అన్వేషించండి

Narayana murthy: యువత వారానికి 70గంటలు పనిచేయాలి-వర్క్‌ కల్చర్‌ మారాలన్న ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి

ఐటీలో యువ ఉద్యోగులు వారానికి 70గంటలు పనిచేయాల్సిందే అన్నారు ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి. అంతేకాదు ప్రపంచంతో పోటీ పడాలంటే... దేశంలో వర్క్‌ కల్చర్‌ కూడా మారాలన్నారు.

ఇన్ఫోసిస్‌ సహ వ్యవవస్థాపకులు నారాయణమూర్తి.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీ సెక్టార్‌లో మరింత అభివృద్ధి సాధించాలంటే... కొన్ని మార్పులు జరగాలన్నారు. మన దేశం  ప్రపంచంతో పోటీ పడాలంటే మరింత వేగంగా ముందడుగులు వేయాలన్నారు. ముఖ్యంగా యువతకు కొన్ని సూచనలు చేశారాయన. ఐటీ రంగంలో పనిచేస్తున్న యువ  ఉద్యోగులు.. వారంలో 70గంటల పనిచేయడానికి సిద్ధంగా ఉండాన్నారు. ఆర్థిక వ్యవస్థల పరంగా గణనీయ వృద్ధి సాధించిన దేశాల సరసన భారత్ నిలవాలంటే.. యువత  తీవ్రంగా కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి.

గత రెండు, మూడు దశాబ్దాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో... మన భారత దేశం పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని అన్నారు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి. దేశంలో పని ఉత్పాదకత.... చాలా తక్కువగా ఉందని, ప్రపంచంలోనే అత్యల్ప ర్యాంక్‌లో ఉందని అన్నారు. ఎక్కువ కష్టపడకపోతే... ముందుకు వెళ్లడం కష్టమే అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీలో పనిగంటలు పెంచాయని.. చైనాతో పోటీపడుతున్నాయని తెలిపారు. భారతీయ యువకులు కూడా ఎక్కువ గంటలు పనిచేయాలని.. లేకపోతే ఆర్థిక పురోగతిలో ముందున్నదేశాలతో పోటీపడటం కష్టమే అన్నారు ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి. 

ప్రభుత్వంలో అవినీతిని కూడా తగ్గించాలని సూచించారు. నేటి యువత... దేశం కోసం వారానికి 70 గంటలు పనిచేయాలని అనుకుంటానని ప్రతిజ్ఞ పూనాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మన్లు, జపనీయులు ఇదే చేశారన్నారు. చైనా వంటి దేశాలతో పోటీపడేందుకు ఇది అవసరమని చెప్పారాయన. ప్రతి జర్మన్ దేశ అభివృద్ధి కోసం అదనపు పని చేయడానికి ముందడుగు వేస్తున్నారని.. భారతీయులు కూడా ఇదే విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి. 

సాధారణంగా... భారత్‌లో రోజుకు 8గంటల పనిగంటలు ఉంటాయి. ప్రైవేట్‌ సెక్టార్‌లో వారానికి ఒక రోజు సెలవు ఉండగా... ఐటీ సెక్టార్‌లో మాత్రం శని, ఆదివారాలు సెలవు. ఈ లెక్కన వారానికి ఒక్కో ఉద్యోగి దాదాపు 50 గంటల వరకు పనిచేస్తుంటారు. అయితే... ఇది సరిపోదని.. వారానికి 70 గంటల పనిచేయాలన్నది ఇన్పోసిస్‌ నారాయణ మూర్తి వాదన అంటే. రోజుకు సగటును... 12గంటలు పనిచేయాలని ఆయన చెప్తున్నారు. దేశం కోసం శ్రమిస్తామని యువత ప్రతిబూని పనిచేయాలన్నారు. 3 వన్‌ 4 క్యాపిటల్స్ పోడ్‌కాస్ట్ 'ది రికార్డ్' మొదటి ఎపిసోడ్‌లో... ఈ వ్యాఖ్యలు చేశారు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి. 

దేశ జనాభాలో యువత ఎక్కువగా ఉన్నారని... కనుక దేశాన్ని నిర్మించగలిగే శక్తి వారిలో ఉందన్నారు ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి. యువతలో పరివర్తన రావాలని చెప్పారు. అభివృద్ధిలో  భారతదేశాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మరింత నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన విధానం అవసరమన్నారు. క్రమశిక్షణతో ఉండి పని ఉత్పాదకత మెరుగుపరచకపోతే ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదన్నారు. అందుకే అత్యంత క్రమశిక్షణతో, కష్టపడి పనిచేసే వ్యక్తులుగా దేశ యువత మరాలన్నారు. భారతీయ యువతలో వర్క్‌ కల్చర్‌ మారి తీరాలన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతోపాటు కష్టపడేతత్వం నేర్చుకోవాలన్నారు. దేశ ప్రగతి కోసం అందరి కలిసి కష్టపడాలన్నారు ఇన్ఫోసిస్‌ సహ వ్యవవస్థాపకులు నారాయణమూర్తి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Allu Arjun: వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desamఆర్టీసీ బస్సులో పంచారామాలు, ఒక్క రోజులో వెయ్యి కిలో మీటర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Allu Arjun: వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
Meenaakshi Chaudhary : 'మట్కా'తో మీనాక్షి చౌదరిపై మళ్లీ అదే ట్యాగ్ పడిందా .. అయినా అమ్మడు చాలా బిజీ!
'మట్కా'తో మీనాక్షి చౌదరిపై మళ్లీ అదే ట్యాగ్ పడిందా .. అయినా అమ్మడు చాలా బిజీ!
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
Srikakulam Politics: సిక్కోలు పార్టీ ప్రక్షాళనపై జగన్ దృష్టి - తమ్మినేని సీతారామ్ అవుట్ - నెక్ట్స్ ఎవరో ?
సిక్కోలు పార్టీ ప్రక్షాళనపై జగన్ దృష్టి - తమ్మినేని సీతారామ్ అవుట్ - నెక్ట్స్ ఎవరో ?
Embed widget