అన్వేషించండి

G20 Summit: ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షం, ఏ ప్రాంతాల్లోనంటే?

G20 Summit: దేశరాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

G20 Summit: దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కురుస్తోంది. రాజధాని నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. ఢిల్లీలోని వసంత్ కుంజ్, మునిర్ఖా ఎన్‌క్లేవ్‌, లజ్‌ పత్‌ నగర్, ఎన్ఏఐ ప్రాంతంలో రాత్రి నుంచి వాన పడుతోంది. అయితే వర్షం కారణంగా ఢిల్లీలో కాలుష్యం తగ్గింది. రానున్న రెండు, మూడు రోజుల్లో బలమైన గాలులు, తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం, సాయంత్రం కూడా తేలికపాటి వర్షాలు ఢిల్లీని చల్లబరిచే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 

అట్టహాసంగా ప్రారంభమైన జీ20 సదస్సు

జీ20 సమావేశాల వేళ భారత ప్రతిష్ఠ మరింత ఇనుమడించనుంది. పెట్టుబడులు పెట్టేందుకు మనల్ని మించిన దేశం మరొకటి లేదని చాటే తరుణం వచ్చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మరొకటి లేదని.. మనకు పోటీ ఎవరూ లేరని గర్వపడే క్షణాలు వచ్చేశాయి. చైనాకు తాము మాత్రమే చెక్‌ పెట్టగలమని ప్రధాని నరేంద్రమోదీ తమ చేతలతో చూపించారు. భారత స్టాక్‌ మార్కెట్లు జీవిత కాల గరిష్ఠాల్లో కొనసాగుతుండటం, మార్కెట్‌ విలువ 3.8 లక్షల డాలర్లకు చేరుకోవడాన్ని ఆయన ఆస్వాదిస్తున్నారు.

భారత అభివృద్ధి చూపింపేందుకు స్టాక్‌ మార్కెట్‌ ఒక కొలమానం. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లన్నీ ఇబ్బందులు పడుతుంటే మన స్టాక్‌ మార్కెట్లు మాత్రం పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడుల వర్షం  కురిపిస్తున్నారు. రిటైల్‌ బూమ్‌ ఆకాశాన్ని తాకుతోంది. చిన్న చిన్న ఇన్వెస్టర్లూ నిస్సంకోచంగా షేర్లను కొంటున్నారు. భారీ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు, ఇతర సంస్థలు దివాలా తీస్తుండటంతో చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడుతోంది. తయారీ రంగం దెబ్బతి టోంది. కంపెనీల అక్కడ నుంచి భారత్‌కు తరలి వస్తున్నాయి. ఇప్పటికే ఆపిల్‌, సామ్‌సంగ్‌ వచ్చేశాయి. 

పెట్టుబడులకు అత్యంత సురక్షితంగా ఉన్న మార్కెట్‌ భారత్‌ మాత్రమేనని మార్కెట్ మనీ మేనేజర్లు అంటున్నారు. గోల్డ్‌మాన్‌ సాచెస్‌ గ్రూప్‌ చైనాకు అండర్‌ వెయిట్‌ ర్యాంకు ఇచ్చింది. 'స్థానిక అభివృద్ధి, విధాన సంస్కరణలు, తిరుగులేని రుణాభివృద్ధి భారత మార్కెట్లకు ఊతమిస్తోంది' అని స్టాండర్డ్‌ ఛార్టెడ్‌ బ్యాంకు ఎస్‌జీ లిమిటెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్టు ఔడ్రె గో అంటున్నారు. భిన్న ధ్రువాలుగా మారుతున్న ప్రపంచం భారత్‌కు లాభమని తెలిపారు.

ఈ వారం భారత స్టాక్‌ మార్కెట్ల విలువ 3.8 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. సరిగ్గా జీ20 సమావేశాల జరుగుతున్న తరుణంలో ఈ ఘనత సాధించడం ప్రధాని నరేంద్రమోదీకి మరో గుర్తింపు తీసుకొచ్చింది. భౌగోళిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు భారత్‌ పెట్టుబడులకు అత్యంత సురక్షితం అని చాటేందుకు ఆయనకు మళ్లీ అవకాశం దొరికింది. చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలని పశ్చిమ దేశాలు తహతహలాడుతున్న వేళ ప్రత్యేక టారిఫ్‌లు, ఇన్‌సెంటివ్స్‌తో ఆయన పెద్ద కంపెనీలను ఇటు  వైపు రప్పించారు. ఇప్పటికే ఆపిల్‌, సామ్‌సంగ్‌ ఉత్పత్తిని మొదలు పెట్టాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget