Delhi Blast : ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు తరువాత ఢిల్లీలో హై అలర్ట్, ఇంతకు ముందు ఎప్పుడు పేలుళ్లు జరిగాయి?
Delhi Blast : ఢిల్లీలో ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర కారులో పేలుడు సంభవించింది. పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ దుర్ఘటనోల 8 మంది మృతి చెందారు.

Delhi Blast : ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడు తర్వాత ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అధికారుల సమాచారం ప్రకారం, ఎర్రకోటకు సమీపంలో నిలిపిన కారులో పేలుడు సంభవించడంతో, సమీపంలోని అనేక వాహనాలకు మంటలు అంటుకున్నాయి, ఇందులో 8 మంది మృతి చెందగా, చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది.
#WATCH | Delhi: Fire tenders, ambulances, and senior police officials at the spot after a call was received regarding an explosion in a car near Gate No. 1 of the Red Fort Metro Station, after which three to four vehicles also caught fire and sustained damage
— ANI (@ANI) November 10, 2025
Multiple casualties… pic.twitter.com/GaWKizw7MN
ఢిల్లీ అగ్నిమాపక శాఖకు ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో పేలుడు జరిగిందని ఫోన్ ద్వారా సమాచారం అందిందని ఒక అధికారి తెలిపారు. ఈ పేలుడు కారణంగా సమీపంలో ఉన్న వాహనాలు కూడా దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. అధికారి ప్రకారం, ఆ ప్రాంతాన్ని మూసివేశారు.
ఢిల్లీలో ఎప్పుడు పేలుళ్లు జరిగాయి
#WATCH | Blast near Gate 1 of Red Fort Metro station | A Delhi Police official says, "As of now, I can't tell you anything. Investigation is being done." pic.twitter.com/GBGJlZZ18G
— ANI (@ANI) November 10, 2025
అక్టోబర్ 29, 2005: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, గోవింద్‌పురి, సరోజిని మార్కెట్‌లో మూడు పేలుళ్లు, 62 మంది మృతి, 210 మంది గాయపడ్డారు
ఏప్రిల్ 14, 2006: జామా మసీదులో రెండు బాంబు పేలుళ్లు, 14 మంది గాయపడ్డారు
సెప్టెంబర్ 13, 2008: ఢిల్లీలో ఐదు బాంబు పేలుళ్లు, 25 మంది మృతి, 100 మందికి పైగా గాయపడ్డారు
సెప్టెంబర్ 19, 2010: జామా మసీదు (ఢిల్లీ)లో కాల్పులు, పేలుడు, 2గురు గాయపడ్డారు
సెప్టెంబర్ 7, 2011: ఢిల్లీ హైకోర్టులో పేలుడు, 11 మంది మృతి, 64 మంది గాయపడ్డారు
సెప్టెంబర్ 27, 2008: ఢిల్లీలోని మెహ్రౌలీ ఫ్లవర్ మార్కెట్‌లో పేలుడు, 4గురు మృతి, 15 మంది గాయపడ్డారు
సెప్టెంబర్ 7, 2011: ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుడు, 15 మంది మృతి, 79 మంది గాయపడ్డారు
నవంబర్ 10, 2025: ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటకు సమీపంలో జరిగిన పేలుళ్లతో మొత్తం ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి, అనేక వాహనాలు, సమీపంలోని దుకాణాలు దెబ్బతిన్నాయి.
#WATCH | Delhi: Car parts seen strewn around due to the force of the blast
— ANI (@ANI) November 10, 2025
Multiple casualties have been brought to the LNJP hospital due to the blast near Gate No 1 of Red Fort Metro Station. Several people have been injured in the incident, sources tell ANI pic.twitter.com/UA8KDHqDTN





















