అన్వేషించండి

Cell phone alert: శనివారం మీ మొబైల్‌కు అత్యవసర హెచ్చరికలు.. భయపడాల్సిన పనే లేదు - ఎందుకో తెలుసా?

Cell phone alert: మొబైల్ వినియోగదారులందరికీ మే 2, 2026న ఒకేసారి అత్యవసర హెచ్చరిక సందేశాలు రానున్నాయి. అయితే ఇవి టెస్టింగ్‌కేనని కేంద్రం ప్రకటించింది.

Cell phone danger signal alert:  దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులందరికీ మే 2, 2026న  ఒకేసారి అత్యవసర హెచ్చరిక సందేశాలు రానున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA), టెలికాం విభాగం (DoT) సంయుక్తంగా చేపడుతున్న  సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్  పరీక్షలో భాగంగా ఈ సందేశాలను పంపనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఈ వినూత్న వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించనున్నారు.   అందుకే  ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ఇది కేవలం సాంకేతిక పరీక్ష మాత్రమేనని ప్రభుత్వం  ముందస్తుగా అందరికీ సమాచారం పంపుతోంది.                     

ఏమిటీ సెల్ బ్రాడ్‌కాస్ట్ వ్యవస్థ?                    

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సెకన్ల వ్యవధిలో లక్షలాది మందిని అప్రమత్తం చేయడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. సాధారణ ఎస్ఎంఎస్ పంపడానికి నెట్‌వర్క్ సామర్థ్యం సరిపోకపోయినా, ఈ సెల్ బ్రాడ్‌కాస్ట్  సాంకేతికత ద్వారా ఒకేసారి ఒక నిర్దిష్ట ప్రాంతంలోని అన్ని ఫోన్లకు సందేశం చేరుతుంది. దీని కోసం వినియోగదారులకు ఇంటర్నెట్ సౌకర్యం ఉండాల్సిన అవసరం లేదు. సెల్ టవర్ల పరిధిలోని ప్రతి హ్యాండ్‌సెట్‌కు ఈ హెచ్చరిక నేరుగా వెళ్తుంది.

టెస్ట్ అలర్ట్ ఎలా ఉంటుంది? 

రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏ క్షణంలోనైనా మీ ఫోన్‌కు ఈ టెస్ట్ మెసేజ్ రావచ్చు. ఈ సందేశం వచ్చినప్పుడు మీ మొబైల్ ఫోన్ బిగ్గరగా బీప్ శబ్దం చేస్తూ వైబ్రేట్ అవుతుంది. ఫోన్ స్క్రీన్‌పై  NDMA will test Cell Broadcast Alerts... అనే సందేశం కనిపిస్తుంది. ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఈ హెచ్చరికలు వస్తాయి. ఈ మెసేజ్ చూడగానే మీరు ఎటువంటి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన పని లేదు.

 ముందస్తు అప్రమత్తతే లక్ష్యం                 

వరదలు, భూకంపాలు, సునామీలు లేదా భారీ తుపాన్ల వంటి విపత్తులు సంభవించే ముందే ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం  సాచెట్  అనే ఇంటిగ్రేటెడ్ అలర్ట్ పోర్టల్‌ను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. గతంలో సుమారు 134 బిలియన్ల ఎస్ఎంఎస్ హెచ్చరికలను ప్రభుత్వం పంపినప్పటికీ, సెల్ బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీ మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు.

 ప్రజలకు విజ్ఞప్తి 

ఈ మొబైల్ హెచ్చరికలు కేవలం వ్యవస్థ పనితీరును సరిచూడటానికేనని, ఎవరూ భయాందోళనలకు గురికావద్దని ఎన్‌డీఎంఏ కోరింది. ఒకవేళ మీ ఫోన్‌లో  వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్  సెట్టింగ్ ఆన్‌లో ఉంటేనే ఈ పరీక్షా సందేశాలు అందుతాయి. భవిష్యత్తులో నిజమైన ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ వ్యవస్థ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.         

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Ban On Protests: దీపావళి వరకు నిరసనలపై నిషేధం.. ప్రధానికి దిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి
దీపావళి వరకు నిరసనలపై నిషేధం.. ప్రధానికి దిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Sandpapergate Secrets Exposed: అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
Embed widget