అన్వేషించండి

Emergency Alert System India: నెట్‌వర్క లేకపోయినా మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్! ఇవాళ వచ్చిన మెసేజ్ అసలు లక్ష్యం ఇదే!

దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక సందేశాలను పంపించింది. ప్రకృతి విపత్తుల సమయంలో పౌరులను తక్షణమే అప్రమత్తం చేసేందుకు NDMA, DoT కలిసి ఈ పరీక్ష నిర్వహించాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత్ స్వదేశీ టెక్నాలజీతో విపత్తు హెచ్చరికల వ్యవస్థను పరీక్షిస్తోంది.
  • ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లకు అత్యవసర హెచ్చరికలు పంపుతుంది.
  • నెట్‌వర్క్ రద్దీ ఉన్నా, సైలెంట్ మోడ్‌లో ఉన్నా అలర్ట్ నేరుగా స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం.

Emergency Alert System India: భారత్‌ సొంత టెక్నాలజీతో విపత్తు హెచ్చరికల వ్యవస్థలను సిద్ధం చేస్తోంది. శనివారం జరిగిన ఈ పరీక్షల్లో భాగంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో మారుమోగాయి. అసలు ఈ వ్యవస్థ ఎందుకు అవసరం? ఎలా పని చేస్తుంది? అనే వివరాలు తెలుసుకుందాం. 

శనివారం 11 గంటలకు చాలా మంది మొబైల్ వినియోగదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారి ఫోన్‌లకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పెద్ద శబ్దంతో కూడిన బీప్‌లు, వైబ్రేషన్‌లతో కూడిన సందేశం వచ్చింది. ఫోన్ స్క్రీన్‌పై అత్యవసర సేవల అలర్ట్ అని ఇంగ్లీష్ తెలుగులో హెచ్చరికలు కనిపించాయి. అయితే ఇది చూసి భయపడాల్సిన పని లేదు. భారత్ ప్రభుత్వం తన కొత్త ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంలో భాగంగానే ఈ సందేశాలను పంపింది. 

Also Read: భారత్‌లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! సామాన్యులపై పెను భారం!

మొబైల్‌ ఫోన్‌లకు వచ్చిన ఆ సందేషం ఇలా ఉంది. భారత్‌ తన పౌరుల కోసం తక్షణ విపత్తు హెచ్చరిక సేవలను అందించేందుకు స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి సెల్ బ్రాడ్ కాస్ట్‌ను ప్రారంభించింది. అప్రమత్తమైన పౌరులే సురక్షితమైన దేశానికి ఆధారం. ఈ సందేశం అందిన తర్వాత ప్రజలు ఎటువంటి చర్య తీసుకోవాలని పని లేదు. ఇది కేవలం భారత్ ప్రభుత్వం పంపిన పరీక్ష సందేశం మాత్రమే" 

ఈ పని భారత్ ప్రభుత్వంలోని రెండు కీలక విభాగాలు సమన్వయం చేసుకుంటున్నాయి. టెలికమ్యూనికేషన్ల శాఖ టెక్నాలజీ సహకారం, మొబైల్ నెట్‌వర్క్‌ల ద్వారా సందేశాల పంపిణీ బాధ్యతను చూస్తుంది. నేషనల్‌ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ అథారిటీ విపత్తు నిర్వహణలో భాగంగా పౌరుల ప్రాణ , ఆస్తి నష్టాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ రెండు విభాగాలు కలిపి దేశవ్యాప్తంగా మొబైల్‌ ఆధారిత విపత్తు కమ్యూనికేషన్ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయి. 

గతంలో సునామీలు , తుపాన్లు భూకంపాలు వచ్చినప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి రేడియోలు, టీవీ లేదా సాధారణ SMSపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే, విపత్తు సమయంలో నెట్‌వర్క్‌ జామ్ కావడం లేదా సమాచారం అందడంలో జాప్యం వల్ల ప్రాణం నష్టం ఎక్కువగా ఉండేది. ఈ వ్యవస్థతో సెకనుల వ్యవధిలోనే కోట్ల మందికి ఏక కాలంలో సమాచారాన్ని చేరవేయవచ్చు. సాధారణ SMSల వలె కాకుండా, ఇది సెల్ బ్రాడ్ కాస్ట్ టెక్నాలజీపై పని చేస్తుంది. దీని వల్ల నెట్‌వర్క్ రద్దీగా ఉన్నా సందేశం నేరుగా ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.  తుపాన్లు వరదలు, సునామీ వంటి విపత్తులు వచ్చేటప్పుడు ప్రజలను ముందుగా సురక్షితం ప్రాంతాలకు వెళ్లమని హెచ్చరించడానికి ఇది అద్భుతంగా పని చేస్తుంది. ఇది పూర్తిగా భారతీయ టెక్నాలజీతో తయారు చేశారు. దీని వల్ల భద్రత, నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుంది. 

ఈ వ్యవస్థ సెల్‌ బ్రాడ్ కాస్ట్ అనే టెక్నాలజీ ఉపయోగిస్తారు. మీరు ఇంటర్నెట్‌ ఆన్‌లో ఉంచకపోయినా మెసేజ్ వస్తుంది. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా కూడా  ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుంది. ఇది టెలికాం టవర్ల ద్వారా నిర్ణీత ప్రాంతాల్లోని మొబైల్ ఫోన్‌లన్నింటికీ ఎక కాకంలో సిగ్నల్ పంపుతుంది.

Frequently Asked Questions

భారతదేశం ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను ఎందుకు పరీక్షిస్తోంది?

దేశవ్యాప్తంగా ప్రజలకు తక్షణ విపత్తు హెచ్చరికలను అందించడానికి భారత ప్రభుత్వం తన స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షిస్తోంది. దీని ద్వారా విపత్తుల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడమే లక్ష్యం.

ఈ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది?

ఈ వ్యవస్థ సెల్ బ్రాడ్ కాస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది ఇంటర్నెట్ లేకుండా, సైలెంట్ మోడ్‌లో ఉన్న ఫోన్‌లకు కూడా టెలికాం టవర్ల ద్వారా నిర్దిష్ట ప్రాంతాల్లోని అన్ని మొబైల్ ఫోన్‌లకు ఏకకాలంలో సిగ్నల్ పంపుతుంది.

ఈ అలర్ట్ సందేశం వస్తే ప్రజలు ఏదైనా చర్య తీసుకోవాలా?

లేదు, ఈ సందేశం కేవలం భారత ప్రభుత్వం పంపిన పరీక్ష సందేశం మాత్రమే. దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి చర్య తీసుకోవాల్సిన పని లేదు. ఈ సందేశం ద్వారా ప్రజలకు విపత్తు హెచ్చరిక వ్యవస్థ గురించి అవగాహన కల్పించడమే లక్ష్యం.

గతంలో ఉన్న పద్ధతుల కంటే ఈ కొత్త వ్యవస్థ ఎలా మెరుగైనది?

గతంలో SMS, రేడియో, టీవీ వంటివాటిపై ఆధారపడేవారు. కానీ ఈ కొత్త వ్యవస్థతో సెకన్లలో కోట్ల మందికి ఏకకాలంలో సమాచారం చేరవేయవచ్చు. నెట్‌వర్క్ రద్దీగా ఉన్నా, సందేశం నేరుగా ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Ban On Protests: దీపావళి వరకు నిరసనలపై నిషేధం.. ప్రధానికి దిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి
దీపావళి వరకు నిరసనలపై నిషేధం.. ప్రధానికి దిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి
US PERM Labor Certification Suspension: అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget