గగన్‌యాన్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన కేంద్రమంత్రి, స్పేస్‌లోకి ఫిమేల్ రోబో
Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా స్పేస్‌లోకి ఫిమేల్ రోబోని పంపనున్నారు.
Gaganyaan Mission:
ఫిమేల్ రోబో వ్యోమ్‌మిత్ర
దేశమంతా చంద్రయాన్ 3 సక్సెస్ గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉంది. ఇతర దేశాలు అసాధ్యం అనుకున్న పనిని భారత్ చేసి చూపించింది. అత్యంత క్లిష్టమైన వాతావరణం ఉండే చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే విక్రమ్ ల్యాండ్ అయ్యేలా కృషి చేసింది. చంద్రయాన్ సక్సెస్ అయిన క్రమంలోనే ఫ్యూచర్ ప్లాన్స్‌నీ సిద్ధం చేసుకుంటోంది ఇస్రో. త్వరలోనే గగన్‌యాన్ మిషన్‌కి సిద్ధమవుతోంది. ఈ మిషన్‌పై ఇప్పటికే అంచనాలు పెరగ్గా...కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఓ సదస్సులో పాల్గొన్న ఆయన..గగన్‌యాన్ గురించి ప్రస్తావించారు. ఈ మిషన్‌లో భాగంగా భారత్ ఓ ఫిమేల్ రోబోని (Female Robot) స్పేస్‌లోకి పంపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ మొదటి వారంలోనే ఇందుకు సంబంధించిన ట్రయల్స్ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఫిమేల్ రోబో Vyommitra ను అంతరిక్షంలోకి పంపుతామని తెలిపారు.
"కరోనా సంక్షోభం కారణంగా గగన్‌యాన్ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఇప్పుడిప్పుడే మళ్లీ పనుల వేగం పెరుగుతోంది. అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో ట్రయల్ మిషన్ ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి వ్యోమగాములను పంపడం ఎంత ముఖ్యమో..వాళ్లను జాగ్రత్తగా మళ్లీ భూమిపైకి తీసుకురావడమూ అంతే ముఖ్యం. ఈ మిషన్‌లో ఓ ఫిమేల్ రోబోని పంపాలనే యోచనలో ఉన్నాం. మనిషి చేసే పనులన్నీ ఈ రోబో చేయగలదు. అంతా పర్‌ఫెక్ట్‌గా ఉందనుకున్నాకే ముందుకెళ్తాం"
- జితేంద్ర సింగ్, కేంద్రమంత్రి
ఒత్తిడికి గురయ్యాం..
చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సేఫ్‌గా ల్యాండ్ అయినప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నామని, అప్పటి వరకూ ఒత్తిడి తప్పలేదని వెల్లడించారు జితేంద్ర సింగ్.
"ఇస్రో టీమ్‌తో చాలా కాలంగా అసోసియేట్ అవుతున్నాం. అప్పటి నుంచే చంద్రయాన్-3పై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ భూ కక్ష్యను వీడిపోయి చంద్రుని కక్ష్యలోకి ఎంటర్ అయినప్పటి నుంచి నెర్వస్‌గా ఫీల్ అయ్యాం. కానీ...చివరకు స్మూత్ ల్యాండింగ్ అవ్వడం వల్ల ఊపిరి పీల్చుకున్నాం. ఇస్రో ప్రయాణంలో ఇదో మైలురాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్పేస్ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే ఇది సాధ్యమైంది. 2019 వరకూ శ్రీహరి కోట స్పేస్ సెంటర్ తలుపులు మూసే ఉన్నాయి. కానీ ఈ సారి విద్యార్థులు వచ్చి చూసేందుకు అనుమతిచ్చాం. పిల్లలే చంద్రయాన్ 3ని ఓన్ చేసుకున్నారు"
- జితేంద్ర సింగ్, కేంద్రమంత్రి
చంద్రయాన్ -3 విజయంతో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశామన్నారు నరేంద్ర మోదీ. ఇస్రో వెళ్లిన ఆయన చంద్రయాన్ -3 టీంను అభినందించారు. చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి శివశక్తిగా నామకరణం చేద్దామని ప్రతిపాదించారు. బెంగళూరులోని ఇస్రో కమాండ్ సెంటర్‌లో శాస్త్రవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. చంద్రయాన్-3ని చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ చేసిన ఇస్రో బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా మూడు కీలక ప్రకటనలు చేశారు. చంద్రయాన్ -3 దిగిన ప్రదేశాన్ని 'శివశక్తి' పాయింట్ అని, చంద్రయాన్ -2 ల్యాండ్ అయిన ప్రదేశాన్ని 'తిరంగా' పాయింట్ అని పిలుద్దామని ప్రకటించారు. ప్రతి ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు.
Also Read: తలుపులు మూసుకుపోయాయి, ఎలాగోలా పగలగొట్టి బయటపడ్డాం - తమిళనాడు రైలు ప్రమాద బాధితులు