Viral Video: ఇలా రిలీజ్ చేసి అలా అరెస్ట్- 'పుష్ప' రియాక్షన్ ఇచ్చిన జిగ్నేశ్!
గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ బెయిల్‌పై రిలీజ్ అయిన కాసేపటికే మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని అసోం పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద ట్వీట్ల కేసులో సోమవారం మేవానీ బెయిల్ పొందారు. అయితే కొద్దిసేపటికే కొత్త కేసులో జిగ్నేష్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Gujarat MLA Jignesh Mevani re-arrested soon after getting bail
— ANI Digital (@ani_digital) April 25, 2022
Read @ANI Story | https://t.co/92qnDaXHMs#JigneshMevani #JigneshMevaniarrested #GujaratMLAJigneshMevani pic.twitter.com/Y5Gu1vzGWr
అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పుష్ప సినిమాలోని రియాక్షన్ ఇచ్చారు జిగ్నేష్. ఆయుధాలతో పోలీసులు పక్కన ఉన్న సమయంలో జిగ్నేష్.. కెమెరా వైపు చూసిన జిగ్నేష్ 'తగ్గేదేలే' అంటూ రియాక్షిన్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
गुजरात कांग्रेस विधायक जिग्नेश @jigneshmevani80 भाई को देखें और वाइरल करें।
— Sandeep Singh (@ActivistSandeep) April 25, 2022
झुकेगा नहीं यह मोदी के आगे।@ReallySwara @
pic.twitter.com/9rgs3cdTLI
రెండో కేసు ఏంటి?
జిగ్నేష్‌ను రెండోసారి అరెస్ట్ చేసిన కేసేంటో పోలీసులు ఇప్పటి వరకు వరకు వెల్లడించలేదు. గత బుధవారం రాత్రి 11 గంటల సమయంలో గుజరాత్‌లోని పాలంపూర్ ప్రాంతంలో జిగ్నేష్ మేవానీని అసోంకు చెందిన పోలీసు బృందం అరెస్ట్ చేసింది. ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ జిగ్నేష్ మేవానీ చేసిన రెండు ట్వీట్లే ఇందుకు కారణం. ట్వీట్లపై అభ్యంతరం తెలుపుతూ అసోంకు చెందిన ఓ వ్యక్తి స్థానిక కోక్రఝర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నేరపూరిత కుట్ర, మతఘర్షణలకు దారితీసేలా రెచ్చగొట్టడంతోపాటు ఇతర అంశాలను పేర్కొన్న పోలీసులు విచారణ నిమిత్తం మేవానీని అరెస్ట్ చేశారు. అయితే ఆ కేసులో బెయిల్‌పై జిగ్నేశ్ విడుదలైన కాసేపటికే అసోం పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అియితే జిగ్నేశ్‌ను ఏ కేసులో అరెస్ట్ చేశారనే దానిపై పోలీసులు స్పందించలేదు. జిగ్నేశ్‌ను వెంటనే అక్కడి నుంచి పోలీసులు తరలించారు.
Also Read: Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులపై హైకోర్టు ఆగ్రహం- ఆ పిటిషన్ తిరస్కరణ
Also Read: Military Expenditure: ఆ విషయంలో మూడో స్థానంలో భారత్- చైనా, అమెరికాకు పోటీగా