Terror Suspects In Haryana: పాకిస్థాన్ నుంచి తెలంగాణకు భారీగా పేలుడు పదార్థాలు- నలుగురు అరెస్ట్!
Terror Suspects In Haryana: పాకిస్థాన్ నుంచి తెలంగాణకు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు తరలిస్తోన్న ముఠాను హరియాణా పోలీసులు పట్టుకున్నారు.
Terror Suspects In Haryana: హరియాణాలో గురువారం భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కర్నాల్ ప్రాంతంలో నలుగురు ఖలిస్థానీ టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు, టిఫిన్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు.
Four terror suspects detained in Haryana's Karnal, explosives recovered
— ANI Digital (@ani_digital) May 5, 2022
Read @ANI Story | https://t.co/K6spvfInIr#Haryana #karnal #Terrorists pic.twitter.com/vy4CXubaaq
తెలంగాణకు
Karnal Police detain four terror suspects, recover a large cache of explosives.#Karnal #Haryanapic.twitter.com/4jFwgLFUpT
— ABP LIVE (@abplive) May 5, 2022
బస్తారా టోల్ ప్లాజా సమీపంలో ఫిరోజ్‌పూర్‌కు చెందిన ముగ్గురు, లూథియానాకు చెందిన ఒక తీవ్రవాద అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటిలిజెన్స్ సమాచారంతో వీరిని పట్టుకున్నారు. నిందితులు పాకిస్థాన్ నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలను చేరవేస్తున్నట్లు తెలిసిందని కర్నాల్ ఎస్పీ తెలిపారు.
నిందితులను గుర్‌ప్రీత్, అమన్‌దీప్, పర్మీందర్, భూపిందర్‌గా గుర్తించారు. వీరి వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్యే ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు కర్నాల్ ఎస్పీ వెల్లడించారు. దేశంలో పెద్ద ఎత్తున ఉగ్ర దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా సమాచారం రావడంతో టోల్ ప్లాజా సమీపంలో తనిఖీలు చేసినట్లు తెలిపారు. వీరి వెనుక ఎవరున్నారనే విషయంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని ఎస్పీ అన్నారు.
డ్రోన్ ద్వారా
పాక్ సరిహద్దులు నుంచి ఫిరోజ్‌పూర్ జిల్లా వరకు డ్రోన్ సాయంతో పేలుడు పదార్థాలు గుర్‌ప్రీత్‌కు చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని కర్నాల్ ఎస్పీ తెలిపారు.
ఈ వ్యవహారంపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: Prashant Kishor Political Party: జగన్ బాటలో ప్రశాంత్ కిశోర్- 3వేల కిమీ పాదయాత్ర, ఆ తర్వాతే అన్నీ!
Also Read: Covid Update: కరోనాతో ఒక్కరోజులో 55 మంది మృతి- కొత్తగా 3,275 కేసులు నమోదు