రైల్వే ప్రైవేటీకరణ, కొత్త పింఛన్ స్కీం రద్దు కోసం పోరాడతాం: ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ
భారత రైల్వేలను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి ప్రభుత్వం పెట్టిందని, రైల్వే కార్మికులను సమావేశ పరిచి వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య తెలియజేశారు.
తిరుపతి : భారత రైల్వే ఈనాడు ప్రపంచ స్ధాయిలో ప్రపంచ అనుగుణంగా దేశానికి సేవలందిస్తూ, 2020 - 2021 ఏడాదిలో 1400 మిలియన్లకు పైగా సరుకు రవాణా చేసి దేశంలోని ప్రతి రాష్ట్రానికి సేవలు అందిస్తూ వస్తోందన్నారు ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య. 17.18 శాతం రైల్వే ఆదాయంను పెంచుకోగలిగాంమని, ఇలా అభివృద్ధి చెందుతున్న భారత రైల్వేలను కేంద్ర ప్రభుత్వం (Indian Government) అమ్మకానికి ప్రభుత్వం పెట్టిందని, మానిటరైజేషన్ పేరుతో, లీజ్ పేరుతో, ప్రైవేటు చేయాలని, ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. దీనిపై నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే 1.3 కోట్ల మంది రైల్వే కార్మికుల (Indian Railway Employees)ను సమావేశ పరిచి, వ్యతిరేకించాలని, పోరాటం చేసి రైల్వేని బతికించుకోవాలని, దేశాన్ని కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మర్రి రాఘవయ్య తెలియజేశారు.
ప్రైవేటీకరణను అడ్డుకోవాలని రైల్వే ఉద్యోగులు ప్రయత్నాలు
Tirumala News: తిరుమల శ్రీవారిని ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చినా మర్రి రాఘవయ్య మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే సంక్షేమం కోసం రైల్వే కార్మికులు అంతా కలిసి రావాలని, ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, ప్రభుత్వ ఆధీనంలోనే భారత రైల్వే నడిచే విధంగా పోరాటంను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
పాత పింఛన్ స్కీమ్ అమలుచేయాలి
కొత్త పింఛన్ స్కిమ్ ను రద్దు చేయాలనే ప్రతిపాదన ఇద్దరు రైల్వే శాఖా మంత్రులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినా నేటి వరకూ చలనం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్ లో పాత ఫించన్ స్కీంను పునరుద్దరణ చేసే విధంగా 2004వ సంవత్సరం నుండి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, కొత్త రైల్వే ఫింఛన్ స్కీంను రద్దు చేసే విధంగా పోరాటంను ఉధృతం చేస్తామని మర్రి రాఘవయ్య హెచ్చరించారు.
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టీటీడీ రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆదివారం 30-10-2022 రోజున 85,131 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,188 మంది తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించగా, 4.47 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయింది. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది.