ICC World Cup Final: అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ బంద్, డిమాండ్‌ని తట్టుకోలేక కీలక నిర్ణయం
ICC World Cup Final: ఫైనల్ మ్యాచ్ డిమాండ్‌ని తట్టుకోలేక అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌ని 45 నిముషాల పాటు మూసేయనున్నారు.
ICC World Cup Final Match Updates:
ఎయిర్‌పోర్ట్ బంద్..
World Cup News: నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని (ICC Cricket World Cup) చూసేందుకు వేలాది మంది అహ్మదాబాద్‌కి తరలి వచ్చారు. నగరమంతా కిటకిటలాడిపోతోంది. పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఈ మ్యాచ్‌ని చూసేందుకు రానున్నారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఎయిర్‌పోర్ట్‌ని (Sardar Vallabhbhai Patel International) కాసేపు మూసేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ప్రత్యేక విన్యాసాలు చేయనుంది. ఇది దృష్టిలో పెట్టుకుని 45 నిముషాల పాటు మూసేస్తామని ప్రకటించింది. మధ్యాహ్నం 1.25 నిముషాల నుంచి 2.10 గంటల వరకూ మూసేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అడ్వైజరీని జారీ చేసింది. ఈ టైమింగ్స్‌కి అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌కి రావాలని ప్రయాణికులకు సూచించింది. సెక్యూరిటీ ప్రోటోకాల్ (Ahmedabad Security Protocol) వల్ల 45 నిముషాల పాటు ఎయిర్‌పోర్ట్‌ని మూసేస్తున్నట్టు స్పష్టం చేసింది. నవంబర్ 17న కూడా కాసేపు ఎయిర్‌పోర్ట్‌ని మూసేశారు.
"వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కారణంగా ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగే అవకాశముంది. అందుకే 45 నిముషాల పాటు ఎయిర్‌పోర్ట్‌ని మూసేయాలని నిర్ణయం తీసుకున్నాం. మీ ఫ్లైట్ షెడ్యూల్‌ని ఓ సారి చెక్ చేసుకోండి. కాస్త ఆలస్యంగానే ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరండి. నవంబర్ 17న ఎయిర్‌పోర్ట్‌ని మూసేశాం. ఇవాళ కూడా (నవంబర్ 19) 45 నిముషాల పాటు ఎయిర్‌పోర్ట్‌ని మూసేస్తున్నాం"
- ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం
#SVPIAirport expects heavy traffic for the World Cup final. Please allocate extra time for travel procedures and check your flight schedules due to airspace closure on 17th & 19th November, 13:25 to 14:10 hours. Your safety is our top priority. Thank you for your cooperation. pic.twitter.com/jFnjw7eVDw
— Ahmedabad Airport (@ahmairport) November 17, 2023
ఫుల్ డిమాండ్..
మ్యాచ్ కారణంగా ఎయిర్‌పోర్ట్‌కి (Ahmedabad Airport) ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఇక్కడ కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. స్టాండ్‌బై సెక్యూరిటీ టీమ్‌ని అందుబాటులో ఉంచారు. పార్కింగ్ కోసం స్పెషల్‌గా 15 స్టాండ్‌లు ఏర్పాటు చేశారు. రాత్రంతా వాహనాలు ఇక్కడే పార్క్ చేసుకునేలా వసతి కల్పించారు. అటు Akasa Air సంస్థ ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. గుజరాత్ నుంచి వెళ్లే, గుజరాత్‌కి వచ్చే ఫ్లైట్‌ల టైమింగ్స్‌లో కొంత మార్పులు జరిగే అవకాశముందని తెలిపింది. మ్యాచ్‌ని చూసేందుకు ఎక్కువ మంది వస్తుండడం వల్ల ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. ఫ్లైట్ టైమింగ్స్ కన్నా కనీసం మూడు గంటల ముందే ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి ఉండాలని సూచించింది.
Also Read: IND vs AUS Final 2023: టీమిండియా గెలిస్తే వంద కోట్లు పంచేస్తా , సంచలన ప్రకటన చేసిన పారిశ్రామికవేత్త