అన్వేషించండి

Sunita Williams : 'మా మనసులు గెలుచుకున్నారు': సునీతా విలియమ్స్‌పై మోదీ ప్రశంస 

Sunita Williams : సునీతా విలియమ్స్‌ అండ్‌ టీం అంతరిక్షం నుంచి సురక్షితంగా భువి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఆమెకు స్వాగతం పలికారు.  

Sunita Williams : తొమ్మిది నెలలు ఐఎస్ఎస్‌లో గడిపిన తర్వాత భూమికి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్‌ అండ్‌ టీంకు ప్రధానమంత్రి మోదీ శుభాకాంక్షలు చెప్పారు. వారికి వెల్‌కమ్‌ చెప్పారు. ప్రయాణం విజయవంతమవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు.  

సునీతా విలియమ్స్‌ మంగళవారం అంతరిక్షంలో బయల్దేరిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రత్యేక లేఖ రాశారు. "మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, మీరు మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు" అని వ్యోమగామి మైక్ మాసిమినో ద్వారా రాసిన లేఖలో ప్రధాని మోడీ పేర్కొన్నారు .

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం సోషల్ మీడియాలో ఆ లేఖ కాపీని షేర్ చేశారు. " సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావడానికి ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తుండగా, భారతీయ బిడ్డ కోసం ప్రధాని నరేంద్ర మోడీ తన ఆందోళనను వ్యక్తం చేశారు" అని సింగ్ X లో రాశారు.

మార్చి 1న రాసిన లేఖలో ప్రధాని మోదీ, "భారత ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఓ కార్యక్రమంలో నేను ప్రముఖ వ్యోమగామి మిస్టర్ మైక్ మాసిమినోను కలిశాను. మాటల్లో, మీ పేరు ప్రస్తావనకు వచ్చింది. మీ గురించి, మీ పని గురించి ఎంత గర్వపడుతున్నామో చర్చించుకున్నాము. ఈ డిస్కషన్స్ తర్వాత, ఉత్తరం రాయకుండా ఉండలేకపోయాను." అని పేర్కొన్నారు. 

ఇటీవల అమెరికా పర్యటనల సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ను కలిసినప్పుడు ఆమె గురించి వాకాబు చేసినట్టు ప్రధాని మోదీ చెప్పారు .

1.4 బిలియన్ల భారతీయులు ఆమె విజయాలను చూసి గర్విస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. "ఇటీవల పరిణామాల్లో మీరు స్ఫూర్తిదాయకమైన ధైర్యం, పట్టుదల ప్రదర్శించారు. మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, మీరు మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు. మీ ఆరోగ్యం ఈ మిషన్‌లో మీ విజయం కోసం భారత ప్రజలు ప్రార్థిస్తున్నారు" అని ఆయన రాశారు.

"బోనీ పాండ్యా మీ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దివంగత దీపక్‌భాయ్ ఆశీస్సులు కూడా మీతో ఉంటాయి. 2016లో నేను అమెరికా పర్యటించిన సందర్భంగా మీతోపాటు ఆయనను కూడా కలవడం నాకు గుర్తుంది" అని ప్రధాని మోదీ అన్నారు.

ఆమెను భారత్‌ పర్యటనకు భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మోదీ అన్నారు. "భారతదేశం తన అత్యంత పేరొందిన కుమార్తెల్లో ఒకరిని ఆతిథ్యం ఇవ్వడానికి సంతోషిస్తుంది" అని ఆయన రాశారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Betting apps case: బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP DesamSunita Williams Crew 9 Dragon Capsule Splash Down | భూమిపైకి క్షేమంగా సునీతా విలియమ్స్ | ABP DesamSunita Williams Return to Earth | భగవద్గీత గణేశుడి విగ్రహం..సునీతా విలియమ్స్ ధైర్యం వెనుక కొండంత అండCase Filed Against Influencers in Betting App Case | ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Betting apps case: బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
SC Classification Bill: ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం - రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్ హామీ
ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం - రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్ హామీ
YS Sharmila : వైఎస్ఆర్ పేరు తీసేయడంపై షర్మిల ఆగ్రహం - ఎన్టీఆర్ విజయవాడ అని పేరు పెట్టుకోవచ్చుగా అని విమర్శలు
వైఎస్ఆర్ పేరు తీసేయడంపై షర్మిల ఆగ్రహం - ఎన్టీఆర్ విజయవాడ అని పేరు పెట్టుకోవచ్చుగా అని విమర్శలు
Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Seema Haider:  ఆడపిల్లకు జన్మనచ్చిన సీమా హైదర్- శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు
ఆడపిల్లకు జన్మనచ్చిన సీమా హైదర్- శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు
Embed widget