అన్వేషించండి

I.N.D.I.A Alliance: బిహార్, మహారాష్ట్ర, జమ్మూ అన్నీ ఓకే- ఆ ఒక్క రాష్ట్రంలో సీట్ల పంపకం పెద్ద సవాలే!

INDIA Alliance: ప్రతిపక్ష I.N.D.I.A కూటమిలో సీట్ల పంపకం విషయంలో బెంగాల్ విషయంలో సవాల్ విసరనుంది.

I.N.D.I.A Alliance: జట్టు కట్టినా, పొత్తు పెట్టినా ఓ పార్టీల మధ్యనైనా సీట్ల పంపకం అనేది పెద్ద పంచాయితీ. కూటమిలోని పార్టీలు సమ ఉజ్జీలుగా ఉంటే సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక మరింత సవాలుగా ఉంటుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలని I.N.D.I.A పేరుతో జట్టు కట్టిన 28 పార్టీల మధ్య సీట్ల పంపకం అనేది ఏమంత సులభంగా అయ్యేలా లేదు. ఈ కూటమిలో కొన్ని పార్టీల మధ్య, మరీ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో సీట్ల పంపకం చాలా కఠినంగా ఉండనుంది. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 28 పార్టీల కూటమి సీట్ల పంపకాన్ని ఫైనల్ చేసేందుకు చేరువైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన(UBT) ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్నాయి. బిహార్, జమ్మూ కశ్మీర్ లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బందులు రాకపోవచ్చు. కానీ కొన్ని రాష్ట్రాల్లో సీట్ల పంపకం మాత్రం సవాలుగా మారనుంది. బెంగాల్ లో అధికార తృణమూల్, కాంగ్రెస్, సీపీఐ మధ్య ఎలాంటి పొత్తు లేదు. తాజాగా  I.N.D.I.A కూటమిలో ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ మూడు పార్టీల మధ్య సీట్ల పంపకంలో కొత్త ఇబ్బంది తప్పదని రాజకీయ నిపుణులు అంటున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలనేది ఈ సీట్ల పంపకాల ఉమ్మడి లక్ష్యం. ఎటువంటి భేషాజాలకు పోకుండా ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్తేనే బీజేపీని ఢీకొట్టగలమని భావిస్తున్న కూటమి నేతలు ఈ సారి బలమైన అభ్యర్థులనే పోటీలో నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. 

ప్రతిపక్ష I.N.D.I.A కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం నిన్న జరిగింది. పార్టీల మధ్య సీట్ల పంపకం, రాబోయే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ముంబయి వేదికగా I.N.D.I.A కూటమి మూడోసారి సమావేశమైనప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఎటువంటి భేషాజాలకు పోకుండా ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్తేనే బీజేపీని ఢీకొట్టగలమని భావిస్తున్న కూటమి నేతలు ఈ సారి బలమైన అభ్యర్థులనే పోటీలో నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జరిగిన మొదటి సమన్వయ కమిటీ సమావేశంలో సీట్ల షేరింగ్ మీదే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.పార్టీలకతీతంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి పోటీకి నిలబెట్టడానికి ఈ సమావేశం జరిగింది.

14 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానుంది. కూటమిలో ఏ నిర్ణయం అయినా ఈ కమిటీనే తీసుకుంటుంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్తారన్న వార్తల నేపథ్యంలో వీలైనంత తొందరగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని I.N.D.I.A కూటమి భావిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో అభ్యర్థుల కేటాయింపు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లోని సీట్ల పంపకమే సమన్వయ కూటమికి సవాలుగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
Embed widget