Hijab Row: 'హిజాబ్' తీర్పు చెప్పిన జడ్జీలను చంపేస్తామని బెదిరింపులు- 'Y' కేటగిరీ భద్రత ఇచ్చిన సర్కార్
Hijab Row: హిజాబ్ వివాదంపై తీర్పు చెప్పిన న్యాయమూర్తులను చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వారికి 'Y' కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపింది.
Hijab Row: హిజాబ్ వివాదంపై తీర్పు చెప్పిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులకు 'Y' కేటగిరీ భద్రత కల్పించినట్లు సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఈ తీర్పు చెప్పిన జడ్జీల్లో ఇద్దరికీ బెదిరింపు కాల్స్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం అన్నారు.
Karnataka govt to provide 'Y' category security to judges who delivered hijab verdict
— ANI Digital (@ani_digital) March 20, 2022
Read @ANI Story | https://t.co/jW183Dg1YW#HijabVerdict #KarnatakaHC pic.twitter.com/mqbNwFdbCC
అరెస్ట్
జడ్డీలను బెదిరించిన కేసులో ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిలో ఒకర్ని తిరునెల్‌వేలీ, మరొకర్ని తంజావురులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ తమిళనాడు తువీద్ జమాత్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి చాలామందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హిజాబ్ తీర్పు
కొన్ని నెలలకు ముందు కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.
మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్' నినాదాలతో ర్యాలీలు చేశారు. దీంతో ఈ వివాదం దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.
Also Read: UP Auto Accident: బెలూన్ తగిలి ఆటో బోల్తా- ఇదేం హోలీరా నాయనా!
Also Read: Watch Video: మ్యాచ్ మధ్యలో కూలిన గ్యాలరీ- 200 మందికి గాయాలు, వీడియో చూశారా?