Viral Video: చూస్తేనే ఒళ్లు గగుర్పొడిచే కోబ్రా - అలవోకగా పట్టేసుకున్న మహిళా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ - వీడియో వైరల్
KingCobra: 18 అడుగుల కింగ్ కోబ్రా కనిపిస్తే ఎవరికైనా తల ప్రాణం తోకకొస్తుదంి. కానీ కేరళకు చెందిన ఆ మహిళా ఫారెస్ట్ బీట్ కానిస్టేబుల్ మాత్రం.. సింపుల్ గా పట్టేసుకుంది.

KingCobra Caught: అటవీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లోకి పాములు రావడం సహజమే. అడవి జంతులు .. ఆయా గ్రామాల్లో రాకుండా చూసుకోవడం.. ఎవరూ వాటికి హాని తలపెట్టకుండా చూసేందుకు ఫారెస్ట్ బీట్ ఆపీసర్లు ఉంటారు. వీరు కూడా మనుషులే. అయితే కొంత మంది అత్యంత ధైర్యవంతులుఉంటారు. అలాంటివారిలో రోష్ని అనే మహిళా బీట్ కానిస్టేబుల్ భిన్నం. ఎందుకంటే ఆమె సాహసం చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయిపోతుంది.
కేరళలోని తిరువనంతపురం పరుతిపల్లి రేంజ్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జి.ఎస్. రోష్ని పని చేస్తున్నారు. అక్కడ నీటి ప్రవాహాలు ఉంటాయి. స్థానికులు కొందరు స్నానం చేస్తూండగా..18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా కనిపించింది. వెంటనే వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన రోషి చాలా అలవోకగా కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందది.
రోష్ని స్నేక్ క్యాచర్ ఎక్స్ పర్ట్. కేరళ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తూ 800కు పైగా విషపూరిత , విషరహిత పాములను రక్షించారు. అయితే కింగ్ కోబ్రాను ఇప్పటి వరకూ ఎప్పుడూ కాపాడలేదు. మొదటి కింగ్ కోబ్రా రెస్క్యూ మిషన్‌గా ఆరు నిమిషాల్లోనే విజయవంతంగా పూర్తి చేశారు.
Forest Beat Officer Roshni of Paruthipalli Range did not flinch even after seeing this 18-foot long #KingCobra!
— Rajan Medhekar (@Rajan_Medhekar) July 7, 2025
It was was caught by her from the residential area of Anchumaruthumoot, Peppara, Thiruvananthapuram, #Kerala, after locals bathing in the stream spotted it today. pic.twitter.com/37IdVsw3mx
రోష్ని, పరుతిపల్లి రేంజ్ రాపిడ్ రెస్పాన్స్ టీమ్ (RRT) సభ్యురాలిగా, స్థానికుల నుండి సమాచారం అందిన వెంటనే ఐదుగురు సభ్యుల బృందంతో ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఆమె ఒక పొడవైన స్నేక్ హు , రెప్టైల్ క్యాచింగ్ బ్యాగ్‌ని ఉపయోగించి, ఎలాంటి రక్షణ గేర్ లేకుండా, పామును నిదానంగా, ధైర్యంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది,
WATCH | Beat Forest Officer GS Roshni captured a 15-foot-long King Cobra from a stream near Peppara in Thiruvananthapuram. The now-viral video has drawn praise and criticism for her grace and tactics. #DTNext #KingCobra #Kerala #Thiruvananthapuram #Snakes #SnakeRescue #Forests pic.twitter.com/0rrg4vUcLX
— DT Next (@dt_next) July 7, 2025
పట్టుకున్న కింగ్ కోబ్రాను సురక్షితంగా ఒక బ్యాగ్‌లో ఉంచి, ఆ తర్వాత దట్టమైన అడవిలో సహజ ఆవాసంలో విడుదల చేశారు. రోష్ని, వన్యప్రాణుల రక్షణ పట్ల తన అభిరుచి కారణంగా RRTలో చేరినట్లు తెలిపారు. ఆమె సాధారణంగా తన రెస్క్యూ మిషన్‌లను రికార్డ్ చేయడానికి అనుమతించరు. కానీ స్థానికులు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.





















