ఓసారి రాజ్యాంగం చదవండి, అందులో "భారత్" కనిపిస్తుంది - విపక్షాలకు జైశంకర్ కౌంటర్
S Jaishankar: విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇండియా పేరు మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
S Jaishankar Interview:
భారత్ పేరుపై జైశంకర్ వ్యాఖ్యలు..
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. ఇండియా పేరుని భారత్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనల నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగంలో "Bharat"అనే పేరు మెన్షన్ చేసే ఉందని తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 9న జీ 20 సదస్సు ముగియనుంది. ఈ సందర్భంగా విపక్షాలకు ప్రత్యేక విందుకు ఆహ్వానించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అయితే...ఈ ఇన్విటేషన్ కార్డ్‌లో President of Bharat అని ఉండటంపై విపక్షాలు మండి పడుతున్నాయి. దీనిపై స్పందించిన జైశంకర్...రాజ్యాంగంలో India తో పాటు గా Bharat అని కూడా పేర్కొన్నట్టు చెప్పారు.
"ఇండియా అంటే భారత్. మన దేశ రాజ్యాంగంలోనూ ఈ పేరు ఉంది. విపక్షాలకు నా విజ్ఞప్తి ఒక్కటే. దయచేసి మన రాజ్యాంగాన్ని పూర్తిగా చదవండి. భారత్ అనే పదానికి ఓ అర్థం ఉంది"
- ఎస్ జైశంకర్, విదేశాంగ శాఖ మంత్రి
#WATCH | EAM Dr S Jaishankar speaks on the row over invitation cards to the G20 Summit, mentioning 'Bharat', India/Bharat debate
— ANI (@ANI) September 6, 2023
"India, that is Bharat - it is there in the Constitution. I would invite everybody to read it...When you say Bharat, in a sense, a meaning and an… pic.twitter.com/5tg6QTK86c
ఇదే ఇంటర్వ్యూలో G20 సమావేశాల గురించీ ప్రస్తావించారు జైశంకర్. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ రాకపోవడంపై స్పందించారు. వాళ్లకు బదులుగా ఆ దేశాలకు చెందిన ప్రతినిధులు వస్తున్నారని, వాళ్లతో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయని చెప్పారు. సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో G20 సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 20 దేశాలకు చెందిన ప్రతినిధులు వస్తుండడం వల్ల భద్రత కట్టుదిట్టం చేశారు."G20 కి కొందరు కీలక నేతలు రావడం లేదు. వాళ్లకుండే కారణాలు వాళ్లకు ఉండొచ్చు. కానీ...ఆ దేశాలకు చెందిన ప్రతినిధులు ఎవరు వచ్చినా ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టే. ఎవరైనా సరే ఈ సమ్మిట్‌ని సీరియస్‌గానే తీసుకుంటున్నారు. అయినా ఈ సమ్మిట్‌ని రాజకీయం చేయాల్సిన పని లేదు"
- ఎస్ జైశంకర్, విదేశాంగ శాఖ మంత్రి
On the Russian President Putin and Chinese President Xi Jinping not attending the G20 Summit in Delhi, EAM Dr S Jaishankar to ANI, "...I think, at different points of time in G20 there have been some Presidents or PMs who, for whatever reason, have chosen not to come themselves.… pic.twitter.com/uEuD4K5Bwq
— ANI (@ANI) September 6, 2023
Also Read: Special Parliament Session: కొత్త పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు, వినాయక చవితి రోజే ప్రారంభం