అన్వేషించండి

Bengaluru Taffic Jam: 2 గంటలకు కిలోమీటర్‌ కూడా కదలని వాహనాలు-బెంగళూరులో భారీ ట్రాఫిక్‌ జామ్‌

బెంగాళూరులో భారీ ట్రాఫిక్‌ జామ్‌తో ప్రజలు నరకం చూశారు. రెండు గంటలు గడిచినా కిలో మీటర్‌ కూడా కదల్లేదు వాహనాలు. స్కూల్‌ విద్యార్థులు రాత్రికి గాని ఇంటికి చేరుకోలేకపోయారు.

బెంగళూరు ప్రజలు బుధవారం భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఇంటికి బయటకు వచ్చిన వారు గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎటు చూసినా  ట్రాఫిక్‌ జామ్‌... కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలే కనిపించాయి. వాహనం ఒక ఇంచు కదలానన్న చాలా సమయం పట్టింది. దీంతో చాలా మంది గంటల తరబడి  రోడ్లపైనే పడిగాపులు కాశారు. 

కావేరీ జలాల వివాదంతో మంగళవారం బెంగళూరు బంద్‌ చేపట్టాయి కన్నడ సంస్థలు, రైతు సంస్థలు. ఆ తర్వాత రోజు బెంగళూరులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.  వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోయాయి. కొన్ని వాహనాలు రోడ్లపై బ్రేక్‌డౌన్‌ అవడంతో... ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరిగిపోయాయి. ముఖ్యంగా... బెంగళూరులోని ఔటర్  రింగ్ రోడ్ ప్రాంతం అత్యంత అధ్వాన్నంగా మారింది. ఓఆర్‌ఆర్‌పై దాదాపు ఐదు గంటలకుపైగా వాహనాలు నిలిచిపోవడంతో... వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. 

బుధవారం ఆఫీసుల నుంచి ఇంటికి తిరిగి వెళ్లేవారు.. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. రాత్రి 9గంటల వరకు ఆఫీసుల నుంచి ఎవరూ బయటకు రావొద్దని  అధికారులు ప్రకటించారంటే... పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థమవుతుంది. ఓఆర్‌ఆర్‌, మారతహళ్లి, సర్జాపూర్‌, సిల్క్‌బోర్డ్ మార్గాలు పూర్తిగా స్తంభించాయి. ఆ  మార్గాల్లో చిక్కుకున్న వాహనదారులకు చుక్కలు కనిపించాయి. రెండు గంటలు గచిడినా.. కిలోమీటర్‌ కూడా కదలేపరిస్థితి లేదంటూ వాహనదారులు గగ్గోలు పెట్టారు. నిన్నటి  ట్రాఫిక్‌ జామ్‌పై చాలా మంది తమ అనుభవాలను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. మూడు గంటలు గడిచినా ఒకటిన్నర కిలోమీటర్‌ కూడా కదల్లేదంటూ ఒకరు ట్వీట్‌  చేశారు. ఇంకోకరు... రెండు గంటలు గడిచినా కిలోమీటర్‌ కూడా ముందుకు కదల్లేకపోయామని వాపోయారు.

ఇక, స్కూల్‌ పిల్లల పరిస్థితి అయితే మరీ దారుణం. సాయంత్రం 4 గంటల సమయంలో స్కూల్‌ నుంచి బయటకు వస్తే... ఇంటికి చేరేందుకు రాత్రి 9గంటల సమయం పట్టినట్టు  సమాచారం. దీనికి సంబంధించిన స్క్రీన్‌ చాట్‌లు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కొన్ని స్కూల్‌ బస్సులు రాత్రి 8గంటలకు పిల్లలను ఇంటి దగ్గర దింపాయి.  మరోవైపు... పాదచారులకు చోటు లేకుండా పోయింది. ఫుట్‌పాత్‌లపై కూడా వాహనాలే కనిపించాయి. నడిచివెళ్లేవారు రోడ్డు దాటేందుకు కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది.  భారత పర్యటనలో ఉన్న హాస్యనటుడు ట్రెవర్‌ నోహ్‌... బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా... తన ప్రదర్శనలను రద్దు చేసుకున్నారు. 

రోజుకు ఒకటిన్నర నుంచి 2 లక్షల వరకు ఉండాల్సిన వాహనాల రద్దీ... బుధవారం సాధారణం కంటే రెండింతలు పెరిగిందని ట్రాఫిక్‌ పోలీసులు చెప్తున్నారు. IBI ట్రాఫిక్ నివేదిక  ప్రకారం.. బుధవారం రాత్రి 7:30 గంటల వరకు 3.59 లక్షల వాహనాలు తిరిగాయని తేలింది. వర్షం కారణంగా కొన్ని రహదారులపై నీరు నిలిచిపోవడం కూడా ట్రాఫిక్‌ సమస్యలు  కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన ఊరేగింపులు జరుగుతుండం కూడా కారణం కావొచ్చని చెప్తున్నారు.

భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో... ట్రాఫిక్‌ పోలీసులు కూడా ఏం చేయలేక చేతులెత్తేశారు. బెంగళూరు ట్రాఫిక్‌లో నరకం చూసిన వాహనదారులు మాత్రం అధికారుల తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి రావడానికి 5గంటల సమయం పట్టిందని మండిపడుతున్నారు. ట్రాఫిక్‌లో నరకం చూశామని ఆదేవన వ్యక్తం చేశారు.  ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
Embed widget