Weather Update IMD: కొర్రాసు నెగడోలే మండనున్న ఎండలు- హాఫ్ సెంచరీ కొట్టడం పక్కా!
Weather Update IMD: ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
Weather Update IMD:
వేసవి కాలం అంటేనే భయమేస్తుంది. ఇప్పటికే ఎండలు కొన్ని చోట్ల 45 డిగ్రీల సెల్సియస్‌ను తాకాయి. అయితే తాజాగా భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. ఈ వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ప్రస్తుత ఎండల తీవ్రత మే 2 వరకూ ఇదేవిధంగా కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది.
i) Heat wave conditions to continue over Northwest & Central India till 02nd May and over East India till 30th April and abate thereafter.
— India Meteorological Department (@Indiametdept) April 30, 2022
• pic.twitter.com/5gBVQfPj2d
ఆ ప్రాంతంలో
సాధారణంగా మే నెలలో ఎండలు అధికంగా ఉంటాయి. కనుక ఈ ఏడాది మే నెలలో పశ్చిమ రాజస్థాన్‌లోని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 50 డిగ్రీ సెల్సియస్ దాటేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పశ్చిమ- మధ్య భారతం, వాయువ్య ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఈశాన్య భారతంలోనూ ఇవే పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే మే నెలలో ఎలా గడపాలోనని ప్రజలు భయపడుతున్నారు.
122 ఏళ్లలో
2022 మార్చి - ఈ ఏడాది మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయని పేర్కొంది. 1901 తర్వాత భారత్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేసిన మార్చి నెల.
కార్మికులు