ఆసియాలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, 2030 నాటికి జపాన్ ను అధిగమించే ఛాన్స్
2030 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది.
2030 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. 2030 నాటికి 7.3 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో టాప్-3లో స్థానం సంపాదిస్తుందని వెల్లడించింది. జపాన్‌ను వెనక్కి నెట్టి ఆసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా నివలనున్నట్లు ఎస్ అండ్ పీ సంస్థ తెలిపింది. వేగవంతమైన వృద్ధి సాధిస్తోన్న దేశాల సరసన భారత్ చేరింది. ఇప్పటికే బ్రిటన్, ఫ్రాన్స్‌లను పక్కకు నెట్టిన భారత్, 2030 కల్లా జర్మనీని దాటేయనుంది. ప్రస్తుతం 25.5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. చైనా 18 లక్షల కోట్ల డాలర్లు, జపాన్ 4.2 లక్షల కోట్ల డాలర్లు, జర్మనీ 4 లక్షల కోట్ల డాలర్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
ప్రస్తుతం ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, 2021 నుంచి మంచి వృద్ధి సాధించిందన దేశాల సరసన భారత నిలిచింది. 2023లోనూ స్థిరమైన వృద్ధి కొనసాస్తున్న భారత్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.2-6.3 శాతం మేర వృద్ధి సాధించే ఛాన్స్ ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ 7.8 శాతం వృద్ధి నమోదు చేసిన భారత్, గత దశాబ్దకాలంలో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జోరందుకున్నాయి. ఎఫ్ డీఐలు భారత దీర్ఘకాల వృద్ధికి దోహదపడుతున్నాయని, యువ జనాభా, పట్టణ ఆదాయాలు పెరగడం కూడా సానుకూలాంశాలుగా పేర్కొంది.
3.5 లక్షల కోట్ల డాలర్లుగా భారత ఆర్థిక వ్యవస్థ
2022లో 3.5 లక్షల కోట్ల డాలర్లుగా భారత ఆర్థిక వ్యవస్థ ఉంది. 2030 కల్లా 7.3 లక్షల కోట్ల డాలర్లకు చేరనున్నట్లు ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కట్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. దీంతో జపాన్‌ను అధిగమించి ఆసియా-పసిఫిక్‌లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ సంస్థ తెలిపింది. 2030 నాటికి 110 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ సదుపాయం లభించనుంది. 2020లో 50 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదార్లతో పోలిస్తే ఇది రెట్టింపు సంఖ్య. 4జీ నుంచి 5జీ సాంకేతికతకు మారడంతో ఇ-కామర్స్ గణనీయంగా వృద్ధి చెందనుంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగనుందని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. బలమైన దేశీయ మూలాలు, ద్రవ్యోల్బణం తగ్గొచ్చన్న అంచనాలు ఇందుకు కలిసిరావొచ్చని అంచనా వేస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇవ్వడం కూడా ఇబ్బందికరమేనని అభిప్రాయపడింది.