు చేసింది” అని తెలిపారు.

అభయ్ సింగ్ అదృశ్యంపై ఓ అఖారా సభ్యుడు స్పందిస్తూ.. వైరల్ అయిన 'బాబా'కు అఖారాతో సంబంధం లేదని అన్నారు. అభయ్ సింగ్ అఖారాను అప్రతిష్టపాలు చేస్తున్నాడని, అతను సాధువు కాదని ఆరోపించారు. ఇకపోతే జునా అఖారాలోని సోలా మణి ఆశ్రమంలో 'బాబా' నివసించేవారని, కానీ ప్రస్తుతం ఆయన ఆచూకీపై ఎలాంటి సమాచారం లేదని సోమేశ్వర్ పూరి తెలిపారు. 

సోషల్ మీడియాలో ఐఐటీ బాబాగా వైరల్

హర్యానాకు చెందిన అభయ్ సింగ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. “ఇంజనీరింగ్ చదివిన తర్వాత, నేను ట్రావెల్ ఫోటోగ్రఫీలోకి ప్రవేశించాను. 2019లో కెనడాకు వెళ్లి అక్కడ కెనడియన్ కంపెనీలో నెలకు రూ. 3 లక్షలు అంటే రూ. 36 లక్షల ప్యాకేజీపై పనిచేశాను. ఆ తర్వాత ఉద్యోగం, జీవితంపై నిరాశ చెంది ఆధ్యాత్మికత వైపు వచ్చాన”ని చెప్పాడు. జునా అఖారాకు చెందిన మహంత్ సోమేశ్వర్ పురి శిష్యుడైన అభయ్ సింగ్.. ఐఐటీ-బాంబేలో గ్రాడ్యుయేషన్ తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో తన వృత్తిని వదిలి సాధువుగా మారారు.

Also Read : Mann Ki Baat : ఎన్నికల కమిషన్ పై మోదీ ప్రశంసలు - కుంభమేళా సహా కీలక అంశాలపై మన్ కీ బాత్ లో ప్రస్తావన

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమెరికాతో ఇక పూర్తిస్థాయి యుద్ధం, ఇరాన్ తగ్గేదేలే: మసూద్‌ పెజెష్కియాన్‌
అమెరికాతో ఇక పూర్తిస్థాయి యుద్ధం, ఇరాన్ తగ్గేదేలే: మసూద్‌ పెజెష్కియాన్‌
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
CJP ఉద్యమం ముగుస్తుందా, కొత్త మలుపు తిరగబోతోందా? సీజేపీకి పొంచిఉన్న అతిపెద్ద ముప్పు ఏంటి? 
CJP ఉద్యమం ముగుస్తుందా, కొత్త మలుపు తిరగబోతోందా? సీజేపీకి పొంచిఉన్న అతిపెద్ద ముప్పు ఏంటి? 
CM Vijay WhatsApp Bribe Buster: సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
CM Vijay WhatsApp Bribe Buster: సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
రూ.6 లక్షల లోపే మంచి ఫ్యామిలీ SUV - మన దేశంలో 8 లక్షల మంది ఎంపిక చేసుకున్న కారు
8 లక్షల మంది కొన్న ఫ్యామిలీ SUV, యూత్‌కీ ఇష్టమే - రేటు కూడా రూ.5.70 లక్షలే!
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Embed widget