Hassan Sudden Heart Attacks: హాసన్ జిల్లాలో గుండెపోటు మరణాల కలకలం: వ్యాక్సిన్ కారణమా? ప్రభుత్వం, కేంద్రం స్పందన ఏమిటి?
Hassan Sudden Heart Attacks:హసన్ జిల్లాలో గుండెపోటు మరణాలు కలకలం రేపుతున్నాయి. దీనికి వ్యాక్సిన్ కారణమనే ప్రచారం జోరుగా సాగుతోంది. కర్ణాటక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రియాక్షన్ ఏంటీ?

Hassan Sudden Heart Attacks: కర్ణాటకలోని హసన్ జిల్లా పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇక్కడ ఒక్క నెలలోనే దాదాపు 25 మంది గుండెపోటుతో మరణించారు. దీనిపై అక్కడి ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది. అయితే దీనికి కరోనా వ్యాక్సిన్ కారణమనే ప్రచారం మొదలవ్వడంతో కేంద్రం కూడా స్పందించాల్సి వచ్చింది.
ఆట ఆడుతూనో, చదువుతూనో, జిమ్ చేస్తూ కుప్పుకూలిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అప్పటి వరకు ఎలాంటి అనారోగ్యాలు లేకపోయినా ఒక్కసారిగా ఇలా సడెన్ స్ట్రోక్‌తో చనిపోతున్న వారి జాబితా పెరుగుతోంది. అయితే అక్కడక్కడ జరగడం వేరు ఒకే ప్రాంతంలో భారీ సంఖ్యలో జరగడం వేరు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న హసన్ జిల్లాలో ఒకరిద్దరు కాదు 25 మంది వరకు గుండెపోటుతో మరణించడం సంచలనంగా మారుతోంది.
హసన్ జిల్లాలో నెల వ్యవదిళో చనిపోయిన వారిలో దాదాపు ఇరవై మంది కూడా యువకులే కావడం ఆందర్నీ కలవరపెడుతోంది. దీనిపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. యువకుల మరణంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర ఆరోగ్యం శాఖ మంత్రి దినేష్ గుండురావు కేసుల పెరగకుండా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. దీనిపై రివ్యూ చేసిన మంత్రి జిల్లాలో భారీ సంఖ్యలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
నెల రోజుల వ్యవధిలోనే భారీ సంఖ్యలో గుండెపోటు మరణాలకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీ వేశారు. జయదేవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ సి.ఎన్. రవీంద్ర ఈ కమిటీని లీడ్ చేయనున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు యువకుల్లో గుండెపోటుకు దారి తీసే పరిస్థితులు ఏంటీ? ఇలాంటివి జరగకుండా చేపట్టాల్సిన చర్యలు వివరించాలని కమిటీకి ఆదేశించి ప్రభుత్వం. సమగ్రదర్యాప్తు చేసి పదిరోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది.
ఈ మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణమే ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. చనిపోయిన వారిలో చాలా మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లేనని అంటున్నారు. దీనిపై మరిన్ని అనుమానాలు రేకెత్తించే విధంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా కామెంట్ చేశారు. అది కూడా కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం స్థాయి వ్యక్తి సందేహం పడటంతో దీనిపై మరింతగా ప్రచారం సాగింది.
Karnataka CM Siddaramaiah says, "In the past month alone, in just one district of Hassan, more than twenty people have died due to heart attacks. The government is taking this matter very seriously. To identify the exact cause of these series of deaths and to find solutions, a… pic.twitter.com/DjL9OUcdzq
— ANI (@ANI) July 1, 2025
గుండెపోటుతో ప్రజలు మరణించడానికి కోవిడ్ వ్యాక్సిన్ కారణమే జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. కోవిడ్ వ్యాక్సిన్‌తో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్ రావని స్పష్టం చేసింది. ఈ సైడ్‌ఎఫెక్ట్స్‌పై ఇక్కటికకే ఢిల్లీ ఎయిమ్స్, ఏసీఎంఆర్ అధ్యయనం చేసిందని గుర్తు చేసింది కేంద్రం. కోవిండ్ వ్యాక్సిన్‌తో ఎలాంటి గుండె జబ్బులు రావని తేలినట్టు పేర్కొంది. జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కూడా సూచించింది.
గుండెపోటుకు వేర్వేరు కారణాలు ఉండొచ్చని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు, వారి జీవనశైలిలో వచ్చే మార్పులు, ఇత ఆరోగ్య సమస్య కారణంగా గుండెపోటు రావచ్చని పేర్కొంది. ఈ మధ్య కాలంలో యువకుల ఆకస్మిక మరణాలు ఎక్కువగా ఉంటున్నందున వాటిపై కూడా ఐసీఎంఆర్ సర్వే చేసిందని కేంద్రం తెలిపింది. ఐసీఎంఆర్‌తోపాటు ఎన్‌సీడీసీ కూడా స్టడీ చేసినట్టు వెల్లడించింది. ఇంకో అధ్యయనం కూడా సాగుతున్నట్టు పేర్కొంది. జన్యుమార్పు కారణాలు, జీవనశైలిలో మార్పులు వల్లే ఇలాంటి మరణాలు సంభవిస్తున్నట్టు స్పష్టం చేసింది. తాజాగా నిర్వహిస్తున్న సర్వే ఫలితాలు వస్తే మరణాలపై మరింత క్లారిటీ వస్తుందని పేర్కొంది.
#WATCH | Chennai, Tamil Nadu: On Karnataka CM Siddaramaiah linking heart-related deaths in Hassan to Covid vaccine, Dr Manoj V Murhekar, Scientist and Director, ICMR-NIE says, "I heard about that news yesterday. About 20-odd sudden deaths in one district in period of about 2… pic.twitter.com/SAEl0XQR5k
— ANI (@ANI) July 2, 2025
కారణం ఏదైనా కావచ్చు కానీ హాసన్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలోనే 25 మందికిపైగా ప్రజలు మరణించడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం కర్ణాటక రాష్ట్రానికే పరిమితం కాలేదు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన మొదలైంది. పట్టుమని పాతికేళ్లు నిండని వ్యక్తులు కూడా కూర్చున్నచోట నిల్చున్న చోట కూలబడిపోతున్నారు. అప్పటి వరకు ఎలాంటి అనారోగ్యం కూడా లేని వాళ్లు ఇలా మృతి చెందడం కలవరపెడుతోంది.





















