అన్వేషించండి

రైల్వే ప్యాసింజర్స్‌కి గుడ్ న్యూస్, తగ్గనున్న వందేభారత్ టికెట్ ధరలు - ఏసీ చైర్ కార్ ఛార్జీలు కూడా

Vande Bharat Fare: వందేభారత్‌తో పాటు ఏసీ చైర్ కార్ ఛార్జీలు తగ్గించనున్నట్టు రైల్వే ప్రకటించింది.

Vande Bharat Fare: 

రైల్వేబోర్డ్ ప్రకటన..

రైల్వే బోర్డ్ ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. వందేభారత్‌తో పాటు అన్ని AC చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ రైళ్ల టికెట్ ధరల్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 25% మేర తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. గత నెల రోజులుగా ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ 50% కన్నా తక్కువకు పడిపోయింది. అందుకే...ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే బోర్డ్ తెలిపింది. ఈ రైళ్ల వినియోగం మరింత పెంచేందుకు టికెట్ ధరల్ని తగ్గించినట్టు వివరించింది. ఈ ధరలు తగ్గించే అధికారం జోనల్ రైల్వేస్‌కే అప్పగించింది రైల్వే శాఖ. అయితే..బేసిక్ ఫేర్‌పైనే ఈ 25% తగ్గింపు ఉంటుంది. మిగతా ఛార్జీలు..అంటే రిజర్వేషన్ ఛార్జ్‌లు, సూపర్ ఫాస్ట్ సర్‌ఛార్జ్‌, GST ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే ప్రకటించింది. 

ఇవీ వివరాలు..

ఈ తగ్గింపు కేవలం ఏసీ చైర్ కార్‌లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ట్రైన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. టికెట్ బేస్‌ ఫేర్‌పై 25% తగ్గింపు లభిస్తుంది. ఇక్కడ  కీలక విషయం ఏంటంటే...గత నెల రోజుల్లో 50% తక్కువ ఆక్యుపెన్సీ నమోదైన రైళ్లలో మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎండ్ టు ఎండ్ జర్నీకే కాకుండా మధ్య స్టేషన్‌లలో దిగిపోయే వారు కూడా 25% తగ్గింపుతో టికెట్‌లు కొనుగోలు చేసుకోవచ్చు. దాదాపు ఆర్నెల్ల పాటు ఈ స్కీమ్ కొనసాగే అవకాశాలున్నాయి. ఆ తరవాత డిమాండ్ ఆధారంగా ఈ తగ్గింపుని అమలు చేస్తూ ఉంటారని కొందరు అధికారులు వెల్లడించారు. వీకెండ్స్‌లో లేదా వీక్‌డేస్‌లో టికెట్ ధరలు తగ్గించి ఎక్కువ మంది ప్రయాణికులు సర్వీస్‌లు పొందే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఆక్యుపెన్సీని గమనించిన తరవాతే ఈ స్కీమ్‌ని కంటిన్యూ చేయాలా..లేదా ఆపేయాలా అన్నది రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంటుంది. ఆక్యుపెన్సీ ఊహించిన దానికంటే ఎక్కువగా పెరిగితే అప్పుడు ఈ స్కీమ్‌ని ఎత్తేసే అవకాశముంది. స్పెషల్ ట్రైన్‌లలో మాత్రం ఈ స్కీమ్ వర్తించదు. 

తగ్గిన ఆక్యుపెన్సీ..

ఇటీవ‌ల ప్రారంభించిన నాలుగు వందేభార‌త్ రూట్ల‌లో త‌క్కువ ఆక్యుపెన్సీ ఉంది. ఇండోర్ - భోపాల్‌, మ‌డ్‌గోన్ - ముంబ‌యి, జ‌బ‌ల్‌పూర్ - భోపాల్ రూట్ల‌లో మ‌రీ త‌క్కువగా 21 శాతం నుంచి 55 శాతం వ‌ర‌కు ఆక్యుపెన్సీ ఉంది. జూన్‌ నెలకు సంబంధించి ఆయా రైళ్ల ఆక్యుపెన్సీని పరిశీలిస్తే.. భోపాల్‌- ఇండోర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కేవలం 29 శాతం, ఇండోర్‌- భోపాల్‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కేవలం 21 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే నమోదు చేశాయి. భోపాల్‌- జబల్‌పుర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రూటులో 32 శాతం ఆక్యుపెన్సీ ఉంది. జబల్‌పుర్‌- భోపాల్‌ వందే భారత్‌ ఆక్యుపెన్సీ రేషియో 36శాతంగా ఉంది. దేశంలో చాలా వందే భారత్‌ రైళ్లు 100శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయ‌ని, కొన్ని మాత్రమే తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయ‌ని ఓ సీనియ‌ర్ అధికారి తెలిపారు. ముఖ్యంగా తక్కువ ప్రయాణ సమయం ఉన్న రైళ్లలో టికెట్‌ ధరలు తగ్గిస్తే మరింత ఆదరణ సొంతం చేసుకుంటాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.  

Also Read: పట్టాలపై నట్‌లు బోల్టులు మిస్‌, తృటిలో తప్పిన ప్రమాదం - చూడకపోతే మరో బాలాసోర్ అయ్యేదేమో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS RCB Result Update :చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS RCB Result Update :చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
IPL 2025:శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్
శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్
TDP Nominated Posts: కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
Earth Quake Updates: భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
Embed widget