News
News
X

పండగొచ్చేసింది - 78 రోజుల బోనస్, పేదలకు రేషన్ ఫ్రీ- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

దసరా పండుగ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం పలువురికి గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో మూడు నెలలు పొడగిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది.

FOLLOW US: 

పేదలకు అందిస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కేంద్ర ఖజానాపై 44 వేల 700 కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయం వల్ల అధిక ద్రవ్యోల్బణం నుంచి పేదలకు ఊరట కల్పించనుంది దాంతో పాటు త్వరలో జరిగే గుజరాత్ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కల్గే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రం కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 80 కోట్ల మంది పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ పథకం సెప్టెంబర్ 30న ముగియనుండటం వల్ల డిసెంబర్ 31 వరకు పొడగిస్తూ.. కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 

10 వేల కోట్లతో అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఆమోదం..

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదకునేందుకు కేంద్రం 2022 ఏప్రిల్ లో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను ప్రారంభించింది. దిల్లీ, ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లను 10 వేల కోట్లతో అభివృద్ధి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రోజుకు 50 లక్షల మంది ప్రయాణించే 199 రైల్వే స్టేషన్లను తొలి దశలో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 47 రైల్వే స్టేషన్లకు సంబంధించి టెండర్లు పూర్తికాగా 32 రైల్వే స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయి. దిల్లీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను మూడున్నరేళ్లు, ముంబయి, అహ్మదాబాజద్ రైల్వే స్టషన్లపనులును రెండున్నరేళ్లలో పూర్తి చేయనున్నారు. 

అలాగే మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక ఇచ్చింది కరవు భత్యం - డీఏ నాలుగు శాతాన్ని పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరనుంది. ఈ నిర్ణయం వల్ల సుమారు 41.8 లక్షల మంది ఉద్యోగులు 69.76 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కల్గనుంది. పెంచిన డీఏను జులై ఒకటో తేదీ నుంచి వర్తింపజేయనున్నాడు. డీఏ పెంపు వల్ల కేంద్ర ఖజానాలపై ఈ ఏడాది రూ21.421 కోట్ల భారం పడనుంది. 

News Reels

సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా బొనాంజా..

తెలంగాణ పెద్ద పండుగ దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ సింగ‌రేణి ఉద్యోగుల‌కు శుభవార్త చెప్పారు. సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ ద‌స‌రా కానుక ప్రక‌టించారు. సింగరేణి సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ విజయదశమి లోపు ఈ వాటా మొత్తాన్ని ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. 368 కోట్ల రూపాయలను అర్హులైన ఉద్యోగులకు సింగ‌రేణి సంస్థ చెల్లించ‌నుంది.

గత ఆర్థిక సంవత్సరం లాభాల్లో వాటా..

2021 -22 సంవత్సరానికి గాను సింగరేణి కాలరీస్ సంస్థ సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను సింగరేణి ఉద్యోగులకు అందించనున్నారు. ఈ మొత్తాన్ని సింగరేణిలో అర్హులైన ఉద్యోగులకు, సిబ్బందికి దసరా కానుకగా అందించాలని  సీఎం కేసీఆర్ బుధవారం నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి   కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని (Dasara Bonus) మొత్తాన్ని దసరా పండుగ లోపు వెంటనే చెల్లించాల్సిందిగా, సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

Published at : 28 Sep 2022 09:43 PM (IST) Tags: government Railway Employees Free Ration Scheme Central Government Govr Good News

సంబంధిత కథనాలు

Christmas Tree: క్రిస్మస్‌ పండుగలో క్రిస్మస్‌ చెట్టును ఎందుకు ఉంచుతారో తెలుసా ?

Christmas Tree: క్రిస్మస్‌ పండుగలో క్రిస్మస్‌ చెట్టును ఎందుకు ఉంచుతారో తెలుసా ?

Success of Parachute Oil: ప్యారాచూట్‌ ఆయిల్‌ సక్సెస్‌కు ఎలుకలు కారణమా ! దాని వెనుక అంత కథ ఉందా

Success of Parachute Oil: ప్యారాచూట్‌ ఆయిల్‌ సక్సెస్‌కు ఎలుకలు కారణమా ! దాని వెనుక అంత కథ ఉందా

Assam News: ర్యాగింగ్ భరించలేక బిల్డింగ్‌ పైనుంచి దూకేసిన విద్యార్థి- ఘటనపై సీఎం సీరియస్!

Assam News: ర్యాగింగ్ భరించలేక బిల్డింగ్‌ పైనుంచి దూకేసిన విద్యార్థి- ఘటనపై సీఎం సీరియస్!

Rajasthan Congress Crisis: 'ఆ విభేదాల ప్రభావం జోడో యాత్రపై ఉండదు- అదే నా లక్ష్యం'

Rajasthan Congress Crisis: 'ఆ విభేదాల ప్రభావం జోడో యాత్రపై ఉండదు- అదే నా లక్ష్యం'

Bhagat Singh Koshyari: రాజీనామాకు సిద్ధమైన మహారాష్ట్ర గవర్నర్- వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి!

Bhagat Singh Koshyari: రాజీనామాకు సిద్ధమైన మహారాష్ట్ర గవర్నర్- వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి!

టాప్ స్టోరీస్

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్