అన్వేషించండి

Waqf Bill TDP: వక్ఫ్ బిల్లుకు టీడీపీ వ్యతిరేకమని టీడీపీ నేత ప్రకటన - జాతీయ రాజకీయాల్లో కలకలం - అసలు నిజమేంటి ?

Waqf Bill: వక్ఫ్ బిల్లును టీడీపీ వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ నేత ఒకరు చేసిన ప్రకటనతో జాతీయ రాజకీయాల్లో హడావుడి కనిపించింది. టీడీపీ ఎన్డీఏ కూటమిలో నిర్ణయాత్మక భాగస్వామి కావడమే దీనికి కారణం.

TDP leader Nawab John announced that TDP is against the Waqf Bill: కడప జిల్లాకు చెందిన  నవాబ్ జాన్ అలియాస్ అమీర్ బాబు అనే టీడీపీ ీనేత ఢిల్లీలో జరిగిన ఓ ముస్లిం సంస్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.  వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, సీఎం చంద్రబాబు సైతం దీనికి మద్దతు తెలపడం లేదని నవాబ్ జాన్ వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ బిల్లును తీసుకురావడానికి అనుమతించబోమని  తెలిపారు. చంద్రబాబు నాయుడు సెక్యులర్ మైండ్ ఉన్న వ్యక్తి అని, ఆయన హిందువులను, ముస్లింలను ఒకే కోణంలో చూస్తారన్నారు. నవాబ్ జాన్ మాటలు నేషనల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. 

కడప టీడీపీ నేత అమీర్ బాబునే ఈ నవాబ్ జాన్ 

టీడీపీ తరపున వకాల్తా పుచ్చుని వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకం అంటూ కీలక ప్రకటన చేసిన నవాబ్ జాన్  ఎవరో చాలా మందికి ముందుగా తెలియలేదు. అసలు తెలుగుదేశం పార్టీలో అలాంటి పేరుతో ఎవరూ ప్రముఖ నేత లేదు. కనీసం ఓ మాదిరి నేత కూడా లేరు. కానీ జాతీయ మీడియాలో ఆయన పేరుతో టీడీపీ విధాన నిర్ణయం అంటూ ప్రచారం కావడంతో ఆయన పేరు హైలెట్ అయింది. అయితే ఈ నవాబ్ జాన్ ను కడపలో అందరూ అమీర్ బాబు అని పిలుస్తారు. టీడీపీ తరపున ఒక్క సారి కడప అసెంబ్లీకి పోటీ చేశారు. ప్రస్తుతానికి టీడీపీ నుంచి ఆయనకు ఎలాంటి పదవి లేదు. 

నవాబ్ జాన్ అలియాస్ అమీర్ బాబు ప్రకటనకు విలువ ఎంత ? 

నవాబ్ జాన్ అలియాస్ అమీర్ బాబుకు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతానికి ఎలాంటి పదవి లేదు. మైనార్టీ సెల్‌లోనూ ఆయన కీలకంగా లే్రు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లి ముస్లిం మత సమావేశంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ విధాన నిర్ణయం గురించి ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ అంశంపై.. నవాబ్ జాన్ ప్రకటనపై ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. 

వక్ఫ్ బిల్లుపై టీడీపీ అధికారిక స్పందనేమిటి ?

వక్ఫ్ బిల్లును టీడీపీ వ్యతిరేకిస్తున్నట్లుగా ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా ప్రకటన చేయలేదు. వక్ఫ్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టినప్పుడు అందులో ప్రతిపాదించిన నలభై సవరణల విషయంలో కూడా ఎలాంటి అభ్యంతాలు వ్యక్తం చేయలేదు. వక్ఫ్ బిల్లుకు టీడీపీ సానుకూలంగానే ఉందన్న సంకేతాలు వచ్చాయి. అదే సమయంలో మరో మిత్రపక్షం జేడీయూ కూడా మద్దతుగానే ఉంది. అయితే ఆ బిల్లును విపక్ష పార్టీల డిమాండ్‌తో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు.  ప్రస్తుతం అది  జేపీసీ దగ్గర ఉంది. తాము వ్యతరేకిస్తామని టీడీపీ కనీసం ఎలాంటి సంకేతాలు పంపలేదని అనుకోవచ్చు. 

ఎన్డీఏ నిర్ణయాలకు మద్దతుగానే టీడీపీ !

ఎన్డీఏ 3.0లో టీడీపీ ప్రభుత్వం కీలకంగా ఉంది. ఓ రకంగా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి సమాయంలో ఎన్డీఏ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కేంద్రం బలహీనంగా ఉంటుందన్న సంకేతాలు వస్తాయి. అందుకే టీడీపీ ఎప్పుడూ ఎన్డీఏ నిర్ణయాలను వ్యతేరిస్తున్నట్లుగా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. మోదీ తీసుకుంటునన నిర్ణయాలను చంద్రబాబు సమర్థిస్తున్నారు. అందుకే అమీర్ బాబు అలియాస్ నవాబ్ జాన్ ప్రకటనకు అంత విలువ లేదని టీడీపీ వర్గాలంటున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
Vidadala Rajinivs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
CM Revanth Reddy: అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
TGPSC: ‘గ్రూప్‌-1’ పేపర్లు రీవాల్యూయేషన్ జరిపించండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు
‘గ్రూప్‌-1’ పేపర్లు రీవాల్యూయేషన్ జరిపించండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP DesamMS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP DesamSRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP DesamIshan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
Vidadala Rajinivs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
CM Revanth Reddy: అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
TGPSC: ‘గ్రూప్‌-1’ పేపర్లు రీవాల్యూయేషన్ జరిపించండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు
‘గ్రూప్‌-1’ పేపర్లు రీవాల్యూయేషన్ జరిపించండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
HIT 3 Movie: నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
Court Movie Collections: రూ.50 కోట్ల క్లబ్‌లో 'కోర్ట్' మూవీ - 10 రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు.. ఆడియన్స్ హిస్టారికల్ తీర్పు అంటూ..
రూ.50 కోట్ల క్లబ్‌లో 'కోర్ట్' మూవీ - 10 రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు.. ఆడియన్స్ హిస్టారికల్ తీర్పు అంటూ..
Ishan Kishan: ఫీల్టింగ్‌లో ఇషాన్ కిషన్‌కు గాయం!- వీడియో చూసి భయపడుతున్న హైదరాబాద్‌ ఫ్యాన్స్ 
ఫీల్టింగ్‌లో ఇషాన్ కిషన్‌కు గాయం!- వీడియో చూసి భయపడుతున్న హైదరాబాద్‌ ఫ్యాన్స్ 
Embed widget