(Source: ECI/ABP News/ABP Majha)
UDAN Scheme: ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
Flight Journey: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉడాన్ పథకం ద్వారా అతి తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేయొచ్చు.
Government UDAN Scheme Details: విమానం ఎక్కాలి కానీ, బడ్జెట్ లేదని ఎప్పట్నుంచో బాధ పడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. కేవలం 500/- రూపాయల్లోపే మీరు దాదాపు గంట విమాన ప్రయాణం చేయొచ్చు. ఆలస్యం చేయకుందా వివరాలు చూసెయ్యండి.
జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలనేది ప్రతీ పేద, మధ్యతరగతి కుటుంబాల కల. సామాన్య ప్రజలకూ విమాన సర్వీసులను అందించటానికి ఉడాన్ అనే ఒక పథకం ఉందని చాలా మందికి తెలియదు. ఈ స్కీం ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఎంతో మంది పేద ప్రజలు తమ కలను సార్థకం చేసుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం 2016 లో ఈ ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) (UDAN) స్కీం ప్రారంభించింది. రీజనల్ కనెక్టివిటీ లక్ష్యంగా ఇలాంటి సేవలను ప్రారంభించిన తొలి ప్రభుత్వం ఇండియానే. ఉడాన్ పథకం కింద హెలికాప్టర్, సీప్లేన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకంలో భాగంగా సిమ్లా నుంచి మొదటి విమానం ప్రారంభమైంది.
కేవలం 349/- రూపాయలకే విమాన ప్రయాణం
సాధారణంగా ఉడాన్ స్కీం తో ఫ్లైట్ బుక్ చేసుకుంటే కేవలం 500/- నుంచి 2500/- రూపాయలతో ప్రయాణం చేయొచ్చు. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి 500/- కంటే తక్కువ టికెట్ ఖర్చుతో ప్రయాణం చేసే అవకాశం ఉంది. నమ్మట్లేదు కదా? కేవలం 349/- రూపాయలతో అస్సాం లోని తేజ్ పూర్ నుంచి 50 నిమిషాల విమాన ప్రయాణం చేయొచ్చు. అదొక్కటే కాదు. చాలా తక్కువ ఖర్చుతో సౌత్ ఇండియాలో కూడా ఎన్నో ప్రాంతాల విమానాశ్రయాల నుంచి ఈ పథకం అందుబాటులో ఉంది. దేశంలో 22 రూట్లకు టికెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. అంతేగాక సౌత్ ఇండియాలో కూడా కొచ్చి- సేలం, బెంగళూరు-సేలం వంటి రూట్లకు ఈ 1000/- లోపే ఈ ధరలు ఉన్నాయి. ఆ 22 రూట్లు కూడా తెలుసుకోండి.
బటిండా- ఢిల్లీ
సింలా-ఢిల్లీ
ఆగ్రా-జైపూర్
గ్వాలియర్-ఢిల్లీ
గ్వాలియర్-లక్నో
కడప-చెన్నై
కడప-విజయవాడ
లుథియానా-ఢిల్లీ
పథాన్ కోట్-ఢిల్లీ
విద్యానగర్-హైదరాబాద్
బుర్న్ పూర్ - కోల్కత్తా
కూచ్ బెహార్-కోల్ కతా
జమ్షెద్ పూర్-కోల్ కతా
భావ్నగర్-అహ్మదాబాద్
భావ్నగర్-సూరత్
ఢయ్యూ-సూరత్
కండా-ముంబై
ఖాన్ పూర్-ఢిల్లీ
ఖాన్ పూర్- వారణాసి
ముంద్రా-అహ్మదాబాద్
పంత్ నగర్-డెహ్రాడూన్
ఇవే కాకుండా కొన్ని వందల రూట్లలో ఉడాన్ పథకం కింద 2500/- లోపు టికెట్ ఖర్చుతో విమానాలు నడుస్తున్నాయి. చిన్న ప్రాంతీయ పట్టణాల్లోని 50 విమానాశ్రయాలను పునరుద్ధరించటానికి, తద్వారా సామాన్యులు పట్టణాలకు సులభంగా రాకపోకలు చేయటానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంతేగాక టూరిజం అభివృద్ధి చేయటం కూడా ఈ పథకం యొక్క మరో లక్ష్యం.
అయితే "క్రిషి ఉడాన్" ను ప్రవేశపెట్టి కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు కూడా ఉపకారం అందేలా చేసింది. 2020 ఆగస్టులో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది. దీనితో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు చేరవేసుకునేందుకు విమాన సేవలు వాడుకోవచ్చు. ఇది వేగంగా కొనసాగటం వల్ల రైతులు ఎంతో లాభపడుతున్నారు.
ఈ టికెట్లపై సేవా పన్ను కూడా రాయితీ ఉంటుంది. విమాన ప్రయాణం చేసే స్థోమతలేనివారు, రైతులు మొదలైనవారు ఈ పథకాన్ని ఉపయోగించుకొని లబ్దీ పొందవచ్చు. ఈ స్కీం కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అఫిషియల్ వెబ్సైట్లో చూడండి.