French President: రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా ఫ్రెంచ్ అధ్యక్షుడు, నేటి పర్యటన సాగుతుందిలా!
Emmanuel Macron: రిపబ్లిక్ వేడుకలకు భారత్ ముస్తాబయింది. ఏటా రిపబ్లిక్ వేడుకలకు కొత్త అతిథిని ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది గణతంత్ర దిన వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పాల్గొననున్నారు.
Republic Day Celebrations: రిపబ్లిక్ వేడుకల (Republic Day Celebrations)కు భారత్ (India) ముస్తాబయింది. భారత్ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఏటా రిపబ్లిక్ వేడుకలకు కొత్త అతిథిని ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది గణతంత్ర దిన వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు (French President) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) పాల్గొననున్నారు. ఈ నేపథ్యలో తర రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా మాక్రాన్ గురువారం జైపూర్ చేరుకోనున్నారు. జైపూర్‌లో అమీర్ కోట (Jaipur Amer Fort) నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. అక్కడ జరుగనున్న ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
అనంతరం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన జంతర్ మంతర్ (Jantar Mantar) కు వెళ్లి అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ని కలుస్తారు. ఇద్దరు నేతలు అక్కడ సందర్శించనున్నారు. జంతర్ మంతర్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద రాతి సూర్య గడియారం ఉంది. సవాయ్ జై సింగ్ నిర్మించిన 19 ఖగోళ పరికరాల సమాహారమే జంతర్ మంతర్. అనంతరం మాక్రాన్, మోదీ జంతర్ మంతర్ నుంచి సంగనేరి గేట్ వరకు రోడ్‌షోను నిర్వహిస్తారు. అలాగగే హస్తకళల దుకాణం, టీ షాప్‌ను సందర్శించే అవకాశం ఉంది.
అనంతరం ఇరువురు నేతలు చారిత్రక ఆల్బర్ట్ హాల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. రాంబాగ్ ప్యాలెస్ సందర్శనతతో మాక్రాన్ పర్యటన ముగుస్తుంది. అక్కడ ప్రధాని మోదీ మాక్రాన్‌కు ప్రైవేట్ విందును ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మాక్రాన్ సందర్శన నేపథ్యంలో రాజస్థాన్ పోలీసులు, జైపూర్ పరిపాలన సీనియర్ అధికారులు బుధవారం రిహార్సల్స్ నిర్వహించారు.
ఢిల్లీ షెడ్యూల్
ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఫ్రెంచ్ ఆర్మీకి చెందిన బృందం సిద్ధమైంది. భారత రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న ఆరో ఫ్రెంట్ లీడర్, ఐదో అధ్యక్షుడి ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిలిచారు. 2016లో ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండే, 2008లో నికోలస్ సర్కోజీ, 1998లో జాక్వెస్ చిరాక్, 1980లో వాలెరీ గిస్కార్డ్ డీ ఎస్టేయింగ్, 1976లో జ్వాక్వెస్ చిరాగ్ భారత గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు.
పరేడ్ తర్వాత మాక్రాన్ ఫ్రెంచ్ రాయబార కార్యాలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం ఆయన రాష్ట్రపతి భవన్‌లో 'ఎట్ హోమ్' కార్యక్రమంలో పాల్గొంటారు, ఆ తర్వాత అధికారిక విందు ఉంటుంది. మాక్రాన్ పర్యటన భారతదేశం, ఫ్రాన్స్ మధ్య 25 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీక నిలువనుంది. ఈ సందర్భంగా రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో ఇరు పక్షాలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
రక్షణ, భద్రత, స్వచ్ఛ ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, అధునాతన సాంకేతికతల విషయంలో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు పాల్గొనాలంటూ భారత్ మాక్రాన్‌కు ఆహ్వానం పంపింది. పలువురు మంత్రులు, సీఈఓలు, సాంస్కృతిక, వైజ్ఞానిక రంగాలకు చెందిన ప్రముఖులతో కూడిన ప్రతినిధి బృందంతో మాక్రాన్‌తో ప్రయాణిస్తారు.