By: ABP Desam | Updated at : 13 Jul 2022 05:08 PM (IST)
Edited By: Murali Krishna
(Image Source: ANI)
Guns Seized In Delhi Airport: సాధారణంగా ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు చేసే తనిఖీల్లో అక్రమంగా తరలిస్తోన్న బంగారు దొరుకుతుంది. అయితే తాజాగా ఓ జంట వద్ద మాత్రం ఏకంగా సూట్‌కేస్ నిండా పిస్టల్స్ ఉండటం చూసి అధికారులు షాక్ అయ్యారు.
ఇదీ జరిగింది
దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ జంట వద్ద 45 పిస్టల్స్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్ అనే బార్యభర్తలు ఈ నెల 10న వియత్నాం నుంచి దిల్లీకి తిరిగి వచ్చారు.
Delhi | An Indian couple that arrived from Vietnam was nabbed & 45 guns worth over Rs 22 lakh from two trolley bags seized. They admitted their previous indulgence in smuggling 25 pieces of guns having a value of over Rs 12 lakh: Commissioner of Customs, IGI Airport & General pic.twitter.com/TvjNbJt5yA
— ANI (@ANI) July 13, 2022
జగ్జీత్ వద్ద ఉన్న రెండు ట్రాలీ బ్యాగుల్లో 45 పిస్టల్స్ ఉన్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ గన్స్‌పై ఆరా తీశారు. అయితే ఇవి తమవు కావని తన సోదరుడు మంజిత్ సింగ్ ఆ ట్రాలీ బ్యాగులను తనకు ఇచ్చినట్లు జగ్జీత్ సింగ్ తెలిపాడు. పారిస్ నుంచి విమానంలో వియత్నాం వచ్చి తన సోదరుడు ఈ ట్రాలీలు ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. అయితే గతంలో టర్కీ నుంచి 25 పిస్టల్స్‌ను భారత్‌కు తీసుకొచ్చినట్లుగా దర్యాప్తులో ఆ జంట వెల్లడించింది.
కేసు నమోదు
Ballistics report will confirm whether the guns are real or not. But in a preliminary report, NSG has confirmed that guns are fully functional and can be used: Customs
— ANI (@ANI) July 13, 2022
అయితే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ)కు చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం ఈ కేసుపై దర్యాప్తు జరుపుతోంది. దంపతులు జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్ నుంచి స్వాధీనం చేసుకున్న 45 పిస్టల్స్ విలువ దాదాపు రూ.22.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వారిద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు, గన్స్ అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: President Elections 2022: రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఏ రాష్ట్రానికి ఓట్ల విలువ ఎక్కువ?
Independence Day 2022: భూమికి 30 కిలోమీటర్ల దూరంలో మురిసిన మువ్వెన్నల జెండా!
ITBP Bus Accident: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం, ఆరుగురు జవాన్లు దుర్మరణం
Independence Day 2022: ‘హర్ ఘర్ తిరంగ’ వెబ్సైట్లో 5 కోట్ల సెల్ఫీలు!
Mukesh Ambani Family : ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు, గూగుల్ లో నెంబర్ సెర్చ్ చేసి కాల్స్
Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?
CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam
Khammam Politics: ఖమ్మంలో మళ్లీ మొదలైన హత్యా రాజకీయాలు - తెల్దారుపల్లి ఎందుకంత కీలకం !
IND vs ZIM 2022 Squad: టీమ్ఇండియాలో మరో మార్పు! సుందర్ స్థానంలో వచ్చేది అతడే!
Rakesh Jhunjhunwala: మరణించాక, తొలి ట్రేడింగ్ సెషన్లో ఝున్‌ఝున్‌వాలా షేర్లు ఎలా ఉన్నాయంటే?