G20 Summit 2023: ఎయిర్‌లైన్స్ పైనా G20 ఎఫెక్ట్, 160 విమానాలు రద్దు - డొమెస్టిక్ ఫ్లైట్స్‌పైనే ఆంక్షలు
G20 Summit 2023: G20 భద్రతా కారణాల దృష్ట్యా 160 విమానాలను రద్దు చేశారు.
G20 Summit 2023:
160 విమానాలు రద్దు..
G20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) కీలక నిర్ణయం తీసుకుంది. G20 ఆంక్షల కారణంగా 160 విమానాలను రద్దు చేశారు. విమానాశ్రయ ప్రతినిధి ఈ విషయం వెల్లడించారు. ఈ కారణంగా కనీసం 80 విమానాల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని, ఈ సమ్మిట్ జరిగే రెండు రోజుల పాటు విమానాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్పేస్ కేటాయించామని తెలిపారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
"G20 భద్రతా కారణాల దృష్ట్యా విమానాల సర్వీస్‌లను రద్దు చేయాలని రిక్వెస్ట్‌లు వచ్చాయి. ఈ మూడు రోజుల పాటు దాదాపు 80 డిపార్టింగ్ ఫ్లైట్స్‌తో పాటు, 80 అరైవింగ్ విమానాల సేవలను రద్దు చేశాం. ఈ ఆంక్షలు కేవలం డొమెస్టిక్ సర్వీసెస్‌కి మాత్రమే పరిమితం. అంతర్జాతీయ విమానాలు యథావిధిగా నడుస్తాయి. ఈ ఆంక్షల వల్ల ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం"
- ఇందిరాగాంధీ విమానాశ్రయ ప్రతినిధి
#ImportantUpdate Customers are requested to visit https://t.co/9eL33MOZYU to check their flight status. pic.twitter.com/zfBNl3wr3W
— Vistara (@airvistara) September 5, 2023
కంపెనీల ట్వీట్‌లు..
ఈ ఆంక్షలకు అనుగుణంగా కంపెనీలు ప్యాసింజర్స్‌కి సమాచారం అందిస్తున్నాయి. రీషెడ్యూల్ చేసుకోవాలని చెబుతోంది. Vistara, Air India సంస్థలు ప్యాసింజర్స్ ట్రావెలింగ్ డేట్స్‌ని రీషెడ్యూల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ట్విటర్‌లో అధికారికంగా పోస్ట్‌లు పెడుతున్నాయి. కొన్ని ఫ్లైట్స్‌ని రద్దు చేస్తున్నట్టు Vistara ట్వీట్ చేసింది. సెప్టెంబర్ 8-11 మధ్య తేదీల్లో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లు ఎప్పటికప్పుడు స్టేటస్‌ని చెక్ చేసుకోవాలని సూచించింది. రీషెడ్యూల్ చేసుకోని వాళ్లకు రీఫండ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.
Important Announcement: There will be traffic restrictions in Delhi between 7th and 11th September 2023. As a measure of goodwill, passengers holding confirmed ticket to fly to or from Delhi on these dates are being offered a one-time waiver of applicable charges, if they wish to…
— Air India (@airindia) September 5, 2023
ప్రముఖులు హాజరు..
సెప్టెంబర్ 9,10వ తేదీల్లో G20 సదస్సు జరగనుంది. ఢిల్లీలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌లో భారత్ మండపంలో ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రగతిమైదాన్‌లోని ఎగ్జిబిషన్ సెంటర్‌లోనూ సదస్సు జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా ఈ సదస్సులో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాత్రం హాజరు కావడం లేదు. ఆయా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు.
Also Read: ఓసారి రాజ్యాంగం చదవండి, అందులో "భారత్" కనిపిస్తుంది - విపక్షాలకు జైశంకర్ కౌంటర్