Trains Cancelled: 2 నెలలపాటు రద్దయిన రైళ్లు ఇవే.. జాబితాలో మీరు వెళ్లే రైలు ఉందేమో చెక్ చేసుకోండి
Trains Cancellation | శీతాకాలంలో పొగమంచు కారణంగా రైళ్లు రద్దు అవుతున్నాయి.. జనవరి 1 నుండి మార్చి 1 వరకు ప్రయాణానికి ముందు మీ రైలు సమాచారం తనిఖీ చేయండి.

Train Cancelled News: చలికాలం ప్రారంభంతోనే విమాన ప్రయాణికుల కష్టాలు పెరగనున్నాయి. తక్కువ ఖర్చుతో జర్నీ చేద్దామనుకున్న రైలు ప్రయాణికుల పరిస్థితి కూడా అంతే. చలి పెరిగే కొద్దీ ఉత్తర భారతదేశంలో పొగమంచు ప్రభావం రైళ్ల వేగంపై పడుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా రైల్వే ముందుగానే సన్నాహాలు ప్రారంభించింది. తద్వారా భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదు. పొగమంచు కారణంగా రైళ్లు ఆలస్యం అవ్వడమే కాకుండా, కొన్ని మార్గాల్లో రైళ్ల రాకపోకలు నిలిపివేస్తున్నారు.
ఈ క్రమంలో జనవరి 1 నుండి మార్చి మధ్యకాలంలో అనేక రైళ్లను రద్దు చేసింది రైల్వేశాఖ. ముఖ్యంగా యూపీ, బిహార్ మీదుగా వెళ్లే మరియు ఢిల్లీ నుండి బయలుదేరే పలు రైళ్లు ఈ నిర్ణయం పరిధిలోకి రావచ్చు. రాబోయే ఈ రోజుల్లో మీరు కూడా రైలులో ఎక్కడికైనా వెళ్తున్నారా, మీ రైలు కూడా రద్దు అయిందేమో చూసుకోండి.
ఈ కారణంతోనే రైల్వే ఈ నిర్ణయం
ప్రయాణికుల భద్రత, కార్యకలాపాలను నిర్వహించడం కోసం రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. చలికాలంలో దట్టమైన పొగమంచు సుదూర రైళ్ల సమయాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల ప్రమాదాలు, తీవ్రమైన గందరగోళం పెరిగే ప్రమాదం ఉంది. ఈ ఆందోళనను దృష్టిలో ఉంచుకుని రైల్వే ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసింది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అందుకే ఈ సమయంలో అనేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. తూర్పు మధ్య రైల్వే ఈ సమయంలో 24 జతల రైళ్ల రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ఒకేసారి కాకుండా, దశలవారీగా అమలు చేయనున్నారు. ప్రయాణికులకు ప్రయాణానికి ముందు రైలు స్టేటస్ తప్పకుండా తనిఖీ చేయాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
రద్దు అయిన రైళ్ల జాబితా
- రైలు నంబర్ 18103, టాటా అమృత్సర్ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 25, 2026 వరకు రద్దు
- రైలు నంబర్ 18104, అమృత్సర్ టాటా ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 27, 2026 వరకు రద్దు
- రైలు నంబర్ 12873, హతియా ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 26, 2026 వరకు రద్దు అవుతుంది.
- రైలు నంబర్ 12874, ఆనంద్ విహార్ హతియా ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 27, 2026 వరకు రద్దు
- రైలు నంబర్ 22857, సంత్రాగచ్చి ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి మార్చి 2, 2026 వరకు రద్దు
- రైలు నంబర్ 14617, పూర్ణియా కోర్ట్ అమృత్సర్ జనసేవ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి మార్చి 2, 2026 వరకు రద్దు అవుతుంది.
- రైలు నంబర్ 14618, అమృత్సర్ పూర్ణియా కోర్ట్ జనసేవ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు రద్దు
- రైలు నంబర్ 15903, డిబ్రూగఢ్ చండీగఢ్ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 27, 2026 వరకు రద్దు
- రైలు నంబర్ 15904, చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి మార్చి 1, 2026 వరకు రద్దు.
- రైలు నంబర్ 15620, కామఖ్యా గయ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 23, 2026 వరకు అవుతుంది.
Also Read: Indian Railways: సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. ఆ పని మాత్రం చేయొద్దని రైల్వే శాఖ హెచ్చరిక
- రైలు నంబర్ 15619, గయ కామఖ్యా ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 24, 2026 వరకు.
- రైలు నంబర్ 15621, కామఖ్యా ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 26, 2026 వరకు.
- రైలు నంబర్ 15622, ఆనంద్ విహార్ కామఖ్యా ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 27, 2026 వరకు.
- రైలు నంబర్ 22197, కోల్‌కతా వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి మార్చి 1, 2026 వరకు.
- రైలు నంబర్ 12327, హౌరా డెహ్రాడూన్ ఉపాసన ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 27, 2026 వరకు.
- రైలు నంబర్ 12328, డెహ్రాడూన్ హౌరా ఉపాసన ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు.
- రైలు నంబర్ 14003, మాల్డా టౌన్ న్యూ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు.
- రైలు నంబర్ 14004, న్యూ ఢిల్లీ మాల్డా టౌన్ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 26, 2026 వరకు.
- రైలు నంబర్ 14524, అంబాలా బరౌని హరిహర్ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 24, 2026 వరకు.
- రైలు నంబర్ 14112, ప్రయాగ్‌రాజ్ జంక్షన్ ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 25, 2026 వరకు.
- రైలు నంబర్ 14111, ముజఫర్‌పూర్ ప్రయాగ్‌రాజ్ జంక్షన్ ఎక్స్‌ప్రెస్, జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 25, 2026 వరకు.






















