Amit Shah meets wrestlers: కేంద్ర హోంమంత్రితో రెజ్లర్ల భేటీ, చట్టం పని చట్టాన్ని చేసుకోనివ్వండన్న అమిత్‌షా
Amit Shah meets wrestlers: అమిత్ షా, రెజ్లర్ల సమావేశంలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అరెస్టుపై ఎక్కువ టైం చర్చించినట్టు సమాచారం. దర్యాప్తు చేస్తామని షా రెజ్లర్లకు హామీ ఇచ్చారు.
![Amit Shah meets wrestlers: కేంద్ర హోంమంత్రితో రెజ్లర్ల భేటీ, చట్టం పని చట్టాన్ని చేసుకోనివ్వండన్న అమిత్‌షా Indian wrestlers met Home Minister Amit Shah on Saturday Amit Shah meets wrestlers: కేంద్ర హోంమంత్రితో రెజ్లర్ల భేటీ, చట్టం పని చట్టాన్ని చేసుకోనివ్వండన్న అమిత్‌షా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/05/305ba8dd1a9c5078caed18636ab217311685939145078215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Amit Shah meets wrestlers: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్లు శనివారం హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సమావేశం అమిత్ షా నివాసంలో సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దర్యాప్తు చేయాలని, వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
శనివారం రాత్రి 11 గంటలకు హోంమంత్రి అమిత్ షా, రెజ్లర్ల సమావేశం జరిగిందని. ఇందులో సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా ఉన్నారని చెబుతున్నారు. జూన్ 9 వరకు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో అమిత్ షా రెజ్లర్లతో సమావేశమయ్యారు. ఎలాంటి వివక్ష లేకుండా దర్యాప్తు చేస్తామని రెజ్లర్లకు అమిత్ షా హామీ ఇచ్చినట్లు సమాచారం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ హామీ ఇచ్చారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలని, వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు పట్టుబట్టగా, ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చట్టం తన పని తాను చేసుకుపోతుందని అమిత్ షా అన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని త్వరగా పరిష్కరించాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. కేసును దర్యాప్తు చేసి ఛేదించడానికి పోలీసులకు సమయం ఇవ్వకూడదా అని రెజ్లర్లను అమిత్ షా అడిగారు.
శనివారం సాయంత్రం హోంమంత్రిని ఢిల్లీలోని ఆయన ఇంట్లో కలిశారు. రాత్రి 11 గంటలకు ప్రారంభమైన సమావేశం గంటకుపైగా కొనసాగిందని, దీనికి పునియా, సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్, సత్యవర్త్ కడియన్ హాజరయ్యారని తెలుస్తోంది.
మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగికపై వేధింపులకు పాల్పడ్డారని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిష్పాక్షిక విచారణ జరిపి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని అమిత్ షా రెజ్లర్లకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. "చట్టం తన పని తాను చేసుకొని పోతుంది" అని రెజ్లర్లతో చెప్పినట్లు సమాచారం.
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌పై తమ నిరసనను పెద్దగా పట్టించుకోలేదని ఆరోపించిన రెజ్లర్లు, గత నెలలో హరిద్వార్‌లోని గంగానదికి పతకాలను అందజేయాలని తమ నిర్ణయాన్ని ప్రకటించారు. నరేష్ టికాయత్ జోక్యంతో వారు కాస్త వెనక్కి తగ్గారు. కొత్త పార్లమెంటు భవనం వద్ద కూడా తమ నిరసన తెలియజేసేందుకు యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛాంపియన్లు వినేష్ ఫోగట్, సంగీతా ఫోగట్‌ను పోలీసులు నేలపై తొక్కిపెట్టిన దృశ్యాలు దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని ఆగ్రహాన్ని రేకెత్తించాయి. పోలీసులపై ప్రతిపక్షాలు, ఇతర క్రీడా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)