By: ABP Desam | Updated at : 07 Aug 2023 05:59 PM (IST)
Edited By: Pavan
మేరీ మాటీ మేరా దేశ్ - ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన ఈ ప్రచారం ఏంటి? ( Image Source : ABP Hindi )
Meri Mati Mera Desh Campaign: అమర జవాన్లు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పౌరులను గౌరవించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) వరకూ దేశవ్యాప్తంగా మేరీ మాటీ మేరా దేశ్ (నా మట్టి.. నా దేశం) పేరుతో అమరవీరుల జ్ఞాపకార్థం ప్రతి గ్రామ పంచాయతీలో స్మారకాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మన్ కీ బాత్ లో దేశ ప్రజలను ఉద్దేశించి ఈ కార్యక్రమం గురించి మోదీ చెప్పుకొచ్చారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అమృత్ కలశ్ యాత్ర చేపట్టనున్నారు.
దేశమంతటా వివిధ ప్రాంతాల నుంచి 7,500 కలశాల్లో పవిత్ర మట్టిని, దాంతో పాటు మొక్కలు దేశ రాజధాని ఢిల్లీకి తీసుకురానున్నట్లు మోదీ వెల్లడించారు. ఆ పవిత్రమైన మట్టితో ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం సమీపంలో అమృత్ వాటికను నిర్మించనున్నారు. ఆ అమృత్ వాటికలోనే మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. ఈ అమృత్ వాటిక ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్ కు గొప్ప చిహ్నంలా నిలుస్తుందన్నారు. జులై 30వ తేదీన జరిగిన మన్ కీ బాత్ 103 ఎడిషన్ సందర్భంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆగస్టు 9వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. గతేడాది హర్ ఘర్ తిరంగ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టగా.. అది విజయవంతం అయింది. దేశవ్యాప్తంగా ప్రతి కుటుంబం తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసింది.
దేశంలోని నలుమూలల నుంచి 7,500 కలశాల్లో మట్టిని.. అమృత కలశ యాత్ర పేరుతో ఢిల్లీకి తీసుకు వస్తారు. ఈ యాత్రలో భాగంగానే వివిధ ప్రాంతాల నుంచి రకరకాల మొక్కలను కూడా తీసుకెళ్తారు. మొత్తంగా 7,500 కలశాల మట్టితో, మొక్కలతో జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమృత వాటిక నిర్మిస్తారు. ఈ అమృత వాటిక ఉద్యానవనం.. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కు చిహ్నంలా నిలుస్తుందని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడానికి ఉద్దేశించబడిందని తెలిపింది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు వదిలిన అనేక మంది త్యాగాలను ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా గుర్తించినట్లు అవుతుందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో ప్రతి భారతీయుడు భాగం కావాలని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో కోరారు.
'Meri Mati Mera Desh' - A campaign to honour our bravehearts. #MannKiBaat pic.twitter.com/yMfX4OiyhF
— PMO India (@PMOIndia) July 30, 2023
Also Read: Manipur Violence: మణిపూర్ బీజేపీ ప్రభుత్వానికి షాక్, సర్కారు నుంచి వైదొలిగిన కీలక పార్టీ
రాబోయే 25 సంవత్సరాలు భారత దేశానికి అమృత కాలమని గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చినట్లు మోదీ గుర్తుచేశారు. అప్పుడు ఎర్రకోట నుంచి అమత్ కాల్ గురించి పంచ ప్రాణ గురించి వివరించినట్లు చెప్పారు. సంకల్పాలను నెరవేర్చడానికి ప్రమాణం చేయాలన్నారు. మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో పాల్గొని చేతితో కలశాలు మట్టిని పట్టుకున్న సెల్ఫీలను yuva.gov.in లో అప్ లోడ్ చేయాలని మోదీ పిలుపునిచ్చారు.
Sharing this month's #MannKiBaat. Do tune in! https://t.co/z1YYe9E7w2
— Narendra Modi (@narendramodi) July 30, 2023
AFCAT 2023: ఏఎఫ్ క్యాట్ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Rajasthan Elections: ముస్లిం ఎంపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరికి కీలక బాధ్యతలు
NIA Raids: 6 రాష్ట్రాల్లో 51 చోట్ల ఎన్ఐఏ సోదాలు- ఖలిస్థానీ, గ్యాంగ్స్టర్స్ సమాచారంతో దాడులు
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం
Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్‌కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
/body>