IAF Fighter Jet Crash: కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ మిగ్ 29, విచారణకు డిఫెన్స్ శాఖ ఆదేశాలు
IAF Fighter Jet Crashes : భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానం మిగ్ 29 ప్రమాదానికి గురైంది. ఆగ్రా సమీపంలో ఐఏఎఫ్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలింది.
IAFs MiG 29 Fighter Jet Crashes : న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కు చెందిన ఓ యుద్ధ విమానం కుప్పకూలింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మిగ్-29 యుద్ధ విమానం సోమవారం నాడు కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ పైలట్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. మిగ్ 29 ఫైటర్ జెట్ పంజాబ్‌లోని అదంపూర్ నుంచి బయలుదేరి ఆగ్రాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యుద్ధ విమానం కుప్పకూలిన ఘటనపై డిఫెన్స్ అధికారులు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
యుద్ధ విమానం కూలిన విషయం తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు మిగ్ 29ను చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. యుద్ధ విమానం కొన్ని నిమిషాల్లోనే మంటల్లో కాలిపోయింది. అయితే ఏ కారణంగా ఫైటర్ జెట్ కుప్పకూలిందన్న దానిపై అధికారులు విచారణ చేపట్టనున్నారు.
VIDEO | Indian Air Force's MiG-29 fighter jet, which took off from Adampur in Punjab, crashes near Agra. The pilot has ejected safely from the place. Details awaited.
— Press Trust of India (@PTI_News) November 4, 2024
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/2DzUEVCg5f
A MiG-29 aircraft of the IAF crashed near Agra during a routine training sortie today, after encountering a system malfunction. The pilot manoeuvered the aircraft to ensure no damage to life or property on ground, before ejecting safely.
— Indian Air Force (@IAF_MCC) November 4, 2024
An enquiry has been ordered by the IAF,…