News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Independence Day 2023: స్వాతంత్రోద్యమంలో యువత పాత్ర- భగత్ సింగ్ నుంచి ఆజాద్ వరకు స్ఫూర్తి రగిలించిన వీరులు

Independence Day 2023: భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో యువత పాత్ర చాలా కీలకం.

FOLLOW US: 
Share:

Independence Day 2023: బ్రిటీష్ వలస పాలన నుంచి భారతదేశం స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం దేశ చరిత్రలో ఒక కీలకమైన కాలం. అచంచలమైన సంకల్పంతో దేశ ప్రజలంతా ఐకమత్యంతో, సంకల్పబలంతో పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యం. ఈ స్వాతంత్రోద్యమ సంగ్రామంలో యువతది కీలక పాత్ర. వారి ఉడుకు రక్తం, పోరాట పటిమ, దృఢ సంకల్పం పోరాటంలో ముఖ్య భూమిక పోషించాయి. స్వేచ్చా స్వతంత్రాల కోసం, సార్వభౌమ దేశం కోసం అంకితభావం, ధైర్యం, దృక్పథానికి యువత పోరు ఉదాహరణ. 

యువ నాయకుల ఆవిర్భావం

తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించి తమ ఉజ్వల భవిష్యత్తు కోసం యువత చేసిన పోరాటానిది స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర. స్వాతంత్ర్య ఉద్యమ దిశను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖ నాయకులు తమ శక్తితో, వినూత్న ఆలోచనలతో ఉద్యమాన్ని ప్రేరేపించారు. అది వారి యువ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. ఈ యువ నాయకులు స్వాతంత్ర్య పోరాటాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లారు. 

సైద్ధాంతిక ప్రభావం

యువత కొత్త దృక్పథాలను, సిద్ధాంతాలను పోరాటానికి తెరపైకి తెచ్చింది. అహింసాత్మక శాసనోల్లంఘనను సమర్థించిన మహాత్మా గాంధీ ఆలోచనల నుంచి ప్రేరణ పొంది, వారు శాంతియుతమైన, నిర్ణయాత్మకమైన ప్రతిఘటనను సృష్టించేందుకు కృషి చేశారు. అదే సమయంలో, భగత్ సింగ్ వంటి ఇతర యువ నాయకులు బ్రిటీష్ వలస పాలకులను ఎదుర్కోవడానికి మరింత దూకుడైన విధానాన్ని స్వీకరించారు. యువకుల శ్రేణుల్లోని ఈ వైవిధ్య భావజాలం బహుముఖ పోరాటానికి దోహదపడింది. 

సామూహిక జనసమీకరణ

నిరసనలు, పాదయాత్రలు, బహిష్కరణలకు జనాన్ని సమీకరించడంలో యువత కీలక పాత్ర పోషించింది. ఉద్ధృతమైన ర్యాలీలు నిర్వహించారు. ఆవేశపూరిత ప్రసంగాలతో ఉర్రూతలూగించేవారు. అవగాహనను వ్యాప్తి చేయడానికి, ప్రజల మద్దతును పెంచడానికి విప్లవ సాహిత్యాన్ని ప్రచురించి స్ఫూర్తి రగిలించారు. బ్రిటీష్ అణచివేతకు వ్యతిరేకంగా బలమైన, ఐక్య ఉద్యమాన్ని నిర్మించడంలో ముఖ్య భూమిక పోషించారు. 

త్యాగానికి ప్రతీక

చాలా మంది యువ కార్యకర్తలు దేశ స్వాతంత్ర్యం కోసం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అపారమైన త్యాగాలు చేశారు. ప్రాణ త్యాగంతో భగత్ సింగ్ ఆయన సహచరులు రాజ్ గురు, సుఖ్ దేవ్ మొత్తం దేశాన్ని తీవ్రంగా కదిలించారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిలబడటానికి ఇతరులను ప్రేరేపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను  అర్పించేందుకు యువత సిద్ధపడటం ప్రతిఘటనకు, సంకల్పానికి ప్రతీకగా నిలిచింది.

Also Read: Women Freedom Struggle: స్వాతంత్య్ర పోరాటంలో తెగించి కొట్లాడిన ధీర వనితలు, ఒక్కొక్కరి జీవితం స్ఫూర్తిదాయకం

భారత భవిష్యత్తును రూపొందించడం

స్వాతంత్ర్యం పోరాటంలో యువత పాల్గొనడం భారత దేశ స్వాతంత్ర్యానంతర పథంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి లక్ష్యం కోసం పోరాడిన అనుభవం వారిలో బాధ్యత, నాయకత్వం, దేశ నిర్మాణ స్పృహను నింపింది. అనేక మంది యువ నాయకులు స్వతంత్ర భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్రలను పోషించారు.

వారసత్వం, పాఠాలు

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో యువత పాత్ర వారసత్వం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. వారి అంకితభావం ధైర్యం, పట్టుదల, వ్యక్తులు వారి వయస్సుతో సంబంధం లేకుండా, పరివర్తనాత్మక మార్పును ప్రేరేపించగలదని రుజువు చేశాయి. ఐక్యత, దృఢ సంకల్పం, స్పష్టమైన దృక్పథం సానుకూల సామాజిక పరివర్తనను సాధించడానికి చాలా ముఖ్యమైనవని అర్థం చేసుకోవడం యువత విలువైన పాఠాలను నేర్చుకుంది.

Published at : 14 Aug 2023 09:19 PM (IST) Tags: August 15 Independence Day Happy Independence Day Independence Day 2023 Independence Day Features Happy Independence Day

ఇవి కూడా చూడండి

ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్‌ - సరిహద్దుల్లో భారీ భద్రత

ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్‌ - సరిహద్దుల్లో భారీ భద్రత

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేసిన లోకేష్‌- ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేసిన లోకేష్‌- ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

Vivek Ramaswamy: అక్రమ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నా:వివేక్‌ రామస్వామి

Vivek Ramaswamy: అక్రమ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నా:వివేక్‌ రామస్వామి

Metallic objects in Stomach: మనిషి కడుపులో ఇయర్‌ ఫోన్లు, వైర్లు, బోల్ట్‌లు, వైర్లు-ఆపరేషన్‌ చేసి బయటకు తీసిన డాక్టర్లు

Metallic objects in Stomach: మనిషి కడుపులో ఇయర్‌ ఫోన్లు, వైర్లు, బోల్ట్‌లు, వైర్లు-ఆపరేషన్‌ చేసి బయటకు తీసిన డాక్టర్లు

టాప్ స్టోరీస్

World Cup 2023: హైదరాబాద్‌లో పాక్‌xకివీస్‌ వార్మప్‌ మ్యాచ్‌! వర్షం కురిసే ఛాన్స్‌!

World Cup 2023: హైదరాబాద్‌లో పాక్‌xకివీస్‌ వార్మప్‌ మ్యాచ్‌! వర్షం కురిసే ఛాన్స్‌!

Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్!

Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్!

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

Ritika Singh: ఆ ఘటన చూసి గుండె మండింది, ఇబ్బంది అనిపించినా అమ్మాయిలకు వాటిని నేర్పించాల్సిందే

Ritika Singh: ఆ ఘటన చూసి గుండె మండింది, ఇబ్బంది అనిపించినా అమ్మాయిలకు వాటిని నేర్పించాల్సిందే